Skip to main content

Posts

Showing posts from June, 2025

మహానటి భానుమతి

మన తపాలా శాఖ 1-05-2025 న  వేవ్స్ -2025 ( World Audio Visual and Entertainment Summit (WAVES - 2025)  వేడుకలో ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  మన భారతీయ సినీ దిగ్గజాలగా పరిగణించబడే ఐదుగురు సినీ ప్రముఖుల తపాలా బిళ్లలతో ఉన్న ఈ మినియేచర్ లో మన తెలుగు చిత్ర సీమలో నటిగా , దర్సకురాలిగా, నిర్మాతగా, గాయనిగా ప్రసిద్ధి పొందిన మహానటి  భానుమతి గారి తపాలా బిళ్ళ ఉంది. వీరితో పాటు సినీ రంగ ప్రముఖులు  గురు దత్ , రాజ్ కోస్లా, రిత్విక్ ఘటక్, సలీల్ చౌదరి గార్లకు గౌరవం దక్కింది.  P. Bhanumathi -  World Audio Visual and Entertainment Summit (WAVES 2025)   ఇది భానుమతి గారిపై విడుదలైన రెండవ తపాలా బిళ్ళ. తెలుగు చిత్రరంగంలో ఈ అరుదైన ఘనత దక్కిన నటి భానుమతి గారే. ఇంతకుముందు మన భారతీయ చలన చిత్ర శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన తపాలా బిళ్లలలో వీరికి స్థానం లభించింది.  P  Bhanumathi An Indian actress, singer, film producer, director, music composer, and novelist, she is often regarded as the first female superstar of Telugu cinema. She also became the first fema...