సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందినఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. భారత జాతీయ కాంగ్రేసు తొలి మహిళా అధ్యక్షురాలు మరియుస్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు గా ప్రసిద్ది చెందారు.దండి సత్యాగ్రాం లోను,రౌండ్ టేబుల్ సమావేశంలోను మహాత్మా గాంధీ గారి తోపాటు పాల్గొంది.
సరోజినీ దేవి హైదరాబాదులో ఒక బెంగాలీ కుటుంబములో జన్మించినది. ఈమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ స్థాపకుడు, శాస్త్రవేత్త మరియు తత్వవేత్త. తల్లి బరదా సుందరి దేవి ఒక కవయిత్రి.ఈమె దక్షిణాదికి చెందిన డా. ముత్యాల గోవిందరాజులు నాయుడు ను ప్రేమించి, చదువు పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో వివాహము చేసుకున్నది. కులాంతర వివాహములకు సమాజము చాలా వ్యతిరేకముగా ఉన్న ఆ రోజుల్లో వీరి వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించాడు.
సరోజినీ దేవి ఉర్దూ, తెలుగు, ఆంగ్లము, పర్షియన్ మరియు బెంగాలీ భాషలు మాట్లాడేది.ఆమె ఇంగ్లీషులో కవిత్వం రాసింది. ది గోల్డెన్ త్రెషోల్డ్, ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్, పాలంక్వైన్ బేరర్స్ ఆమె కవితల్లో కొన్ని.హైదరాబాదు లోని గోల్డెన్ త్రెషోల్డ్ అనేపేరుతో గల ఆమె ఇంటిలో హైదరాబాద్ యూనివర్సిటీని నెలకొల్పారు.ఈమె గౌరవార్దం తపాల శాఖా 13-02-64 న ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.

Comments