Skip to main content

Posts

Showing posts with the label Meghadoot cards

కృష్ణ పుష్కరాలు - 2016

On the occasion of Krishna Pushkaralu 2016, A.P. postal circle released   a set of post cards and Special Covers  అంగరంగ వైభవంగా నవ్యఆంధ్రలో జరిగిన కృష్ణ పుష్కరాలు -2016 ( 12 నుండి 23 ఆగస్టు -16) సందర్భంగా  ఆంద్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ప్రత్యక తపాలా కవర్లు విడుదల చేసింది.  అమరావతి - ధ్యాన బుద్ధ  (10-08-2016) ఇంద్రకీలాద్రి - విజయవాడ  (10-08-2016) శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం -19-08-2016 శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం - శ్రీకాకుళం, కృష్ణ జిల్లా (16-08-2016) బాపు మ్యూజియం -విజయవాడ  (21-08-2016) గాంధీ హిల్ , విజయవాడ బుక్ ఫెస్టివల్ - 22-08-2016 ఇవేకాక కృష్ణ పుష్కరాలు జరిగే కృష్ణ నదీతీరాలలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ లలో ఉన్న 18 ముఖ్యమైన దేవాలయాల చిత్రాలు ఉన్న 18 ప్రత్యేక పోస్టల్ కార్డ్స్ ను కూడా ముద్రించారు. వీటిపై ఆయా ప్రాంతాల ప్రత్యేక తపాలా ముద్రలు ఉన్నాయి.  వీటిలో ఆంద్ర ప్రదేశ్ కు చెందిన సంఘమేశ్వరం, శ్రీశైలం , వేదాద్రి, అమరావతి, విజయవాడ, మోపిదేవి...

జలో రక్షతి రక్షితః

MEGHADOOT POST CARDS ON  GROUND WATER PROTECTION నీరే ప్రాణకోటికి జీవాధారం. అలాంటి జలాన్ని సంరక్షిస్తేనే మనం సుభిక్షితంగా జీవిస్తాం. ఈ సందేశాన్ని అందరికి తెలియజేయటానికి మన తపాల శాఖ మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ పై సందేశాలను ముద్రించింది.  2004 లో నార చంద్రబాబు అద్వర్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణ కొరకు నడుంకట్టి దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది. ఇంకుడు గుంటల ఆవశ్యకతను తెలియజేసి అదొక మహా యజ్ఞం లా చేపట్టింది. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన  25 పైసల ఈ 'మేఘదూత్ పోస్ట్ కార్డ్స్' ఇచ్చే సందేశాలు గమనించండి.  అయిన మనలో స్పందన లేదు. దాని పలితాన్ని ఇప్పుడు చూస్తున్నాం. అప్పటిలా ఈ యజ్ఞాన్ని అపహాస్యం చేయకుండా మనస్పూర్తిగా చేపడదాం.  రాష్ట్ర వ్యాప్తంగా భూగర్బ జలాల సంరక్షణకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలపండి. స్వర్ణ ఆంధ్రకు జై కొట్టండి.   జలో రక్షతి రక్షితః నీరు లేక ప్రగతి లేదు - నీరు లేక జగతి లేదు  భూగర్బ జలం అముల్యమైనది -దానిని ఆదాచేయండి, కాపాడండి . Ground Water is Precious ... Save it and Protect it Ground Water is ...

గోదావరి పుష్కరాలు - మేఘదూత్ పోస్ట్ కార్డ్స్

గోదావరి నది  భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి దక్షిణ మధ్య భారత దేశము గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది. తరువాత అదిలాబాదు, కరీంనగర్, వరంగల్,ఖమ్మం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములోసంగమిస్తుంది.ప్రతి పండెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి. ప్రతి 12 వ పుష్కరం ను మహా పుష్కరం అని అంటారు . ఇది 144 ఏళ్లకు ఒక సారి వస్తుంది.  2015 జూలై 14 నుండి గోదావరికి మహా పుష్కరాలు జరుగుతాయి. ఈ సందర్బంగా మన తపాల శాఖ తెలుగు మరియు హిందీ భాషలలో రెండు మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ ను విడుదల చేసింది.  MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2015   MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2015   గోదావరి పుష్కరాలు-2003(30-07-2003 నుండి 10-08-2003 ) కు రాజమండ్రి కి  యాత్రికులకు స్వాగతమ పల...

సమ్మక్క - సారలమ్మ జాతర

MEGADOOTH POST CARD ON -  Sammakka , Sarakka Jatara, Issued in Feb.2006  సమ్మక్క - సారలమ్మ జాతర కు( 15-2-2006 to 18-2-2006)  భక్తులకు ఆహ్వానం పలుకుతూ విడుదలైన మేఘదూత్ పోస్ట్ కార్డు సమ్మక్క సారక్క జాతర    అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.వరంగల్లు జిల్లాకేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములోతాడ్వాయి మండలములో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారం లో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈచారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.  కాకతీయ ప్రభువు ప్రతాప రుద్రుడికి కప్పం కట్టటానికి నిరాకరించి ఆయనపై  తిరుగు బాటు చేసి వీరమరణం పొందిన గిరిజన మహిళలు  సమ్మక్క, సారక్క  అని ఒక ఉవాచ. దీనికి ఎటువంటి చారిత్రిక ఆధారం లేదు. కాని వారిని స్థానికులు తమ కుల   దైవాలుగా, వనదేవతులుగా తలస్తూ పూజలు చేస్తున్నారు.  నేడు ఈ  సమ్మక్క-సారక్కల జాతర దేశములోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణతికెక్కినది. మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది.  మన రాష్ట్రము న...

మేఘదుత్ పోస్ట్ కార్డ్స్ పై సందేశాలు

ఆంధ్రప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలి ,హైదరాబాదు వారు పర్యావరణ పరిరక్షణ కొరకు విడుదలచేసిన మేఘదూత్ పోస్టల్ కార్డ్స్ -2011

ఇంధనం ఆదా చేద్దాం

MAGADOOT POST CARDS ON ENERGY SAVING  కుటుంబ సభ్యులం కలసి భోజనం చేద్దాం , ఇంధనం ఆదా చేద్దాం. ప్రేమను పెంచుదాం.   ISI మార్క్ కలిగిన పంప్ సెట్ మరియు ఫుట్ వాల్వ్ ఉపయోగించండి. పంప్ ను నీటి మట్టానికి పది అడుగులకన్నా ఎక్కువ ఎత్తులో ఉంచకండి. తక్కువ  ఇంధనం తో ఎక్కువ దూరం ప్రయానించండి. గంటకి  45 -50 కి.మీ.ల వేగంతో వాహనం నడపండి. ఇంజన్ని క్రమం ప్రకారం ట్యునింగ్ చేయించండి.

అందరూ చదవాలి - అందరూ ఎదగాలి

MEGHADOOTH POST CARDS మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ - సర్వ శిక్షా అభియాన్  అందరూ చదవాలి  - అందరూ ఎదగాలి బాలల బాల్యం బడిలోనే -బాలల భవిష్యత్తు  బడిలోనే   పిల్లలు ఉండాల్సింది బడిలో...పనిలో కాదు!

మేఘ ధూత్ పోస్ట్ కార్డు పై జల యజ్ఞం

MEGHDOOTH POST CARDS ON JALA YAGNAM నిన్నొక కల ... నేడొక నిజం.... అదే జల యజ్ఞం.. . మేఘ ధూత్ పోస్ట్ కార్డుల  పై జల యజ్ఞం జరిగిన వైనం వీక్షించండి. కోస్తా ఆంద్ర ప్రాజెక్టులు : రాయలసీమ ప్రాజెక్టులు: తెలంగాణా ప్రాజెక్టులు :

మేఘ ధూత్ పోస్ట్ కార్డ్ పై ఆరోగ్య సూత్రాలు

MEGHADOOT POST CARDS (Telugu )   పొగాకు నమలటం మానండి - నోటి కాన్సెర్ ను నివారించండి. జీవితం మీది -మీ ఇష్టం  వీటికి దూరంగా ఉండండి.లేదంటే ప్రమాదం మీ ఎదుటే ! వెన్నును వంచకండి, బరువును కూర్చొని ఎత్తండి - విపు నొప్పిని నివారించండి . ఎత్తులో పనిచేసటప్పుడు సెప్టి బెల్ట్ వాడకం -  కాపాడును మీ ప్రాణం  

మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ - ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలు

MEGHADOOT POST  CARDS  - Dwrakaa Tirumala and Simhachalam  శ్రీ వెంకటేశ్వర ఆలయం,ద్వారకా తిరుమల  శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి   దేవాలయం,సింహాచలం  అన్ని దానాలలోకి అన్న దానం మిన్న అనేది నానుడి. దేవాలయాలో భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రం అనేది ఒక పుణ్య కార్యంగా తలచి మన రాష్ట్రంలో అన్ని ముఖ్య దేవాలయాలలో ఒక పధకం ప్రవేశపెట్టారు. దీనికి విరాళాలు ఇవ్వవలిసినదిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆలయం, ద్వారకా తిరుమల వారు, విశాఖజిల్లాలో ఉన్న  సింహాచలం  శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం,   వారు ఇచ్చిన అన్నదాన  ప్రకటనలు ఉన్న మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ ఇవి.