Skip to main content

Posts

Showing posts with the label శాస్త్రవేత్తలు

Dr. A.P.J . అబ్దుల్ కలాం కు తపాల బిళ్ళ

India Post released the commemorative stamp on the former President of India,  Dr. A.P.J. Abdul Kalam, on his 84th birth anniversary celebrations, at  New Delhi on 15th October, 2015. మన11 వ భారత రాష్ట్రపతి, మిసైల్ పితామహుడు ,భారత రత్న Dr. A,P.J. అబ్దుల్ కలాం  గారి గౌరవార్దం మన తపాల శాఖ 15-10-2015 న ఒక స్మారక తపాల బిళ్ళను విడుదల చేసింది. 

ప్రముఖ శాస్త్రవేత్త పద్మభూషణ్ Dr. A.S రావు శత జయంతి

Special Cover on Dr. A. S. Rao, (1914-2003) on the occasion of his Birth Centenary Celebration - 16th November 2014. హైదరాబాదులోని Elec   tronics Corporation Of India Limited (ECIL) అనే‌కేంద్రప్రభుత్వ రంగ సంస్థకు వ్యవస్థాపక C.M.D (Chairman & Managing Director)   ప్రముఖ శాస్త్రవేత్త  పద్మభూషణ్  Dr.  A.S  రావు (1914-2003) గారి శత జయంతి సందర్బంగా మన తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల కవర్ ను 16-11-2014 న విడుదల చేశారు. A.S రావు గా సుపరిచితమైన వీరి పూర్తి పేరు అయ్యగారి సాంబశివ రావు. వీరికి 1960 లో పద్మశ్రీ 1972 లో పద్మ భూషణ్ బిరుదులను పొందారు. వీరి పేరుతో  హైదరాబాద్ లో ఒక ప్రాంతానికి  A.S రావు నగర్ అని పేరు పెట్టారు 

దైవ కణం గురించి ప్రతిపాదించిన సత్యేంద్రనాథ్ బోస్

India Post released a stamp on Satyendranath Bose on 1-1-1994.   Satyendranath Bose (1894-1974) మన దేశం గర్వించదగిన శాస్త్రవేత్త లలో సత్యేంద్ర నాద బోసు ఒకరు. వారి శతజయంతి సందర్బంగా మన తపాలా శాఖ 1-1-1994 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేసింది . వారు బౌతిక శాస్త్రం లో చేసిన కృషి నేడు పరోక్షంగా నోబెల్ బహుమతికి నోచుకుంది.  2013 సంవత్సరానికి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్   దైవ కణం గురించి ప్రతిపాదించిన పీటర్  హిగ్స్,ఇంగ్లర్ట్ లకు లభించింది.1964 లో వీరితోపాటు రాబర్ట్ బ్రోట్  కూడా ఉన్నారు తరువాత  పీటర్ర్ హిగ్స్ విశేష పరిశోధన చేసారు వీరితొ  పాటు కార్ల్ హెగెన్,గెరాల్డ్, టామ్ కిబ్ల్ కూడా దీని ఉనికిని ప్రతిపాదించారు.            ఈ  నోబెల్ బహుమతి లో  గమనించాల్సిన ముఖ్య విషయమమేమంటే మన దేశానికి చెందిన ప్రసిద్ద శాస్త్రవేత్త, పద్మ విభూషణ్  సత్యేంద్రనాథ్ బోస్ చేసిన కృషి. ఈ దైవ  కణం ఉనికిని 1926  ప్రాంతంలోనే వారు ప్రతిపాదించారు. ఈయన పేరుతోనే దీనికి బోసాన్ అనిపేరు వచ్చి...

Engineers' Day - మోక్షగుండం విశ్వేశ్వరయ్య

A Commemorative postage stamp on 15-09-1960 BHARATHA RATNA Dr.MOKSHAGUNDAM VISVESWRAYA భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962) బెంగుళూరు దగ్గర్లో ఉన్న ముద్దినేహళ్ళి అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టారు. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వారి పూర్వికులు ఆంధ్ర నుండి మైసూరు ప్రాంతం వలసపోవటం జరిగింది. మైసూరు మహారాజు వారి ఆర్థికసహాయంతో పూనాలో ఇంజనీరింగు చదివి, 1884 లో బొంబాయిలో ప్రభుత్వ ఇంజనీరుగా ఉద్యోగం సంపాదించారు. ఆ ఉద్యోగంలో ఆయన బొంబాయి పట్టణ అభివృద్దికి అపారమైన సేవల ం దించారు. హైదరాబాద్ కు వరదలు వచ్చినపుడు సర్ M . V . నిజాం నవాబు ఆహ్వానంపై హైదరాబాదు వచ్చి రెండు రిజర్వాయరులు నిర్మించి, పట్టణ డ్రైనేజి పధకం తయారు చేసి, ఏడు నెలలలో కార్యక్రమం పూర్తిచేసి నవాబుగారి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం విశ్వేశ్వరాయ మైసూరు మహారాజు వారి అభ్యర్థనపై ఆస్థానంలో చీఫ్ ఇంజనీరుగా చేరి, అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసి 1912లో దివాన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విశ్వేశ్వరాయలోని క్రమశిక్షణ, పనియందు గౌరవాభిమానాలు, నిజాయితీ గురించ...

జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం - National Science Day

National Science Day   is celebrated in India on February 28 each year to mark the discovery of the Raman effect by Indian physicist  Sir Chandrasekhara Venkata Raman   (7 November 1888 – 21 November 1970)  on 28 February 1928 . For his discovery, C .V .Raman was awarded the Nobel Prize in Physics in 1930. Chandrasekhara Venkata Raman  Date  of  issue  :  21 November 1971 Definitive Stamp  - Issued on   2009 May 11 భారత రత్న సర్ సి.వి.రామన్ " రామన్ ఎఫెక్టు'' ను కనుగొన్న సందర్భాన్ని ( 1928లో  ఫిబ్రవరి 28న )   పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును  జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ( National Science Day   )  1986   నుండి  జరుపుకొంటున్నాం. సమాజం లో శాస్త్రీయ దృక్పదాన్ని, విజ్ఞనాన్ని పెపొందించ టానికి ఇది దోహదపడుతుందన్న ఉద్దేశం తో ఈ  జాతీయ విజ్ఞాన దినోత్సవం ను జరుపుకుతున్నాం. Stamp on Raman  effect...

100 years of Indian Science Congress

India Post issued a postal stamp on 3rd January 2013 to commemorate 100 years of Indian Science Congress. Indian Science Congress Association (ISCA) is a premier scientific organisation of  India , started in the year 1914 , with Headquarters at Kolkata. The Centenary session of the Indian Science Congress is being held from 3rd to 7 th of January, 2013 at Kolkata. The theme of the centenary session is   " Science for shaping the future of India". Indian Science Congress Towards Scientific Temper: The design of the stamp depicts the spirit of the ce ntenary session of the Indian Science Congress. A child, tender, mouldable and the future of India, is observing a flower through a magnifying lens. First Day Cover - ISC

గణితమేధావి శ్రీనివాస రామానుజన్

Every  year December 22, the birthday of    Srinivasa Ramanujam is celebrated as ‘ National Mathematics Day.’    In view of this   India Post released a commemorative  postal  stamp on   on   22-12-2012. National Mathematics Day Date of  Issue :  22 December 2012  జాతీయ గణిత దినం సందర్బంగా మన భారత తపాలా శాఖ వారు 22-12-2012 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళ పై నంబర్ థియరీ తో శ్రీనివాస రామానుజం చిత్రాన్ని ముద్రించారు. Srinivasa Ramanajan - First Day Cover ఈ తపాలా బిళ్ళ నిజానికి  డిసెంబర్ 22,2011 న విడుదల కావలిసి ఉండగా దానిని అర్దాంతం గా నిలిపి మరొక ప్రత్యేక తపాలా బిళ్ళ శ్రీనివాస రామానుజం గారికి విడుదల చేసారు. ఇలా ఎందుకు చేసారో తెలియదు. బహుశ దానిపై రాముజం పేరు లేకపోవటం కారణం కావచ్చు.(తప్పు ఉంటె తమిళ సోదరులకు చిర్రెతుకొస్తుంది) కొంత మంది డీలర్లు ఈ తపాలా బిళ్ళను నిరుడే పోస్ట్ ఆఫీసు నుండి లోపాయకారిగా సేకరించి దానితో వ్యా...

భాషా శాస్త్రవేత్త -రాబర్ట్ క్లాడ్వేల్

ROBERT CALDWELL Date Of Issue:- 07.05.2010. రాబర్ట్ క్లాడ్వేల్ ఉత్తర ఐర్లాండ్ లో 1814 లో జన్మిచారు.తన 24 వ ఏట మత ప్రచారకునిగా మద్రాస్ వచ్చారు.స్వతహాగా భాషా శాస్త్రాభిమాని అగుటచే ద్రావిడ భాషలపై అద్యయనం చేసారు. తమిళం,తెలుగు, కన్నడం, మలయాళం,తులు వంటి దక్షణ భారత భాషలు అన్ని ఒక తెగకు చెందినవని వాటిని ద్రావిడ భాషాతరగతిగా వర్గీకరించాడు.ద్రావిడ భాషలు సంస్కృత భాష నుండి ఉద్భ వించ లేదని సూత్రీకరించాడు.వీరి పరిశోదనలు ద్రావిడ ఉద్యమానికి ఉతం ఇచ్చింది. వీరికి 18 భాషలలోప్రవేశముంది. 07-05-2010 న భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. ఈతపాల బిల్లపై రాబర్ట్ క్లాద్వేల్ చిత్రం తో పాటు తెలుగు,కన్నడం,తమిళం,మలయాళం అని ఆయా భాషలలో ముద్రించబడినాయి.

తపాల బిళ్ళ పై Dr.G.V.చలం

First Day Cover on Dr. Guduru Venkatachalam A Commemorative postage stamp on 08 -05-2010 Dr .GUDURU VENKATA CHALAM వ్యసాయ శాస్త్రవేత్త , స్వతంత్ర సమరయోదుడు , పద్మశ్రీ గూడూరు వెంకటాచలం (1909-1967) గారి గౌరవార్దం 08-05-2010 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు . గూడూరు వెంకటాచలం గారు 1909 లో కృష్ణ జిల్లా గుడివాడలో జన్మిచారు . విద్యార్ది దశలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని 14 నెలలు వెల్లూరు జైల్లో నిర్భంధించ బడ్డారు . ఆ తరువాత వ్యవసాయ రంగంలో విశేషమైన పరిశోధనలు చేసి ఎన్నో క్రొత్త వరి వంగడాలను వృద్ది చేసారు . వరి సాగు పై అనేక పుస్తకాలు , పరిశోధనా వ్యాసాలు వ్రాసారు .బియ్యం మన ప్రధాన ఆహారం గా ఉన్నంత కాలం మన గూడూరు వెంకటాచలం గారు గుర్తుండి పోతారు . వీరి సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం 1967 లో పద్మ శ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది . పద్మశ్రీ డా.జి.వి. చలం గారిపై రాజేంద్రనగర్  వ్యవసాయ  పరిశోధన కేంద్రం, హైదరాబాదు వారు ఒక ప్రత్యేక కవరును 30-11-2009 న విడుదల చేసారు.  Special cover on Padmasri Dr. G.V.Chalam...

డా.ఎల్లాప్రగడ సుబ్బారావు

Dr.YELLAPRAGADA SUBBAROW A Commemorative postage stamp on 19 - 12 - 1995 యల్లాప్రగడ సుబ్బారావు( 1895 - 1948 ) భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. వారి జన్మ స్థలం నేటి పచ్చిమ గోదావరి జిల్లా ,భీమవరం. హార్వర్డ్ స్కూల్ అఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ పైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు గారి పర్యవేక్షణలో బెమ్జిమిన్ డుగ్గర్ 1946 లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ అయిన ఆరియో మైసిన్ అనే మం దు కనుగొనెను. సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన వారు కనుగొనిన కొన్ని మందులను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది. కొత్తగా కనుగొనిన ఒక ఫంగస్ కు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ ( Subbaromyces splendens ) అని నామకరణము చేశారు. 1947 లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భా...