Date of issue : 24-08-1974
మన దేశానికి నాల్గోవ రాష్ట్రపతిగా,కార్మిక ఉద్యమానికి విశేషమైన సేవలు చేసిన శ్రీ వి.వి.గిరిగా ప్రసిద్ధుడైన వరాహగిరి వేంకటగిరి (ఆగష్టు 10, 1894 - జూన్ 23, 1980) గారు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణములోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధిచెందిన న్యాయవాది. 1913లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ ఐర్లండ్ లో సీన్‌ఫెన్ ఉద్యమములో పాల్గొని దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్‌నీల్, జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది. భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
1969 లో రాష్ట్రపతి ఎన్నిక లో పార్టీ అధికారిక అభ్యర్ధిగా పోటీ చేసిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వి.వి.గిరి, సంజీవరెడ్డి ని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు.
24-8- 1974 న వి.వి.గిరి గారు రాష్ట్రపతిగా పదవి విరమణ సందర్బంగా ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.
Comments