Skip to main content

Posts

Showing posts with the label stamps -2008

తపాల బిళ్ళపై షిర్డీ సాయి బాబా

దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆదరాభిమానాలను అందుకొన్న షిర్డీ సాయి బాబా మహా సమాధి పొంది 100 సంవత్సరాలు అయినా సందర్భంగా పై మన తపాల శాఖ వారు 15 -12-2017 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. అవధూత/ సూఫీ సామ్రాదాయం అనుసరించిన సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు. 1858 లోమహారాష్ట్రలో ఉన్న షిర్డీ గ్రామానికి వచ్చి 1918లో సమాధి సిద్ది వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు. A Commemorative postage stamp on SHRI SHIRDI SAI BABA ఇంతకు ముందు కూడా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆదరాభిమానాలను అందుకొన్న షిర్డీ సాయి బాబా పై మన తపాల శాఖ వారు 20-05-2008 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. A Commemorative postage stamp on 20-05-2008 Date of issue :20 -05-2008  SAI BABA - MAXIMUM CARD

దామోదరం సంజీవయ్య

On14 th  February 2008 India Post Issued a  commemorative postage stamp on DAMODARAM   SANJEEVAIA H (1921-1972) DAMODARAM   SANJEEVAIA H- FIRST DAY COVER దామోదరం సంజీవయ్య  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య   1921   ఫిబ్రవరి14న కర్నూలు  జిల్లా,    కల్లూరు  మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న  పెద్దపాడు  లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు.  తొలి దళిత ముఖ్యమంత్రి గా పని చేసిన వీరు  రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. 7-5-1972 న వీరు మరణిచారు.  మన తపాల శాఖ 14-2-2008 న దామోదరం సంజీవయ్య స్మారక తపాల బిళ్ళ విడుదల చేసింది. దీనిపై ఆంద్రప్రదేశ్ ను ప్రతిబంబిచేలా చార్మినార్, తిరుమల దేవాలయ...

మన పండుగలు - దసరా, దీపావళి

చెడుపై, దుర్మార్గం పై మంచి,మానవత్వం సాదించిన విజయాలకు గుర్తుగా మనం జరుపుపు కునే పండుగలే దసరా మరియు దీపావళి.  దేశమంతా హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన పండుగలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి తపాల శాఖ వారు 2008 లో మూడు ప్రత్యేక తపాల బిళ్ళలను,వీటితో పాటు ఒక మినిఎచార్ ను విడుదల చేసారు. వీటిపై దసరా పండుగ రోజుల్లో కొలకొత్త లో వైభవంగా జరిగే దుర్గా పూజా,మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలు చూసిస్తూ రెండు తపాలా బిళ్ళలు, దీపావళి పండుగను ప్రతిబింబించే ప్రమిదలను చూపించే  ఒక తపాల బిళ్ళ ఉన్నాయి. A set of three stamps on Festivals of India, by Indian Post. Date of Issue : 07 - 10 - 2008 DURGA PUJA,DUSSEHRA - KOLKATA, FESTIVAL OF INDIA DUSSEHRA - MYSORE, FESTIVAL OF INDIA   DEEVALI - FESTIVAL OF INDIA FIRST DAY COVER- FESTIVAL OF INDIA MINIATURE - FESTIVAL OF INDIA 

బి.యన్. రెడ్డి

India Post released A commemorative postage stamp onB.N. REDDI on 16th November 2009 పద్మ భూషణ్ బి.ఎన్.రెడ్డి గారు తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదా సాయాబ్ ఫాల్కే అవార్డ్ పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన అజరామరమైన చలనచిత్ర కళాఖండాలు ఎన్నో మన కళ్ళ ముందు కదలాడతాయి.వాటిలో ముఖ్యమైనవి - మల్లీశ్వరి ,బంగారు పాప,రాజ మకుటం. వీరి గౌరవార్థం మన తపాలా శాఖ 16-11-2009 న ఒక తపాలా బిళ్ళ విడుదల చేసింది. 

బులుసు సాంబమూర్తి

విడుదల తేది:04th March 2008 A commemorative postage stamp on ' MAHARSHI BULUSU SAMBAMURTHY' మహర్షి బులుసు సాంబమూర్తి : స్వతంత్ర యోదుడు , గాన్దేయ వాది . గాంధీజీ పిలుపునందుకొని న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారు. వీరు 1919లో హోంరూల్ ఉద్యమంలోను, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోను, 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోను మరియు నీల్ సత్యాగ్రహంలోను పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. తరువాత వీరు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులుగాను, 1929లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యులుగాను, 1935-37 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగాను వ్యవహరించారు.విశాలాంద్ర కొరకు పోరాడిన మహనీయుడు.మద్రాసులో వీరి గృహంలోనే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంద్ర రాష్ట్రం కొరకు అసువులు బాశారు. 1937లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు వీరు సభాపతిగా విధులను సంప్రదాయాలకు అనుగుణంగా, మర్యాదగా, అద్వితీయంగా నిర్వహించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు. తన సర్వస్వాన్ని దేశోద్ధరణకు సమర్చించిన వీరు మహర్షిగా 1958 పరమపదించారు...

పోలీసు అకాడెమి -హైదరాబాద్

A commemorative postage stamps - 27th November 2008 sardaar vallabhaayi patel National police Academy Hyderabad సర్దార్ వల్లభాయ్ పటేల్ పొలిసు ఆకాడమి , హైదరాబాద్ స్వర్ణోత్సవ సందర్భంగా ( 1948-2008) విడుదలైన తపాల బిళ్ళలు మరియు మినిఏచర్ - 27th November 2008