Skip to main content

Posts

Showing posts with the label పాత్రికేయులు

కోటమరాజు రామారావు

KOTAMARAJU RAMA RAO Date of issue :- 09-11-1997 పాత్రికేయులు, స్వతంత్ర సమర యోధులు శ్రీ కోటమరాజు రామారావు గారు (1897-1961) ప్రకాశం జిల్లాచీరాల లో జన్మించారు.మద్రాసు విశ్వవిద్యాలయం లో ఇంగ్లీష్ లో పట్టా పొంది పచ్చయప్ప కళాసాలలోఅధ్యాపకునిగా చేస్తూ కరాచి నుండి వెలువడే 'Sind Observer' లో విలేఖరిగా చేరారు.1938 లో నెహ్రు గారువీరిని లక్నో నుండి వెలువడే నేషనల్ హెరాల్డ్ కు ప్రధాన సంపాదుకునిగా నియమించారు. 1942 లో వీరు రాసినసంపాదికియాలను చూసి జడిసిన ఇంగ్లీష్ వారు ఆ పత్రికను మూసివేసి రామారావు గార్ని జైల్లోపెట్టారు.గాంధీజీ వీరిని 'Fighting Editor' గా అబివర్ణిచారు.1952 లో అవిభక్త మద్రాసు నుండి రాజ్య సభకుఎన్నికైనారు.వీరి కలం నుండి అనేక రచనలు వెలువడ్డాయి. తపాల శాఖ వారు రామారావు గారి గౌరవార్దం 9-11-97 న ఒక తపాల బిళ్ళ విడుదల చేసింది.

కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు

A Commemorative postage stamp on 1 - 5 - 1969 KASINADUNI NAGRSWARA RAO PANTHULU దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతు లు ( 1867 - 1938 ) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంధాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను' కళా ప్రపూర్ణ ' బిరుదుతో సత్కరించింది. ఆంధ్ర ప్రత్రిక , అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక, భారతి , ఆంధ్ర గ్రంధాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండీ నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. శ్రీ భాగ్ వడంబిక వీరి నివాసం లో నే కుదిరింది . తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన విషయాలలో ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను 'దేశోధ్ధారక ' బిరుదుతో సత్కరించారు. వీరి గ...