Skip to main content

Posts

Showing posts with the label భాష

ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల

India Post released a set of 3 stamp of Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana on 26th April 2017. భారత తపాలా 26-04-2017 న మన తెలుగు కవయిత్రులు   శ్రీ వెంకటాచల  మహత్యం రాసిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ (1730-1817)   మరియు  ఆతుకూరి ( కుమ్మరి) మొల్లమాంబ  (మొల్ల రామాయణం గ్రంధకర్త-1440-1530)రామాయణ కల్పవృక్షం తో పాటు  వేయి పడగలు రాసి జ్ఞానపీట్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయత,కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గార్ల పై  గుంటూరు బృందావన్ గార్డెన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోని అన్నమయ్య కళావేదికపై 26-04- 2017 సాయంత్రం గ  6.15  ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. ఒకేసారి ఇలా ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల కావటం శుభపరిణామం. దీనికి కృషి చేసిన పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి అభినందనలు.    Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana

తపాలా బిళ్ళ పై తెలుగు వెలుగులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాలా బిళ్ళల ప్రదర్శన విజయవాడలో మూడు రోజుల పాటు  2014 జూలై 24,25,26 తేదిలలో జరిగిన    తపాలా బిళ్ళల  ప్రద్రర్శన (APPEX -2014) లో  మన తెలుగు వారి విశిష్టతను  చాటేలా  'తెలుగు వెలుగులు '  పేరుతో తెనాలి కి చెందిన   శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ  సేకరించి ప్రదర్శించిన తపాలా బిళ్ళలు  అత్య  అద్బుతమైన ప్రదర్శన గా పలువురి మన్ననలు అందుకుంది. తెలుగు లిపి తో ఉన్నఏకైక  ప్రదర్శన కుడా ఇదే.  ఈ ప్ర దర్శన కు  సాయి కృష్ణ కు  వెండి -రజిత  (SILVER- BRONGE )  పతకం   బహుమతిగా వచ్చింది.   కేసినేని నాని నుండి  తెలుగు వెలుగులు కి బహుమతి ని స్వీకరిస్తున్న వి. సాయి కృష్ణ    తెలుగు వారు గర్వపడేలా ఉన్న ఈ తపాలా బిళ్ళ పై  తెలుగు వెలుగులు  ప్రదర్శన లో కొంత భాగాన్ని మీరు  ఇక్కడ   చూడగలరు. 

Centenary Celebrations of First Andhra Conference

On the occation of the centenary celebrations of First Andhra Conference (`Pradhama Andhra Mahasabha’) India Post released a Special Postal cover  on 24-5-2013 at the historic Town Hall ,at Bapatla, Andhra Pradesh.  Union Minister of State for Petroleum and Natural Gas Panabaka Lakshmi inaugurated the event by hoisting a flag and released a Special Postal Cover   marking the historic event. ప్రధమాంధ్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు 1913 లో బాపట్ల లో 'ఆంద్ర  మహాసభ' తొలి సమావేశం జరిగింది. దానిని పురస్కరించుకొని ప్రధమాంద్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు బాపట్ల లోజరిగిన సందర్బం గా మే 24 , 2013 న మన తపాలా శాఖ(విజయవాడ) ఒక ప్రత్యక తపాలా కవర్ ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక కవర్ పై ప్రధమాంద్ర మహాసభ లోగోను దానిపై  క్యాన్సిలేషన్ కొరకు ఆంధ్ర మహాసభ జరిగిన బాపట్ల టౌన్ హాల్ చిత్రం తో ప్రత్యక తపాలా ముద్ర ను రూపొందించారు ప్రత్యేక తపాల కవర్ విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి  తదితరులు  బాపట్ల-టౌన్ హాల్  తెలుగు వారిక...

యూరోపు దేశపు తపాలా బిళ్ళ పై తెలుగు అక్షరం

  Telugu alphabet on EUROPA stamp   Date of Issue: 9th May 2008 ఈ ఇంటర్నెట్ యుగం లో ఉత్తరాలు రాయటం దాదాపుప్రపంచ వ్యాప్తంగా  అంతరించి పోతున్నది. ఉత్తరం రాయటం ఒక కళ. దీనివల్ల పిల్లలకు  భాషపై  పట్టును ఇస్తుంది. అవసంరం ఉన్న లేకున్నా పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించావలిసిన భాద్యత పెద్దలపై , ఉపాధ్యాయుల పై ఉంది. ఈ మంచి ఉద్దేశంతో పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించటానికి యూరోపా దేశాలు 2008 లో 'లెటర్ రైటింగ్' అనే అంశం పై తపాలా బిళ్ళ లు విడుదల చేసాయి.  ఈ అంశం పై విడుదలైన తపాలా బిళ్ళ లలో యూరోపా దేశాలలో ఒకటైన  'అన్డోరా' దేశం విడుదల చేసిన తపాలా బిళ్ళ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ తపాలా బిళ్ళ ను   ప్రపంచం లో ఉన్న ప్రధాన భాషల లో గల మొదటి అక్షరం ఉండేలా రూపొందించి బడినది.  అందంగా ఉన్న ఈ  తపాల బిళ్ళ పై  అనేక ముఖ్య భాషా అక్షరాల తో పాటు మన   తెలుగు అక్షరం ' అ ' కు కుడా  స్థానం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే మన తెలుగు భాషకు సముచిత...

తపాళ బిళ్ళ పై తెలుగు అక్షారాలు

సాదారణంగా మన తపాలా బిళ్ళ ల పై హిందీ మరియు ఇంగ్లీష్ భాష లలో వాటిని గురించిన  వివరాలు ముద్రించబడి ఉంటాయి. అరుదుగా  కొన్ని సందర్బాలలో మన ప్రాంతీయ బాషలు కుడా వాటిపై  చోటుసేసు కుంటాయి. అలా మన తెలుగు అక్షరాలు మన భారత దేశ తపాల బిళ్ళల పై మూడు సార్లు చోటు చేసుకున్నాయి. తపాళ బిళ్ళ పై తెలుగు అక్షారాల వివరాలు. మొదటి సారి  16- 10 -1972 లో భారత తపాలా శాఖ విడుదల చేసిన  ఆంద్ర  కేసరి టంగుటూరి ప్రకాశం గారి స్మారక తపాలా బిళ్ళ పై ప్రకాశం పంతులు గారు   తెలుగులో పెట్టే సంతకం  'టం.ప్రకాశం' ముద్రించ బడినది. ప్రకాశం గారి సంతకం తో ఉన్న తపాలా బిళ్ళ  రెండో సారి  12-4- 1975 న  ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభల సందర్బం గా విడుదలైన తపాల బిళ్ళ పై  ' దేశ   భాషల   యందు   తెలుగు   లెస్స  ' అన్న   శ్రీ   కృష్ణ   దేవరాయల   పలుకులు ,  'ఎందరో   మహానుభావులు   అందరికి   వందనములు'   అన్న   శ్రీ   త్యాగరాజ   స్వామి   కృతి   పదాలు త...

ప్రపంచ తెలుగు మహా సభలు

ఒక జాతి సంస్కృతిని, సాహిత్యాన్ని,  వైభవాన్ని,ఔన్యత్వాన్ని,చరిత్రను  పది కాలాల పాటు ప్రపంచం నలువైపులా  చాటి చెప్పేవి తపాలా బిళ్ళలే. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానంగా, అపురూపంగా దాచుకొనే తపాళా బిళ్ళల ప్రాముఖ్యం చెప్పనలవి కానిది. తపాల బిళ్ళ ఒక గౌరవ చిహ్నం. అంగరంగ వైభవం గా  1975 లో ప్రపంచ తెలుగు మహా సభలు తొలి సారి హైదరాబాదు లో జరిగినప్పుడు మన పోస్టల్ శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఆనాటి సభలకు తీపి గుర్తుగా అనేక మంది తపాలా బిళ్ళల సేకరణ దారుల వద్ద పదిలంగా బద్రపరచ బడినవి. ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు  హైదరాబాద్   లో   12  - 04  - 1975   న( ఉగాది పర్వదినాన )   ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు   జరిగినప్పుడు  మన భారత తపాల శాఖ వారు ఒక  ప్రత్యేక   తపాల   బిళ్ళ  ను  విడుదల   చేసారు .  ఈ   తపాల   బిళ్ళ   వెల   25   పైసలు .  దాని పై చదువుల తల్లి సర్వస్వతి చిత్రం దాని వెనుక తెలుగు పదాలు ముద్రించారు.  A Commemorative posta...

చేయైత్తి జై కొట్టు తెలుగోడా !

చేయైత్తి జై కొట్టు తెలుగోడా ! గతం మెంతో ఘన కీర్తి కలవోడా ! నీచ నాయకుల కుటిల రాజకీయ క్రీడలో,జాతిని మరిచి,నీతిని మరచి నికృష్టల చేష్టల వల్ల తెలుగు జాతికి తీరని అవమానం జరిగింది. ఇది మన  తెలుగు జాతి చరిత్ర లో మాయని మచ్చ. తెలుగు వెలుగులు మరల వికసించాలని ఆశిస్తూ...ట్యాంక్ బండ్ పై ఉన్న మహా పురుషులందరికీ నివాళి అర్పిస్తూ,    

భాషా శాస్త్రవేత్త -రాబర్ట్ క్లాడ్వేల్

ROBERT CALDWELL Date Of Issue:- 07.05.2010. రాబర్ట్ క్లాడ్వేల్ ఉత్తర ఐర్లాండ్ లో 1814 లో జన్మిచారు.తన 24 వ ఏట మత ప్రచారకునిగా మద్రాస్ వచ్చారు.స్వతహాగా భాషా శాస్త్రాభిమాని అగుటచే ద్రావిడ భాషలపై అద్యయనం చేసారు. తమిళం,తెలుగు, కన్నడం, మలయాళం,తులు వంటి దక్షణ భారత భాషలు అన్ని ఒక తెగకు చెందినవని వాటిని ద్రావిడ భాషాతరగతిగా వర్గీకరించాడు.ద్రావిడ భాషలు సంస్కృత భాష నుండి ఉద్భ వించ లేదని సూత్రీకరించాడు.వీరి పరిశోదనలు ద్రావిడ ఉద్యమానికి ఉతం ఇచ్చింది. వీరికి 18 భాషలలోప్రవేశముంది. 07-05-2010 న భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. ఈతపాల బిల్లపై రాబర్ట్ క్లాద్వేల్ చిత్రం తో పాటు తెలుగు,కన్నడం,తమిళం,మలయాళం అని ఆయా భాషలలో ముద్రించబడినాయి.