Skip to main content

Posts

Showing posts with the label సంస్కృతి

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు - ప్రత్యేక తపాలా బిళ్ళ

Andhra University centenary ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల  సందర్భంగా మన తపాలా శాఖ 26-04-2026 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేశారు. తెలుగు వారి చిరకాల కోరిక మేరకు విజయవాడలో 1926 లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం 1929లో  విశాఖ పట్నం కు తరలించబడింది. నేడు ఈ విశ్వవిద్యాలయం దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత  లక్ష్మీదేవి  చదువుల దేవత  సరస్వతీదేవి  ల ఆసనానికి గుర్తు. స్వస్తిక్  ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు  64 కళలకు గుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి " నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు " అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి   

ఆజాదికా అమృత మహోత్సవమ్ - Amritpex - 2023

మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఆజాదికా అమృత మహోత్సవమ్ లో భాగంగా  మన దేశ రాజధాని దిల్లీ లో 11 - 02 - 23 నుండి 15-02-23 వరకు దేశ స్థాయిలో అమృతఫెక్స్ - 2023 పేరుతొ తపాలా బిళ్ళల ప్రదర్శన మరియు పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మూడు విడతలు గా 22 ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. వీటితో పాటు 14 ప్రత్యేక తపాలా కవర్లు కూడా విడుదల చేసారు.   ఆజాదికా అమృత మహోత్సవము  లోగో తో నేతాజీ, బాపు, భగత్ సింగ్  లతో  ఒక జంట తపాలా బిళ్ళను ( Se - Tenant  Stamp )   ముందుగా విడుదల చేసారు  Se - Tenant  Stamp : Azadika Amrit Mahotsav -2023 Issued on 11 Feb 23 Bridal Costumes of India - 1 Issued on 12 Feb 23 Bridal Costumes of India - 2 Issued on 12 Feb 23 మన భారతీయ సాంప్రదాయపు పెళ్లి కూతురు వస్త్రధారణలపై  ఎనిమిది తపాలా బిళ్ళలు , రెండు మినియేచర్లు విడుదల చేసారు.  వీటిలో తమిళనాడు, జమ్మూ కాశ్మీరు, పంజాబీ, గుజరాతీ అమ్మాయిలు ఒక మినియేచరులోనూ పశ్చమ బెంగాలు, మణిపురి, మహారాష్ట్ర, కేరళ పెళ్లి కూతుర్లు మరొక మినియేచరులోనూ ముద్రించారు....

ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా

మన తపాలా శాఖ 19-12-2019 న ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా పేరుతో 12 తపాలా బిళ్ళలు, ఒక మినియేచర్ ను విడుదల చేసింది. వీటిలో 10 రూపాయల తపాలా బిళ్ళలు ఐదు , 15 రూపాయల తపాలా బిళ్ళలు మూడు, 20 రూపాయల తపాలా బిళ్ళలు నాలుగు ఉన్నాయి. మన దేశంలో వివిధ ప్రాంతాలలో వాడుకలో ఉన్న ఎంబ్రాయిడరీస్ రూపురేఖలు తీసుకొని వాటితో ఈ తపాల బిళ్లలను రూపొందించారు. వీటిలో మన ఆంధ్రాలో 500 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ముద్ద అల్లిక (కమల్ కథై )కు స్థానం కల్పించారు. చేతిగుడ్డ, దిండు గలీబు, ద్వారాలకు తెర గుడ్డలు, వస్త్రాలకు వివిధ రకాల చిత్రాలు, పూలు, ఆకులు, జంతువులు పక్షులు వంటివి సూదితో రంగుల దారాలతో ఉబ్బెత్తుగా (3D) చాలా అందంగా అల్లటం దీని ప్రతేకత.  Embroideries of India ఆంధ్రా అల్లిక (కమల్ కథై ) అద్దాల  కుట్టు పని (అప్లిక్యూ) మన ఆంధ్ర, తెలంగాణా లలో నివసించే లంబాడి (బంజారా తెగ) స్త్రీలు వాడే దుస్తులకు అద్దాలు అమరిచ్చి అందంగా తయారు చేసే కుట్టు పని (అప్లిక్యూ) కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేసారు.

టెర్రాకోట తో కట్టిన దేవాలయాలు

A set of seven Commemorative Postage Stamps (CPS) on Terracotta Temples of India (1.Indralarh Temple, Ranipur Jharial, 2. Madan Mohan Temple, Bishnupur,3.Jor Bangla Temple, Bishnupur, 4. Nebiya Khera Temple, Bhadwara, 5. Lakshman Temple, Sirpur, 6. Lalji Temple, Kalna, 7. Shyam Rai Temple, Bishnupur) was released by India Post on 08.08.2020 మన దేశంలో టెర్రాకోట తో కట్టిన దేవాలయాలను ఇతివృత్తంగా చేసుకొని మన భారత తపాలా శాఖ 08-08-2020 న ఏడు తపాలా బిళ్ళలు తో కూడిన ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  శిలలపై శిల్పాలు చెక్కి దేవాలయాలు నిర్మించటం మనం సాధారణంగా చూస్తాం. రాతి శిలలు లభించని ప్రాంతాలలో ఇటుకలతో కట్టిన దేవాలయాలను నిర్మించి వాటి గోడలపై మట్టి పలకలపై (టెర్రకోట) అందంగా తాయారు చేసిన శిల్పాలను తాపడం చేసి ఆలయం  నిర్మించటం ఒక విశిష్ఠ వాస్తు శిల్పకళ.  పశ్చిమ బంగా లో బంకురా జిల్లా లో ఉన్న విష్ణుపూర్ లో మల్ల రాజులు   బంగా వాస్తు పద్దతిలో నిర్మించిన టెర్రకోట దేవాలయాలలో ముఖ్యమైన మూడు వైష్ణవ  ఆలయాలు   మదనమోహనాలయం (1694), జోర్ బంగ్లా దేవాలయం (1...

చార్ ధామ్ - ఉత్తరాఖండ్

భారత తపాలా శాఖ వారు 29-11-2019 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధ హిందూ పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్న నాలుగు పుణ్య  ప్రదేశాల (చార్ ధామ్ గా ప్రసిద్ధిచెందాయి) పై నాలుగు తపాలా బిళ్ళలు విడుదల చేసారు.  గంగా, యమునా నదుల జన్మస్థానాలైన గంగోత్రి, యమునోత్రి,  హిమాలయ పర్వతసానువులలో ఉన్న  కేదారనాథ్, బదరినాద్ దేవాలయాలు వీటిపై చోటుచేసుకున్నానాయి. YAMUNOTRI, GANGOTRI, KEDARNATH, BADRINATH - CHAR DHAM చార్ ధామ్ - ఉత్తరాఖండ్ 

జానపద కళాకారుల వాయిద్య పరికరాలు - బుర్ర కథ కళాకారుడు - డిక్కీ

మన భారత తపాలా శాఖ 28-06-2020 న జానపద కళాకారుల వాయిద్య పరికరాలు (Musical Instruments of Wandering Minstrels) పేరుతో మన బుర్ర కథలో వంత పాడే కళాకారుడు వాడే వాద్యం  డిక్కీ  కు, దానిని వాయిస్తున్న కళాకారుడితో పాటు మరో ఐదు జతల (se-tenant) తపాలా బిళ్ళలు విడుదల చేసింది.  Kamaicha,Ravanahatha,Surando,Algoza,Burrakatha,Ektara Musical Instruments of Wandering Minstrels మన దేశీయ జానపద కళాకారుల వాయిద్య పరికరాల కేటగిరిలో మన తెలుగు వారి జానపద కళ అయినా బుర్ర కథలో ప్రధానంగా ఉపయోగించే వాయిద్యమైన డిక్కీ కు, దానిని వాయిస్తున్న  వంత పాడే కళాకారునికి  తపాలా బిళ్ళపై స్థానం కల్పించటం మన జానపద కళకు దక్కిన గౌరవంగా పరిగణించవచ్చు.   ఈ డిక్కీ ని బుడిగె , గుమ్మెట అని కూడా పిలుస్తారు . బుడిగెలు మామూలు గుమ్మెట్ల కంటే చిన్నవి. ఇవి ఇత్తడితోనో లేదా కంచు తోనో చేయబడి వుంటాయి.(membranophone category) బుర్ర కథలో వంత పాడే కళాకారుడు - డిక్కీ     తెలుగునాట జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళార...

Indian Fashion Series - 4

India Post issued 9 Commemorative Postage Stamps of Denomination Rs 5 each on Indian Fashion-Designers Creations: Series- 4 మన తపాలా శాఖ మరొకసారి భారతీయ వస్త్ర ధారణ సిరీస్ -4 పేరుతో 14-01-2020 న 9 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు ఎలా రూపుదిద్దుకుంటాయో వీటిపై ఉన్నాయి. ఇలా ఒక అంశం పై నాలుగోసారి తపాలా బిళ్లలను విడుదల చేయటం ఇదే మొదటసారి. ఇప్పటివరకు ఈ అంశం పై 21 తపాలా బిళ్ళలు విడుదలైనాయి.  ఇంతకు ముందు భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ మొదట సారి 31-12 -2018 న సిరీస్ -1 పేరుతో 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. సింధు నాగరికతలో ఉన్న వస్త్ర ధారణ నుండి మధ్య యుగం వరకు వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. రెండవ సారి సిరీస్ -2 పేరుతో 12-06-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ సంప్రదాయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. మూడొవసారి సిరీస్ -3 పేరుతో 6-09-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీ...

చరిత్ర ప్రసిద్ధి పొందిన కోట గుమ్మాలు

మన దేశంలో 16 వ శతాబ్దాలలో నిర్మించిన అనేక చరిత్ర ప్రసిద్ధి పొందిన కోట గుమ్మాలలో ఎనిమిది పైన మన తపాలా శాఖ 19-10-2019న 8 తపాలా బిళ్ళలు ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  వీటిపై ఆగ్రాకు సమీపంలో ఉన్న ఫతేపూర్ సిఖ్రీ లో ఉన్న బులంద్ దర్వాజా, బికనీర్ లోని కోట గుమ్మం, జైపూర్లోని జొరవర్ గేట్, జోధాపూర్ సర్దార్ మార్కెట్ గేట్ , కాశ్మీర్ గేట్ ఢిల్లీ, రూమి దర్వాజా లక్నౌ, మ్యాగజైన్   గేట్ అజ్మీర్ , ఢిల్లీ గేట్  స్థానం లభించింది. India Post issued a set 8 Commemorative Postage stamps on 'Historical Gates of Indian Forts and Monuments' on 19.10.2019. The stamps depict Buland Darwaza, Fatehpur Sikri; Kote Gate, Bikaner; Jorawar Gate,Jaipur; Sardar Market Gate,Jodhpur; Kashmere Gate,Delhi; Roomi Darwaza,Lucknow; Magazine Gate,Ajmer and Delhi Gate,Delhi.

Geographical Indication Registered Handicraft Products

భౌగోళిక గుర్తింపు పొందిన(GI) మన దేశపు హస్తకళా వస్తువుల పై మన తపాలా శాఖ వారు 5 తపాలా బిళ్లలతో ఒక మినియేచర్ని 31-12-2018 న విడుదల చేసారు. జయపూర్ నీలం రంగు కూజాలు , పాలక్కాడ్ మద్దెల , కర్నటక కాంశ్య విగ్రహాలు, కుచ్ ఎంబ్రాడర్ వస్త్రాలు , బీహార్ లోని సిక్కి లో గడ్డితో తయారైన వస్తువులు వీటిపై చోటు చేసుకున్నాయి. 

సీత రామ స్వయంవరం -ASEAN INDIA Summit Stamps

మన తపాలా శాఖ  25-1-2018 న 11  ఆసియా దేశాల సదస్సులో ఆయా దేశాల కు సంబంధించిన అంశాలతో 11 తపాలా బిళ్ళలు విడుదల చేసింది.  వీటిలో 8 దేశాలకు సంధించిన అంశాలలో రామాయణం ఇతివృత్తంగా ఉంది.  మన దేశానికి సంబంధించి సీత రామ స్వయంవరం ఘట్టాన్ని సూచిస్తున్న చిత్రం    "పట్టం కథ" పేరుతో  ముద్రించబడినది.    దీనికి  ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి పొందిన కలంకారీ వస్త్రం పై రూపొందించి చిత్రం మాతృక. ( Source : Indra Gandhi National center  for arts )  India Post issued 11 stamps in denomination of Rs. 5 each on ASEAN INDIA Commemorative Summit 2018 on 25th January-2018.  Eleven stamps depicts Torana Gate - Malaysia, Menyembah – Brunei, Pattam Katha, Ramayana Darangen – Philippines, Phra Lak Phra Lam – Laos, Ramayana – Indonesia, Yama Zatdaw - Myanmar, Khon - Thailand, Sri Mariamman Temple – Singapore, Kate Festival – Vietnam, Kumbhakaran, Angkor – Cambodia.

విసన కఱ్ఱల పై తపాలా బిళ్ళలు

A set of 16 stamps on Indian Hand Fans was released by India Post on 30th December  2017 మన దేశంలో ప్రాచీన కాలంలో వివిధ ప్రాంతాలలో వాడిన అందమైన విసన కఱ్ఱల పై  మన తపాలా శాఖ 30-12-2017 న 16 రకాల తపాలా బిళ్ళలు  (16x15 =240 ) విడుదల చేసింది. 

తపాలా బిళ్లల పై మహాభారతం- విశ్వరూప దర్శనం

పంచమ వేదం గా ప్రసిద్ధి చెందిన భారతీయ ఇతిహాస కావ్యం "మహాభారతం " పై మన తపాలా శాఖ 18 తపాలా బిళ్లలను రెండు మినియేచర్ షీట్స్ ను 27-11-2017 న విడుదల చేసింది. వీటిలో  12 తపాలా బిళ్ళలు 15 రూపాయలు , 4 తపాలా బిళ్ళలు 25 రూపాయలు, ఒకటి 50 రూపాయలు, మరొకటి 100 రూపాయలు విలువ కలవి.  వీటిలో 50,100 రూపాయల బిళ్లలతో మినియేచర్స్ గా కూడా ముద్రించారు.  ఈ తపాలా బిల్లలపై మహా భారత గ్రంధ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో వివిధ కాలాల్లో రూపుదిద్దుకున్న చిత్రాలకు స్థానమిచ్చారు. వాటిలో మన ఆంధ్ర ప్రాంతంలో కలంకారీ చిత్రకళ ఒకటి. దీన్ని ప్రతిపాదికగా చేసుకొని 50 రూపాయల తపాలా బిళ్ళ మరియు మినియేచర్ ను రూపొందించారు. అలాగే ఆంద్ర- కర్ణాటక ప్రాంతాలలో మహాభారతాన్నిజానపద కళా పక్రియ అయినా తోలు బొమ్మలాట గా ప్రదర్శిస్తారు. తోలు బొమ్మలాటలో "ద్రౌపది" బొమ్మతో మరొక 15 రూపాయల తపాలా బిళ్ళ ను కూడా విడుదల చేశారు.  కలంకారీ వస్త్రంపై  మహాభారతం- కురుక్షేత్రం తోలుబొమ్మలాటలో - ద్రౌపది  మహాభారతం- విశ్వరూప దర్శనం  మహాభారతం- 18 పర్వాలు ముఖ్య ఘట్టాలు 

భారతీయ వంటకాలపై తపాలా బిళ్ళలు

ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా మన తపాలా శాఖ ద్వారా కమ్మని నోరూరించే మన భారతీయ వంటకాలపై 24 తపాలా బిళ్ళలు 3-11-2017 న విడుదలైనాయి. ఈ వంటకాలను పండుగ వేళ వండుకునే పబ్బాలు - పిండివంటలు , దేవుడి కి గుళ్లో ప్రసాదాలుగా చేసేవి, దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధమైన వంటకాలుగా, దేశ విదేశాలలో అంతటా ప్రాముఖ్యతను సంతరించుకున్నదేశీయ  వంటకాలాగా నాలుగు తరగతులుగా విభజించి నాలుగు మినియేచర్లు కూడా  విడుదల చేసారు.  వీటిలో తిరుపతి లడ్డు, హైదరాబాద్ బిరియానీ. గుత్తి వంకాయ కూర, కజ్జి కాయ, దోశ- ఇడ్లి వంటి మన తెలుగు వంటకాలు కూడా ఉన్నాయి.  భారతీయ వంటకాలు  పండుగ పబ్బాలు - పిండి వంటలు   దేవుని ప్రసాదాలు    ప్రాంతీయ వంటలు   అందరు మెచ్చే వంటకాలు 

ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం పై తపాలా బిళ్ళలు

మన భారత తపాలా శాఖ 1-11-2017 న ఆదికవిగా కీర్తించబడిన నన్నయ్య మరియు   ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం   పైన తపాలా బిళ్ళలు విడుదల చేశారు. ఇదే సందర్భంగా కన్నడ కవి ముద్దన పై కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు . ఈ మూడు తపాలా బిళ్ళలు ఒకే తపాలా కవరు పై కర్ణాటక రాష్ట్ర ఆతరణ దినోత్సవం నవంబర్ ఒకటో తేదీన (మన పూర్వ ఆంద్ర ప్రదేశ్ అవతరణ  దినోత్సవం  కూడా అదే) బెంగళూరులో విడుదల చేశారు. కవి ముద్దన, ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం   ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం చారిత్రిక ప్రసిద్ధి చెందిఉంది. ఇక్కడ ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక...

దీపావళి పై తపాలా బిళ్ళలు

చీకటిని పారదోలేది జ్యోతి. జ్ఞానాన్ని ప్రసాదించేది దీపం.  దీపాల వరుస దీపావళి .  చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి జ్ఞాన కాంతులు వెదజల్లాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు.  ఆనందాల వెలుగులు ప్రసరించే దీపావళి పండుగకు గుర్తుగా అనేక తపాలా బిళ్ళలు విడుదల చేశారు.  మన దేశం కెనడా దేశం రెండు కలసి సంయుక్తంగా దీపావళి పై 21-09-2017 న రెండు తపాలా బిళ్ళలు విడుదల చేసాయి.  ఇంతకు ముందు దీపావళి పండుగ ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ  అమెరికా తపాలా శాఖ 5-10-2016 న ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.    అలాగే జ్యోతి హిందువులతో పాటు జురాస్టియన్ మతం వారికి పవిత్రమైనది.  ఇజ్రాయిల్ మరియు భారత దేశాలు తమ మద్య మొదలైన ద్వైపాక్షిక సంభందాలకు 20 వసంతాలు పూర్తి అయిన సంధర్బం గా ఇరు దేశాలు Festivals of Lights  పేరుతో రెండు తపాలా బిళ్ళలను 5-11-2012 న విడుదల చేసారు. మన  రెండు దేశాలలో  దీపాలు వెలిగించి జరుపుకొనే దీపాల పండుగల ను ఇతి వృత్తం గా తీసుకుని రూపొందించిన ఈ తపాల బిళ్ళల పై  మన దీపావళి , ఇజ్రాయిల్ లో జరుపుకొనే ...

తపాలా బిళ్ళలపై రామాయణం

దసరా పండుగ సందర్భంగా మన తపాలా శాఖ హిందూ మత  ప్రామాణిక గ్రంధాలలో ప్రముఖమైన రామాయణ  గ్రంధం లోని ముఖ్య ఘట్టాలతో 11 తపాలా బిళ్ళల ను  22-09- 2017 న విశ్వవ్యాప్తంగా విడుదల చేసింది.  దీనిపై సీతా రామ స్వయంవరం, శ్రీ రాముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించటం , భరతునికి పాదుకలు ఇవ్వటం, గృహుడు చే నదిని దాటటం, జటాయువు చే సీతాపహరణ గురించి తెలుకోవటం , శబరి చే ఫలహారం స్వీకరించటం, హనుమంతుడు అశోకవనంలో సీత జాడ కనుగొనటం, లంకకు వారధి కట్టే సమయంలో ఉడుత సహాయం, లక్ష్మణుడి కొరకు హనుమ సంజీవని తెచ్చుట, రామ బాణంతో రావణ సంహారం (ఇవి అన్ని 5 రూపాయల విలువతో ఉన్నవి) మధ్యలో 15 రూ  విలువతో శ్రీ సీతారామ పట్టాభిక్షేకం  తో వీటిని రూపొందించారు.  తపాలా బిళ్ళలపై  రామాయణం  ఇంతకు ముందు 14-10- 1970 లో రామాయణ గ్రంధకర్త మహర్షి వాల్మీకి పై  ఒక తపాలా బిళ్ళను  విడుదల చేశారు. దీనిపై సీతా రామ లక్ష్మణ ల వనవాసం, బంగారు లేడి చిత్రాలు చూడవచ్చు.  Maharsi Valmiki Miniature sheet - Ramayana Sheet let - Ramayana