A Commemorative postage stamp on
31-12-2002
Forts of andhra pradesh
Forts of andhra pradesh
PALACE-CHANDRAGIRI FORT, GOLCONDA FORT
మన రాష్ట్రం లో ఉన్న చారిత్రిక ప్రసిద్ది పొందిన చంద్రగిరి కోట, గోల్కొండ కోట ల పై తపాల శాఖ వారు రెండుప్రత్యేక తపాల బిళ్ళ లు 31-12-2002 లో విడుదల చేసారు.
చంద్ర గిరి దుర్గం విజయ నగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయలు తిరుమల దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు. అచ్యుతదేవరాయలను ఇక్కడే గృహ నిర్బందములో ఉంచినారు. శ్రీ కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. 1640 లో అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో ప్రస్తుతం ఉన్న ఈకోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచే వారు. ఇలా నిర్మించుట వలన కోట రక్షణ కొండ ప్రాంతమువైపుగా తగ్గగలదనీ కొండపైనుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమనించుట సులభం కనుక కొండ ప్రక్కగా నిర్మిచారు. కోట చుట్టూ దాదాపు కిలో మీటరు దృడమైన గోడకలదు. ఈ గోడననుసరిస్తూ బయటి వైపుగా పెద్ద కందకము కలదు. చంద్రగిరి నుంది పాలించిన చిట్టచివరి విజయనగర రాజు పెద వేంకట రాయలు, తన సామంతుడు దామెర్ల చెన్నప్ప నాయకుడు ఆగస్టు 22, 1639లో బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి చందిన ఫ్రాన్సిస్ డే కి చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతిచ్చింది ఈ కోట నుండే. తపాల బిళ్ళ పై మూడుఅంతస్తుల రాజ మహల్ ను ముద్రించారు.దీనిలోని మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు. ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇందులో ఉన్నాయి. రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడచ్చు.మూడవ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజలజీవన విధానం లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే అంతస్తులో రాజప్రముఖుల గదులు కలవు.
గోల్కొండ కోట 1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్తులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉన్నది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687 లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములో ఔరంగజేబు కోటను నాశనంచేశాడు.గోల్కొండ నాలుగు వేర్వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడ కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. ఫతే దర్వాజా గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది.
Comments