Skip to main content

Posts

Showing posts with the label Mahatma Gandhi

ఆజాదికా అమృత మహోత్సవమ్ - Amritpex - 2023

మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఆజాదికా అమృత మహోత్సవమ్ లో భాగంగా  మన దేశ రాజధాని దిల్లీ లో 11 - 02 - 23 నుండి 15-02-23 వరకు దేశ స్థాయిలో అమృతఫెక్స్ - 2023 పేరుతొ తపాలా బిళ్ళల ప్రదర్శన మరియు పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మూడు విడతలు గా 22 ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. వీటితో పాటు 14 ప్రత్యేక తపాలా కవర్లు కూడా విడుదల చేసారు.   ఆజాదికా అమృత మహోత్సవము  లోగో తో నేతాజీ, బాపు, భగత్ సింగ్  లతో  ఒక జంట తపాలా బిళ్ళను ( Se - Tenant  Stamp )   ముందుగా విడుదల చేసారు  Se - Tenant  Stamp : Azadika Amrit Mahotsav -2023 Issued on 11 Feb 23 Bridal Costumes of India - 1 Issued on 12 Feb 23 Bridal Costumes of India - 2 Issued on 12 Feb 23 మన భారతీయ సాంప్రదాయపు పెళ్లి కూతురు వస్త్రధారణలపై  ఎనిమిది తపాలా బిళ్ళలు , రెండు మినియేచర్లు విడుదల చేసారు.  వీటిలో తమిళనాడు, జమ్మూ కాశ్మీరు, పంజాబీ, గుజరాతీ అమ్మాయిలు ఒక మినియేచరులోనూ పశ్చమ బెంగాలు, మణిపురి, మహారాష్ట్ర, కేరళ పెళ్లి కూతుర్లు మరొక మినియేచరులోనూ ముద్రించారు....

First Visit of Mahatma Gandhi to Odisha

India post released a Commemorative Postage Stamp on 100 Years of First Visit of Mahatma Gandhi to Odisha on 23rd March 2021. The First Day Cover of the Commemorative Postage Stamp portrays the Swaraj Ashram at Cuttack, where Mahatma Gandhi stayed during his first visit to Odisha on 23rd March 1921.

మహాత్మా గాంధీ 150వ జయంతి

మహాత్మా గాంధీ 150వ   జయంతి ఉత్సవాలలో ముగింపు భాగంగా అక్టోబర్ 2, 2020 న మన భారత తపాలా శాఖ గాంధీజీ ప్రవచించి ,ఆచరించిన సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేసేలా నాలుగు తపాలా బిళ్లలతో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. వీటిపై ఆత్మనిర్బారత, ప్రకృతి వైద్యం, విద్య, పర్యావరణ వంటి సార్వజనిక విషయాలపై గాంధేయ మార్గం ఏమిటో సూక్ష్మంగా తెలిపేలా రేఖా చిత్రాలు ఉన్నాయి. 
మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా 2-10-2019 న మన తపాల శాఖ ఆరు అష్టభుజ తపాలా బిళ్ళలు  మినియేచర్ తోపాటు విడుదల చేసింది. 25 రూపాయల విలువగల ఈ అష్టభుజ తపాలాబిళ్ళలు మన దేశంలో ముద్రించటం ఇదే మొదటసారి. వీటిపై గాంధిజీ చిన్ననాటి ఫోటో నుండి తుది వరకు వివిధ సంఘటనలు చోటుచేసుకున్నాయి.  గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకొని గత ఏడాదినుండి విడుదల చేస్తున్న తపాలా బిళ్ళల పరంపరలో ఇవోకటి. 

మహాత్మా గాంధీ జ్ఞాపికలు

మన తపాలా శాఖ వారు ఆగష్టు 15 ,2019న మన దేశంలో ఉన్న మహాత్మా గాంధీ జ్ఞాపికలపై  ఒక పోటీ నిర్వహించి వాటిలో ఉత్తమం అయిన ఫోటో లతో రెండు తపాలా బిళ్ళలు విడుదల చేశారు. వీటిపై గోవా లో ఉన్న స్థానిక బాలికతో ఉన్న గాంధీజీ విగ్రహం , ఢిల్లీ లో ఉన్న ఉప్పు సత్యాగ్రహం కు 11 మందితో  వెళుతున్న గాంధిజీ విగ్రహం( గాంధీ గెరా మూర్తి ) చోటు చేసుకున్నాయి. గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకొని గత ఏడాదినుండి విడుదల చేస్తున్న తపాలా బిళ్ళల పరంపరలో ఇవోకటి. 

అహింస పరమో ధర్మ - మహాత్మ గాంధీ

మన తపాలా శాఖ  17-06 -2019 న "అహింస పరమో ధర్మ" పేరుతో  మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలలో భాగంగా రెండు తపాలా బిళ్ళలు విడుదల చేసారు . గాంధీజీ నిర్మించిన  సబర్మతి ఆశ్రయం 1917 జూన్ 17న ప్రాంభించబడినది. 

GUNTUR PEX - 2019

                     మహాత్మా గాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శన ' GUNTUR PEX - 2019 , గుంటూరులో ఫిబ్రవరి 2019,  19,20,తేదీలలో తపాలా శాఖ వారి ఆధ్వర్యంలో జరిగింది.  ఈ సందర్భంగా మహాత్మాగాంధిజీ పై రెండు ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేశారు  ఈ ప్రదర్శనలో గాంధీజీ పై వచ్చిన తపాలా బిళ్లలతో గాంధీజీ జీవితాన్ని ,ఆయన ఆశయాలను చాలా అద్భుతంగా తెలియజెప్పే ప్రయత్నం అనేకమంది తపాలా సేకరణ కర్తలు విజయవంతంగా చేశారు.         ఈ ప్రదర్శన సందర్భంగా తపాలా శాఖ గాంధీజీ పై రెండు ప్రత్యేక కవర్లు విడుదల చేసింది. పాఠశాల విద్యార్థులకు క్విజ్, వకృత్వ, వ్యాసాల యందు పోటీలు జరిగాయి. ముగింపు లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ ప్రదర్శనలో ఎంతో శ్రమకోర్చి తపాలా బిళ్ళలు ప్రదర్శించిన సేకరణ కర్తలందరికి ఙ్ఘాపికలు ఇచ్చారు.  ఈ తపాలా బిళ్ళల ప్రదర్శనలో ఒక ఫిలాటలిస్ట్ గా నేను "స్ట్రుగుల్ ఫర్ ఫ్రీడమ్" పేరుతో మూడు ఫ్రేమ్ ల తపాలా బిళ్లలను ప్రదర్సించాను.  ...

మహాత్మ గాంధీ 150 వ జయంతి - వృత్తాకారంలో తపాలా బిళ్ళలు,

మహాత్మ గాంధీ 150 వ జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 2-10-2018 న ఏడు వృత్తాకారపు తపాలా బిళ్లలను  విడుదలచేసారు. ఇలా వృత్తాకారంలో మన దేశంలో తపాలా బిళ్ళలు, వాటితో పాటు ఒక మినియేచర్ ను  విడుదల చేయటం ఇదే మొదటసారి. వీటిపై గాంధీజీ జీవితం లో జరిగిన ముఖ్య ఘట్టాలు, ఆఫ్రికా లో న్యాయవాదిగా మొదలుకొని మహాత్మునిగా మారిన అంశాలు ముద్రించారు. వీటితో ఇప్పటి వరకు మహాత్మా గాంధీ పై మన తపాలా శాఖ విడుదల చేసిన తపాలా బిళ్ళల సంఖ్య 65 కు చేరుకుంది.  In a first, India Post  issued a miniature sheet with seven round-shaped stamps on Mahatma Gandhi on 2-10-2018 in connection with his 150th birth anniversary celebrations. The stamps, tracing the life of Gandhi from a young lawyer in South Africa to the Mahatma, carry messages of non-violence, cleanliness, service to the needy, truth, and simplicity.   The miniature sheet is inscribed with Gandhi’s quote ‘My life is my message.’
మహాత్మా గాంధీజీ జీవితాన్ని మలుపుతిప్పిన  దక్షిణ ఆఫ్రికా లో పీటర్ మార్టిన్ బర్గ్ రైల్ సంఘటన జరిగి 125 సంవత్సరాలు  మరియు నల్ల సూరీడు నెల్సన్ మండేలా శత జయంతిని పురస్కరించుకొని భారత్ - దక్షిణ ఆఫ్రికా దేశాలు సంయుక్తంగా  26-7-2018 న  ఒక ప్రత్యేక మినియేచర్ను విడుదల చేశారు.

క్విట్ ఇండియా పోరాటం

To commemorate 75 years of 1942 Quit India Movement a set of 8 Commemorative Stamps and a Miniature Sheet was released by India Post on 9th August, 2017 మన దేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన , కీలకమైన ఉద్యమం క్విట్ ఇండియా పోరాటం. ఇది జరిగి 75 సంవత్సరాలు అయినా సందర్భంగా మన తపాలా శాఖ 8 తపాల బిళ్ళలు మరియు ఒక మినియేచర్ ను 9-8-2017 న విడుదల చేసింది.  క్విట్ ఇండియా ఉద్యమంపై ఇంతకు మునుపు కూడా మూడుసార్లు ( 1967, 1983, 1992 లలో ) తపాలా బిళ్ళలు విడుదల చేసారు 1 October 1967 ,Quit India Movement - 25th Anniversary, Martyrs' Memorial, Patna Quit India Resolution - 40th Anniversary (9-8-1983) Do or Die - Mahathma Gandhi - 50th Anniversary (9-8-1992) Quit India - 50th Anniversary (9-8-1992)

మహాత్మా గాంధీజీ చంపారన్ సత్యాగ్రహమ్

India post released a set of three stamps and one miniature on Champaran sathyagraha centenary on 13th may 2017  మహాత్మా గాంధీజీ నీలి పంట రైతులకొరకు చేసిన చంపారన్ సత్యాగ్రహమ్ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన తపాలా వారు మూడు ప్రత్యేక తపాలా బిళ్ళలు , మినియేచర్ ను 13-05-2017 న విడుదల చేసారు. 

మన తెలుగు వారి లో జాతీయ ప్రాముఖ్యం గల వారు ఎవరు లేరా?

India Post Issued new 11th series of  Definitive Stamps in the name of    Builders of Modern India మన తపాల శాఖ లో రోజు వారి వాడకం కొరకు  నవభారత నిర్మాతల వరసలో  15-10-2015 నుండి కొత్త  5 రూపాయల  తపాల బిళ్ళలు వాడకం లోకి వచ్చాయి.  భగత్ సింగ్ , స్వామి వివేకానంద, దీనదయాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ. బాబు రాజేంద్ర ప్రసాద్ , మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రామ్ మనోహర్ లోహియా    లాల్ బహుదూర్ శాస్త్రి ల బొమ్మలతో వీటిని విడుదల చేసారు.   ఇదే వరసలో వచ్చిన తపాల బిళ్ళల లో 25 పైసల నెహ్రు తపాల బిళ్ళ స్థానం లో మహాత్మా గాంధీ , యోగ లను , 50 పైసల పై సుబ్రమణ్య భారతి ,రూపాయ తో తిలక్ , 50/- రూపాయల విలువతో రవీంద్రనాథ్ టాగోర్  విడుదుల చేసారు. ఈ వరసలో మొత్తం 27 రకాల తపాల బిళ్ళలు  విడుదల చేసారు.  దక్షిణాది రాష్ట్రాలలో కేవలం    తమిళ ప్రముఖులకుమాత్రమే దీనిలో స్థానం కల్పించారు. దక్షినాది నుండి ఎన్నిక చేసిన  నలుగురు ( సుభ్రమణ్య భారతి , సుబ్బులక్ష్మి, రామానుజం, తిరువల్లార్) తమిళులే....

Commemorative Stamps on Charkha

'స్వచ్చ భారత్' పై బాలలు రూపొందిచిన తపాల బిళ్ళలు

India Post released 3 stamps and one miniature sheet on 30-1-2015 on the theme of Swachh Bharat  SWACHHA BHARAT - 30-1-2015 మన తపాల శాఖ  మహాత్మాగాంధీ వర్దంతిని పురస్కరించుకొని 30-1-2015 న  'స్వచ్చ భారత్' పై బాలలు రూపొందిచిన చిత్రాలతో మూడు తపాల బిళ్ళలు, వాటితో ఒక  మినిఎచార్ ను విడుదల చేశారు. పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, పరిశుద్ద జలం వంటి వాటిపై అవగాహన కల్పించే లా ఇవి ఉన్నాయి.  మోడి మొదలపెట్టిన స్వచ్చ్ భారత్ ను చంద్రబాబు చెప్పే స్వచ్చ ఆంద్ర సాదించటానికి పతి ఒక్కరు పని చేయాలి. గాంధీజీ కన్న కలలు నిజం చేయాలి. పతివారు మరుగు దొడ్డి వాడేలా చేసి మనం నాగరికులమని చాటాలి. 

ప్రవాస భారతీయ దివస్

జనవరి 8,1915 న మహాత్మా గాంధీ దక్షిణ ఆప్రికా నుండి తిరిగి వచ్చి మన దేశ స్వాతంత్ర పోరాటం లో ప్రముఖ పాత్ర పోషించి విజయాన్ని సాదించారు. ఆ దినాన్ని మనం ప్రవాస భారతీయ దివస్ పేరుతో జరుపుకుంటున్నాం. విదేశాలలో ఉన్న మన దేశవాసులు మన దేశం కొరకు తమ వంతు సహాయ సకారాలు అందించాలన్నదే దిని ప్రధాన ఉద్దేశం. ప్రవాసం నుండి గాంధిజీ మన దేశం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా 8-1-2015 న  మన తపాల శాఖ వారు రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ ను విడుదల చేసారు.   100 years of Gandhiji's returns to India India   Post released a set of two stamps and Miniature sheet on 100 Years of Mahatma Gandhi's return to India on 8-1-2015  Pravasi Bharatiya Divas (PBD)   is celebrated on 9th January every year to mark the contribution of Overseas Indian community in the development of India.  January 8 was chosen as the day to celebrate this occasion since it was on this day in 1915 that Mahatma Gandhi, the greatest Pravasi, returned to India from South Afr...

ప్రపంచ అహింస దినం - గాంధీజీ జన్మదినం

2-10-2014 is celebrated as "Gandhi Jayanti" and whole World referred October 2nd as The International Day of Non-Violence as per United Nations.  ప్ర పంచ అహింస దినం - మహాత్మా గాంధీ MAHATMA GANDHI - Issued by U.N.O. on  International Day of Non - Violence- 2-10-2000 Was there a man in flesh and blood whom many of us Have seen, read and heard, whose image was chosen for stamps, coins ,currency Notes of more than hundred countries of the world in our life time? Yes there was a man! Only one man! ! He was Mohandas Karmachand Gandhi (2-10-1869) Universally known as Mahatma Gandhi. Only Gandhi who lived as a very ordinary man but died as Martyr, who gave the world, the world of sophisticated weapons, the world that vied for each others blood, the world full of hate and selfishness, by the only balm of love and sacrifice, by the only remedy of Satyagraha known as Non Violence and “Non-Cooperation” the ultimate theory of “Do or Die” So that the...