హైదరాబాద్ నగరానికి మణి హారం సాలార్ జంగ్ మ్యూజియం. దీనిలో ఉన్న సేకరణలన్నీ మీర్ యూసుఫ్ ఆలీ ఖాన్ చే సేకరించినవే, ఇతను సాలార్ జంగ్ III గా ప్రసిధ్ధి.ఈ మ్యూజియం లోఉన్న 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న "రెబెక్కా",జహంగీర్ చురకత్తి,నూర్జహాన్ పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క ఖురాన్ ప్రతి, గడియారం మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.వీటితో పాటు ఇంకా సేకరణల్లో గ్రంధాలు, పోర్సిలీన్, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండీ తెప్పించి భద్రపరచబడినవి. 27-07-1978 లో మన ప్రాచీన కళా సంపద బద్రపరిచిన పురా వస్తు ప్రదర్సన శాల ల పై ముద్రించిన నాలుగు తపాల బిళ్ళ లలో ఒకటి మన సాలార్ జంగ్ మ్యూజియం లో ఉన్న జహంగీర్ చురకత్తి,నూర్జహాన్ పండ్లుకోసే కత్తి బొమ్మలతో ముద్రించారు.
Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post Date of Issue: 23-4-2005 న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి రేడియో అక్కయ్య గా పేరొందారు. బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాయపతి రాఘవరావ
Comments