Skip to main content

Posts

Showing posts with the label cinema

ఆరుద్ర - స్మారక తపాల బిళ్ళ

ARUDRA (1925-1998) రచయిత, అభ్యుదయ కవి, సినీ గేయ కవి ఆరుద్ర గా లబ్ద ప్రతిష్ఠుడైన భాగవతుల సదాశివ శంకరశాస్త్రి శత జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 16-12-2025 న ఒక ప్రత్యేక స్మారక తపాల బిళ్ళను  విడుదల చేశారు. వీరి రచనలలో ఆంధ్ర సాహిత్య చరిత్ర , త్వమేవాహం, వేమన వాదం, గుడిలో సెక్సు వంటి గ్రంథాల తో పాటు దాదాపు మూడు వేల సినిమా పాటలు రాసారు. 

మహానటి భానుమతి

మన తపాలా శాఖ 1-05-2025 న  వేవ్స్ -2025 ( World Audio Visual and Entertainment Summit (WAVES - 2025)  వేడుకలో ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  మన భారతీయ సినీ దిగ్గజాలగా పరిగణించబడే ఐదుగురు సినీ ప్రముఖుల తపాలా బిళ్లలతో ఉన్న ఈ మినియేచర్ లో మన తెలుగు చిత్ర సీమలో నటిగా , దర్సకురాలిగా, నిర్మాతగా, గాయనిగా ప్రసిద్ధి పొందిన మహానటి  భానుమతి గారి తపాలా బిళ్ళ ఉంది. వీరితో పాటు సినీ రంగ ప్రముఖులు  గురు దత్ , రాజ్ కోస్లా, రిత్విక్ ఘటక్, సలీల్ చౌదరి గార్లకు గౌరవం దక్కింది.  P. Bhanumathi -  World Audio Visual and Entertainment Summit (WAVES 2025)   ఇది భానుమతి గారిపై విడుదలైన రెండవ తపాలా బిళ్ళ. తెలుగు చిత్రరంగంలో ఈ అరుదైన ఘనత దక్కిన నటి భానుమతి గారే. ఇంతకుముందు మన భారతీయ చలన చిత్ర శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన తపాలా బిళ్లలలో వీరికి స్థానం లభించింది.  P  Bhanumathi An Indian actress, singer, film producer, director, music composer, and novelist, she is often regarded as the first female superstar of Telugu cinema. She also became the first fema...

పద్మ విభూషణ అక్కినేని నాగేశ్వరరావు - MY Stamp IIFF

commemorative stamps honouring  Raj Kapoor, Mohammed Rafi, Akkineni Nageswara Rao, and  Tapan Sinha  for their significant contributions to Indian cinema at the 55th International Film Festival of India in Goa on November 20, 2024 గోవా లో జరిగిన ఇంటెర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IIFF) లో మన భారతీయ సినీ ప్రముఖుల శత జయంతులు జరుగుతున్న వేళ వారి  గౌరవార్థం ఒక ప్రత్యేక మై స్టాంప్ ను నవంబరు 20, 2024న విడుదల చేసారు. దీనిలో    ప్రముఖ  హిందీ చలన చిత్ర నటులు రాజ్ కపూర్. గాయకుడు మహ్మద్ రఫీ, తెలుగు వెండి తెర వెలుగు  అక్కినేని నాగేశ్వరరావు, కథా రచయిత తపన్ సిన్హా లకు చోటు కల్పించారు.  

పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు

పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు- ANR  తపాలా బిళ్ళపై  అక్కినేని  మన భారత తపాలా శాఖ వారు 19-09-2024న పద్మ విభూషణ్ మరియు దాదాసాయెబ్ అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ళపై ముద్రించిన అక్కినేని ఛాయా చిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు, సినిమా దర్శకుడు బాపు గారు రూపొందించారు. ఇది అక్కినేని ఇష్టమైన చిత్రం. First Day Cover - Dr. Akkineni Nageswararao తెలుగు ప్రఖ్యాత తెలుగు  చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారు. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొ...

పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు

మన తపాలా శాఖ 19-09-2018 న పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు(ANR) 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసారు.  తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన అక్కినేని 256 సినిమాలలో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను చేరుకున్న నట సామ్రాట్. దేశంలో రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు దాదా సాయబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న అందాల నటుడు.  Special cover on Akkineni Nageswararao 

తపాలా కవరు పై పద్మ విభూషణ్ డా. అక్కినేని

తెలుగు చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారి 95వ జన్మదినం సందర్భంగా మన తపాలా విభాగం ఒక ప్రత్యేక తపాలా కవరును 19-09-2018 న హైదరాబాద్ లో విడుదల చేసింది. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొప్పదని భావించిన తత్వజీవి అక్కినేని.  SPECIAL COVER ON Dr. A.N.R. 

B. నాగిరెడ్డి పై తపాలా బిళ్ళ

మన తపాలా శాఖ 23-02-2018 న B. నాగిరెడ్డి పై తపాలా బిళ్ళ విడుదల చేసింది.  బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1912-2004) గారు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, విజయ వాహిని పిచ్చర్స్ అధినేత, చందమామ పత్రిక ముద్రాపకుడు, చక్రపాణి - నాగిరెడ్డి గా సుపరిచితుడు. దాదాసాయబ్ పాల్కే అవార్డు గ్రహీత అయిన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి నిర్మించిన సినిమాలలో పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, జగదేక వీరుని కథ ప్రముఖమైనవి. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి   ప్రముఖ దర్శకుడు  దాదాసాయబ్ పాల్కే అవార్డు గ్రహీత     B .N. రెడ్డి  ( బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి )గారు వీరి సోదరుడే. వారికి కూడా 16-12- 2009 లో మన తపాలా శాఖ ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 

మహానేత నందమూరి తారక రామారావు

తెలుగు వారికి ఒక విశిష్టత, గుర్తింపు కల్పించిన మహా నటుడు, మహానేత మన NTR .  NTR  గౌరవార్దం 28-05- 2000 న మన తపాల శాఖా వారు మూడు రూపాయల విలువగల ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.  ఈ తపాలా బిళ్ళ రూపకల్పన పరమాద్బుతం.  ఈ తపాల బిళ్ళ పై నందమూరి తారాక రామారావు గారి చిత్రం తో పాటు వారి కీర్తి శిఖరం కు చిహ్నం గా హిమాలయ పర్వతాలు, చలన చిత్ర రంగానికి ప్రతినిధిగా సినిమా రీలు, దానిలో వారి ప్రజా/ కళా సేవకు గుర్తుగా భూమి,సూర్యుడు ఉన్నాయి.  N.T.RAMA RAO India Post released one  Commemorative postage stamp  to   Dr. N.T.Ramarao   on  28-05-2000 BROCHURE- NTR తపాలాబిళ్ళ తో  పాటు విడుదల చేసిన ప్రత్యక తపాలా కవరుపై ( FIRST DAY COVER ) ప్రజలతో ప్రసంగించుతున్న N.T.రామారావు గారి చిత్రం ముద్రించారు .  ఈ ప్రత్యేక కవర్ పై  ప్రత్యేక తపాలా ముద్ర గా ' శ్రీ కృష్ణ దేవరాయలు వేషం లో ఉన్న  రామారావు ' చిత్రం తో రూపొందించటం మరొక ప్రత్యేకతను సంతరించుకుంది.  FIRST DAY ...

గాన కోకిల - ఘంటసాల

తెలుగు   సినిమా   చరిత్రలో   శాశ్విత   కీర్తిని   పొందిన  మధుర  గాయకుడు పద్మశ్రీ   ఘంటసాల వెంకటేశ్వరరావు   (జ. 4-12-1922 మ. 11-02-1974) కృష్ణ జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించిన  గాన కోకిల  ఘంటసాల గారు ఈ నాడు భౌతికంగా మన మధ్య  లేక పోయినా పాట రూపంలో తెలుగు నాట జీవించే ఉన్నారు.  'మల్లియ లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా ' , 'మనసున మనసై బ్రతుకున బ్రతుకై ' , 'నిలువవే వాలు కనుల దాన ' , 'ఏమండీ ..ఇటు చూడండీ ' 'దేవ దేవ ధవళాచల ' వంటి  భక్తి గీతాలు  'గుండమ్మ కథ'  లో  'కోలు కోలో యన్న కోలో నా సామి ',' లేచింది  నిద్రలేచినింది '  వంటి  పాటలు వారి గాన మాధుర్యానికి మచ్చుకు కొన్ని మాత్రమే.  ఇంకా  'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ' , 'ప్రతి రాత్రి వసంత రాత్రి ', 'దేవుడు చేసిన మనుషుల్లారా ', 'భలే మజాలే భలే ఖుషీలే ' 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' , 'త్యాగ శీల వమ్మా మహిళా ', 'ఊరు మారినా ఉనికి మారునా ', 'చీకటిలో కారు చీకటిలో '- 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ...

అక్కినేని కి అమెరికా లో వ్యక్తి గత తపాల బిళ్ళ

అక్కినేని నాగేశ్వరరావు  అమెరికా లో  అక్కినేని నాగేశ్వరరావు గారి  అబిమానులు(AFA) వారికి నివాళిగా20-9-2014 న  ఒక వ్యక్తి గత తపాల బిళ్ళను usps చే విడుదల చేపించారు . దీనికి ఎటువంటి అధికారిక గుర్తింపు ఉండదు . ఇలాంటి వాటిని USPS కు డబ్బు చెల్లించి ఎవరిదైన వ్యక్తిగత చిత్రాన్ని తపాల బిళ్ళ పై  ముద్రించు కోవచ్చు.  ఇప్పటివరకు అమెరికా తపాల శాఖ వారు మన దేశానికి సంబందించి మహాత్మా గాంధీ గారికి , మదర్ తెరెసా కు మాత్రమే అధికారక తపాల బిళ్ళలు విడుదల చేసి వారిని గౌరవించారు.   మన దేశం లో కుడా Rs 300 /- తో మై స్టాంప్  పధకం లో ఇలాంటి  వ్యక్తి గత  తపాల బిళ్ళలు   పొందవచ్చు .  AFA వారు దీనికి ఇంత ఎత్తున ప్రచారం చేయాలా? దీనికంటే హైదరాబాద్ GPO లో అక్కినేని జయంతి న ఒక స్మారక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసిన బాగుండేది.  మన తెలుగు సినిమా నటులలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ,సావిత్రి SVరంగారావు,భానుమతి, అల్లు రామలింగయ్య   గార్లకు, చలనచిత్ర  దర్శకులలో  దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొ...

సంగీత దర్శకుడు చక్రవర్తి గారికి స్మారక తపాలా కవరు

India Post  a Special Postal Cover issued On famous South Indian music  Director, Singer and actor CHAKRAVARTHI (Kommineni Appa rao) on 6-09-2014 గుంటూరు తపాల బిళ్ళలు, నాణేలు సేకరణ దారుల సంఘం ( GNPS - Guntur Numismatic and Philatelic Society) ద్వి దశాబ్ది  వార్షికోత్సవం సందర్బం గా రెండవ రోజు  6-09-2014 న గుంటూరులో  ప్రముఖ తెలుగు సిని సంగీత దర్శకుడు ,గాయకుడు,నటుడు అయిన చక్రవర్తి గారికి  ఒక స్మారక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు Spcial cover on CHAKRAVARTHI  చక్రవర్తి పేరుతో ప్రత్యేక తపాల ముద్ర  చక్రవర్తి (1936-2002 ) తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త,గాయకుడు, నటుడు కె చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు .  ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించారు.  సంగీత చక్రవర్తి గారు 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర సంగీత రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. పలు  సినిమాలలో 200లకు పైగా పాటల...

తపాల బిళ్ళల పై S. V. రంగారావు , భానుమతి, అల్లు రామలింగయ్య

వందేళ్ళ సినిమా కి వందనం  మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు .  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు  S. V. రంగారావు ,  భానుమతి,  అల్లు రామలింగయ్య   ఎస్వీ రంగారావు (1918-1974) సామర్ల వెంకట రంగారావు   - SVR గా తెలుగు చిత్ర సీమలో పేరొందిన   నటుడు.  మూడు దశాబ్దాలపాటు మూడొందల పైగా సాంఘిక పౌరాణిక సినిమాలలో  అద్భుతంగా నటించిన సహజ నటుడు.   ఘటోత్కచుడిగా ,  కీచకుడిగా ,  రావణాసురుడిగా  తనకు తానే సాటిగా ప్రేక్షకుల మన్నలను గడించాడు. ...

తపాల బిళ్ళల తో 50 మంది చలన చిత్ర ప్రముఖులకు ఘన నివాళి

India Post Released 6 Miniature Sheets for 50 Indian Icon personalities of Indian Cinema to Celebrate the 100 Years (Century) Of Indian Cinema on 3rd May 2013. మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 (2X9) సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది(4X8) వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు . వీటిని ఆరు మినిఎచర్స్ గా విడుదల చేసారు.  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు అల్లు రామలింగయ్య(3/6),    భానుమతి(3/6)  లను మూడో మినిఎచర్ లోను,  S. V. రంగారావు(5/6) ను  ఐదవ మినిఎచార్ లోను చూడవచ్చు.  తపాల బిళ్ళల పై ఉన్న  50 మంది చలన చిత్ర ప్రముఖులు 100 Years Of Indian Cinema...

మహా నటి సావిత్రి

Smt. SAVITHRI Legendary heroines of Indian cinema  India Post Issued a set of six stamps and a miniature sheet to honor Six legendary heroines  – Savithri, Meena Kumari, Nutan, Devika Rani, Leela Naidu and Kanan Devi   of Indian cinema,  on February 13th, 2011  First day Covers MINIATURE SHEET- SAVITRI ప్రపంచ తపాలా బిళ్ళల ప్రదర్శన (INDIPEX -2011 ) లో మన తపాలా శాఖ 13 -02 -2011 న విఖ్యాత భారతీయ నటీమణులు పై విడుదల చేసిన ఆరు తపాలా బిళ్ళలలో మన తెలుగింటి ఆడపడుచు, మహా నటి సావిత్రికి చోటు కల్పించారు. మిగిలినవారు  మీనా కుమారి, నూతన్,దేవిక రాణి, లీల నాయుడు, కానన్ దేవి. ఈ అరుదైన గౌరవంపొందిన శ్రీమతి సావిత్రి    గుంటూరు జిల్లా,   తాడేపల్లి  మండలంలోని  చిర్రావూరు  గ్రామంలో  1936   జనవరి 4  న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించింది. సావిత్రికి ఆరు నెలలు వయసులో  తండ్రి మరణించగా విజయవాడ లో ఉన్న  తన పెదన...

మనోవైజ్ఞానిక సాహితీవేత్త- త్రిపురనేని గోపిచంద్

First day Cover  India Post released a stamp to honer Tripuraneni Gopichand on 8th September 2011. Tripuraneni Gopichand  ( 8 September 1910 - 2 November 1962 ) was a Telugu short story writer, novelist, editor, essayist, playwright and film director.  Gopichand's writings are remarkable for interplay of values, ideas and 'isms' - materialism,  rationalism, existentialism, realism and humanism. He is especially celebrated for his second novel 'Asamardhuni Jeevayatra' (The Incompetent's Life Journey). This is the first psychological novel in Telugu literature. Gopichand's work'Panditha Parameshwara Sastry Veelunama' in 1963 was presented with the Sahitya Akademi Award - This was the first Telugu novel to win the award. TRIPURANENI GOPICHAND ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, మనోవైజ్ఞానిక  సాహితీవేత్త  మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న...