Skip to main content

Posts

Showing posts with the label హేతువాది

ఆచార్య యన్. జి. రంగా

India post released a Commemorative Postage Stamp on N.G.Ranga on 27th January  2001 under personlity series. రైతుబంధు ఆచార్య యన్.జి.రంగా గారి చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలాశాఖ వారు,27th జనవరి 2001 లోఒక ప్రత్యేక స్మారక తపాళాబిళ్ళను విడుదల చేశారు. Prof.N.G.RANGA (7 Nov1900–9 June 1995) ప్రపంచ కర్షకులారా ఏకంకండి ! ఈ నినాదానికి రూపశిల్పి ఆచార్య గోగినేని రంగనాయకులు ( యన్. జి. రంగా). రైతు కూలీలకోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహామనీషి. రైతుకూలీలరాజ్యం స్థాపనకోసం మహాత్మునితో సుదీర్ఘచర్చలను జరపడమే కాక, సంభాషణలసారాన్ని, 'బాపూ ఆశీస్సులూ ' అని గ్రంధస్థం చేసిన వ్యక్తి. గాంధీజీ స్వతంత్ర్యోద్యమంలో భాగంగా 1933 లో ప్రకటించిన క్లారియన్ పిలుపునందు కున్న స్వతంత్ర సమరయోధుడు. 1936లో కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించిన ధైర్యశాలి. ఆరు దశాబ్దాలకాలం ప్రజాసేవ చేసిన ప్రజ్ణామూర్తి. 1900 సంవత్సరం నవంబర్ 7 న గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు గ్రామంలో జన్మించిన రంగా, స్వగ్రామంలోనే ప్రాధమిక విద్యను అభ్యసించి. గుంటూరులోని ఆంధ్ర-క్రిష్టియన్ కాలేజీలో పట్టభద్రులవగా, 1926లో ఆక్స్ ఫర్డ్ విశ...

కందుకూరి వీరేశలింగం పంతులు

A Commemorative postage stamps on Kandukuri veeresalingam Date of Issue :  15 - 07 - 1974 కందుకూరి వీరేశలింగం పంతులు ( 1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు, తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా, హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఎన్నో నాటకాలు రాసిన కవి. ఏప్రియల్ 16 న జరిగే వీరి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగస్థల కళాకారుల దినోత్సవంగా జరుపుతున్నది.  ఆయనకున్న ఇతర విశిష్టతలు మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ,   తెలుగులో తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర  మరియు   ...

మహాకవి గురజాడ వెంకట అప్పారావు

India Post Issued a Special Postal Cover On  well known Telugu Poet, writer  Gurajada Venkata Apparao,  on 28 -1- 1995, in the occasion of VIZNUPEX- '95 మన భారత తపాలా శాఖ వారు  విజయనగరం లో జరిగిన తపాలా బిళ్ళల ప్రదర్శన   ( VIZNUPEX-'95)   సందర్బంగా మహాకవి గురజాడ వెంకట అప్పారావు    గారికి నివాళిగా 27-01-1995 న ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసారు.  ఈ ప్రత్యేక కవర్ పై ఉపయోగించటానికి విజయనగరం మహారాజ కళాశాల బొమ్మ తో ప్రత్యేక తపాలా ముద్రను రూపొందించారు. 21-09-2012 న గురజాడ వారి 150 వ జయంతి సందర్బం గా కుడా విజయనగరం లోనే మరొక ప్రత్యేక తపాలా కవర్ విడుదలచేసారు. తెలుగు భాషకి వారు చేసిన కృషికి నివాళిగా ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేయవలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది. Special Cover - Gurajada Venkata Apparao Date of Issue - 27-01-1995 మహాకవి గురజాడ వెంకట అప్పారావు (1862-1915) దేశమంటే మట్టి కాదోయ్‌ !  దేశమంటే మనుషులోయ్‌ !! అని ప్రభోదించిన మన ప్రజా కవి శ్రీ గురజాడ.తెలుగు సాహిత్యాన్ని సుసం...

గురజాడ కు తపాల బిళ్ళ విడుదల చేయరా ?

గురజాడ అప్పారావు (21-09-1862 - 30-11-1915) గారి 150 వ జయంతిని తెలుగు వారు ఘనంగా జరుపు కుంటున్న తరుణం లో దానికి శాశ్విత గుర్తుగా , ఆ మహానియునికి నివాళిగా మన తపాలా శాఖా వారు ఒక తపాల బిళ్ళను విడుదల చేసాలా కృషి చేసిన ధఖాలలు కనిపించ లేదు.కేవలం ఒక ప్రత్యేక తపాలా కవరు మాత్రమే విడుదల చేసారు. Releasing a postal cover on 150th birth anniversary celebrations of Gurajada Appa Rao in Vizianagaram on 21-09-2012 ప్రభుత్వం గరజాడ జయంతి కి సరైన ఏర్పాట్లు చేయటం లో ఎంతో నిర్లక్షం గా ఉందొ దీనిని బట్టి అర్ధం అవుతున్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వచ్చే ఏడాది ముగింపు ఉత్సవాల కైనా గురజాడ కు పోస్టల్ స్టాంప్  విడుదల చేయాలి. దినికోరకై సాహిత్యకారులు,అభిమానులువత్తిడి చేయాలి.ఇటివల రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతికి మన తపాలా శాఖా వారు రెండు తపాల బిళ్ళల తో పాటు ఒక మినియేచార్  విడుదల చేసారు. మరి మన గురజాడకు ఎందుకు విడుదల చేయరు? 'మన వాళ్ళు వట్టి వేదవాలోయి  ' అని కన్యాశుల్కం లో చెప్పిన డైలాగ్ నిజం చేద్దామా? 

గోరా - GORA

గోరా ( 1902-1975) గోరా గా ప్రసిద్ధి చెందిన భారతీయ నాస్తికవాద నే త. వీరి  పూర్తి పేరు గోపరాజు రామచంద్రరావు . 15 నవంబర్, 1902 న ఒరిస్సా లోని ఛత్రపురం లో పుట్టి, విజయవాడను కేంద్రంగా చేసుకొని అనేక సామాజక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ముడనమ్మకాలపై అలుపెరుగని పోరాటం చేసిన నాస్తిక హేతువాది, సంఘ సంస్కర్త, గాంధేయ వాది. గోరా ఆచరణ వాది . గ్రహణాల సందర్భంలో గర్భిణి గా వున్న తన భార్యను మూడు సార్లు ఆరు బయట త్రిప్పి ఏ విధమైన మొర్రిలు ఏర్పడవని ప్రజలకు తెలిసే విధంగా ఆచరించి చూపారు. తన పిల్లల పేర్లు సైతం ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో పుట్టిన అబ్బాయికి లవణం అని, భారతీయులు చట్ట సభల్లో గెలిచిన సందర్భంలో పుట్టిన అబ్బాయికి విజయం, రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో పుట్టిన అబ్బాయికి సమరం, గాంధి ఇర్విన్ ఒడంబడిక సందర్భంలో పుట్టిన అమ్మాయికి మైత్రి అని, తొమ్మిదవ సంతానం కు పేరు నౌ, అని పెట్టి సముచిత నామములు పెట్టే విధానానికి ఆద్యుడయ్యాడు. 1975 జులై 26న గోరా మరణించినప్పుడు వారి  అభిమతానికి అనుగుణంగా ఏ మత సంప్రదాయాన్ని పాటించకుండా సంస్కారాలు జరిపించారు. 2002, ఆగష్టు   12 న   ...

కవి రాజు త్రిపురనేని రామస్వామి- 125వ జయంతి

ఈ ఏడాది  కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి  125 వ జయంతి సంవత్సరం.  1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన త్రిపురనేని   తెలుగు నాట హేతువాద భావాలు వెదజల్లిన వైతాళికుడు.  కవి రాజు గారి  125 వ జయంతి సంవత్సరంలో  వారు చూపిన హేతువాద మార్గం లో సమాజం ముందుకు పోయేలా అభుదయ వాదులు, హేతువాదులు కృషి చేయాలి. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ తిరిగి ప్రతిస్టించేలా కృషి చేయాలి. 1987 లో వారి  శత జయంతి సందర్బంగా మన తపాలా శాఖ  ఒక ప్రతేక తపాల బిళ్ల (ఇండియా స్వతంత్ర పోరాటం - ఫిఫ్త్ సిరీస్ లో భాగంగా) 60 పైసల స్టాంప్ విడుదల చేసింది. T . RAMA SWAMY CHOWDARY Date of Issue :25 -04-1987 తెలుగు నాట హేతువాదభావాలను వెదజల్లిన హేతువాది, వైతాళికుడు,కవిరాజుగా ప్రసిద్ధి చెందిన  త్రిపురనేని రామస్వామి  (1887-1943) గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర యోధుడు. తెనాలి లో వారు స్థాపించిన ' సూతాశ్రమం' అనేక సంస్కరణ ఉద్యమాలకు  కేంద్రంగా  భాసిల్లింది.  ప్రజలను   మేలుకొలిపే   హేతువాద   భావాలను   వ్యక్తపరచడానికి   సాహి...

మనోవైజ్ఞానిక సాహితీవేత్త- త్రిపురనేని గోపిచంద్

First day Cover  India Post released a stamp to honer Tripuraneni Gopichand on 8th September 2011. Tripuraneni Gopichand  ( 8 September 1910 - 2 November 1962 ) was a Telugu short story writer, novelist, editor, essayist, playwright and film director.  Gopichand's writings are remarkable for interplay of values, ideas and 'isms' - materialism,  rationalism, existentialism, realism and humanism. He is especially celebrated for his second novel 'Asamardhuni Jeevayatra' (The Incompetent's Life Journey). This is the first psychological novel in Telugu literature. Gopichand's work'Panditha Parameshwara Sastry Veelunama' in 1963 was presented with the Sahitya Akademi Award - This was the first Telugu novel to win the award. TRIPURANENI GOPICHAND ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, మనోవైజ్ఞానిక  సాహితీవేత్త  మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న...

వేమన

VEMANA - 17th century ప్రజా కవి వేమన ౩౦౦ వ జయంతి సందర్బంగా అక్టోబర్ 16 , 1972 న విడుదలైన 20 పైసల తపాల బిళ్ళ. " విశ్వదాభిరామ వినురవేమ " అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యా లు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలిది తో అద్భుతమైన కవిత్వం , అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, వి లువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, హేతువాది మన యోగి వేమన.