Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post
Date of Issue: 23-4-2005
న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత.పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి రేడియో అక్కయ్య గా పేరొందారు.
బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాయపతి రాఘవరావుకు సంతానంలేదు. రేడియో అన్నయ్య , అక్కయ్యలకున్న లక్షల ఆస్తిని ఆంధ్ర బాలబాలికలకే ధారాదత్తం చేశారు. బాలబాలికల ఆటపాటలకు, సహజమైన వాళ్ళ కళాకౌశలానికి ప్రోత్సాహం అందించే వేదిక ఉండాలన్న ఆయన ఆశయానికి రూపకల్పనయే ప్రభుత్వం స్థాపించిన బాలల అకాడమి.
రేడియో అన్నయ్య గారి శత జయంతి సందర్బంగా తపాలా శాఖా ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది.
Comments
I hope and wish that Postal Department brings out on many such great Radio Artists like Prayaga Narasimha Sastyr, Banda Kanaka Lingeswara Rao, Ushasri, Nanduru Subba Rao, C. Ram Mohan Rao, P. Sitha Ratnamma and many more