ఏప్రిల్ 5 ,1919 న ముంబాయి నుండి లండన్ కు s.s.loyalty అనే నౌక మొదటి సారి ప్రయాణం చేసింది. దీనికి గుర్తుగా1964 నుండి ప్రతి ఏడాది అదే రోజు నేషనల్ మేరిటైం డే గా జరుపుతున్నారు. వాల్చంద్ హిరాచంద్,నరోత్తం మొరార్జీ లు సంయుక్తంగా స్థాపించిన సింధియ షిప్ యార్డ్ (హిందుస్తాన్ షిప్ యార్డ్) వారిచే నిర్మించ బడిన s.s.జల సూర్య1948,మార్చ్ 14 న జల ప్రవేశం చేసింది. 05-04-1965 న తపాల శాఖా వారు నేషనల్ మేరి టైం డే న విశాఖ పట్నంరేవు,జల సూర్య ఓడ బొమ్మతో ఒక ప్రత్యేకమైన తపాల బిళ్ళను విడుదల చేసారు.
Date of issue -02-04-1977
On the view of APPEX-88, A Special cover issued by Indian Post on Rani Rudrama Devi of Kakatiya Dynasty on 8-06- 1988. తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ 8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు. దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు. Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు. రాణి రుద్రమ దేవి అసమాన ధైర్య సాహసాలతో ఆనాటి ఆంధ్రదేశమంతటినీ సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో ఒక మహిళగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.



Comments