Andhra University centenary ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మన తపాలా శాఖ 26-04-2026 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేశారు. తెలుగు వారి చిరకాల కోరిక మేరకు విజయవాడలో 1926 లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం 1929లో విశాఖ పట్నం కు తరలించబడింది. నేడు ఈ విశ్వవిద్యాలయం దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత లక్ష్మీదేవి చదువుల దేవత సరస్వతీదేవి ల ఆసనానికి గుర్తు. స్వస్తిక్ ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు 64 కళలకు గుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి " నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు " అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి
ARUDRA (1925-1998) రచయిత, అభ్యుదయ కవి, సినీ గేయ కవి ఆరుద్ర గా లబ్ద ప్రతిష్ఠుడైన భాగవతుల సదాశివ శంకరశాస్త్రి శత జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 16-12-2025 న ఒక ప్రత్యేక స్మారక తపాల బిళ్ళను విడుదల చేశారు. వీరి రచనలలో ఆంధ్ర సాహిత్య చరిత్ర , త్వమేవాహం, వేమన వాదం, గుడిలో సెక్సు వంటి గ్రంథాల తో పాటు దాదాపు మూడు వేల సినిమా పాటలు రాసారు.