తపాల బిళ్ళ అనేది ఒక జాతి కీర్తి పతాకం. ఒక గౌరవ చిహ్నం. చరిత్రకు దర్పణం. తమ జాతిసంస్కృతి , సాంప్రదాయాలపైన , వేష భాషల పైన , కళలపైన, వైతాళికుల పైన ప్రత్యేక తపాలా బిళ్లలను ఆయా దేశాలు వారు ముద్రిస్తారు . వీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగాఉండే తపాల బిళ్ళల సేకరణకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు . మరి మన తెలుగు జాతి సంస్కృతి కి చరిత్రకి మన దేశపు తపాలా బిళ్ళలు దర్పణం పడుతున్నాయా అన్నది ప్రశ్నార్ధకమే. మన పోస్టల్ శాఖ వారు వెలువరించిన తపాల బిళ్ళల గురించి తెలుసుకుంటే ఈ విషయంలో మన తెలుగువారిపై ఎంత వివక్ష ఉన్నదో అవగతం అవుతుంది . భారత ప్రభుత్వం ఇప్పటి వరకు వెలువరించిన షుమారు 2550 పోస్టల్ స్టాంప్స్ లో తెలుగు వారి పైన , తెలుగు జాతి సంస్కృతి పైన 68ఏళ్లలో విడుదల చేసిన తపాలా బిళ్లలు కేవలం 50 లోపు మాత్రమే. విడుదల అయిన ఈ తపాల బిళ్ళల లో కుడా మన వారి కృషి కంటే మన ప్రక్క న ఉన్న తమిళనాట ఉన్న...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.