Skip to main content

Posts

Showing posts with the label Special Covers

పద్మ విభూషణ ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి

ప్రఖ్యాత తత్వవేత్త రచయిత విద్యావేత్త మరియు పద్మ విభూషణ ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 25-09-2024న ఒక ప్రత్యేక తపాలా కవరు (తపాలా చంద్రిక) ను విడుదల చేసారు. ఇది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో ఉన్న ' Prof Kotha Sachidanada Murty centre for Studiesbin Afro- Asian Philosophies' వారి సౌజన్యంతో విడుదల చేసారు.  Special cover on Dr. Kotha Sachidanada Morty కొత్త సచ్చిదానందమూర్తి (1924 సెప్టెంబరు 25 - 2011 జనవరి 25) ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. బౌద్ధమతముపై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త , విద్యావేత్త ఆచార్య పి. ఆర్. రామకృష్ణ

ప్రముఖ పారిశ్రామిక వేత్త , విద్యావేత్త ఆచార్య పి. ఆర్. రామకృష్ణ శత జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవరు 29-03-2018 న కోయంబత్తూరు లో విడుదల చేసారు.  A special cover on Prof. P.R. Ramakrishnan A special cover on Prof. P.R. Ramakrishnan was issued by India Post on 29th March, 2018 on his Birth centenary celebrations. Prof. P R RAMAKRISHNAN , Son of Shri V. Rangaswamy Naidu; born in Peelamedu, Coimbatore on October 11, 1917; educated at Madras University. A post-graduate in electrical engineering from the Massachusetts Institute of Technology (USA) Mr. Ramakrishnan had worked in the General Electric Company in the U.S. for seven years. P. R. Ramakrishnan was the first Indian Alumni of MIT Sloan School of Management and a graduate of Massachusetts Institute of Technology, United States who founded Madras Aluminum Company, South India Viscose, Coimbatore Institute of Technology and many other textile industries and two time Member of Parliament representing Indian National Congress fr...

జే. ఈశ్వరీబాయి - My Stamp and Special cover

భారత తపాల శాఖ 23 -02- 2021 న రిపబ్లిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ శాసన సభ్యురాలు, ప్రముఖ దళిత నాయకురాలు  శ్రీమతి  జే. ఈశ్వరీబాయిపై ఒక ప్రత్యేక తపాలా కవర్ మరియు వ్యక్తిగత తపాలా బిళ్ళను (My Stamp) విడుదల చేసింది .  Special cover on Dalit Icon J. Easheari Bai My Stamp - J. Eashwaribai My Stamp sheetlet  on Dalit Icon J. Eashwaribai

అల్లూరి సీతారామరాజు స్మృతి మందిరం , కృష్ణ దేవిపేట

Aluri Raju's tomb in Krishna Devi Peta village. AP. India Post released a special cover on Alluri Sitharamaraju memorial at Krishna Devipeta, A.P on 23 rd August 2021 With respect to many unsung Indian heroes of our prolonged battle against the British colonial rule in the past, Alluri Sitarama Raju, a great and daring revolutionary is one among them. His spirited and vital role in the Rampa rebellion of 1922–24 has carved a permanent niche for him in the pages of Indian history of freedom struggle.Alluri Raju's tomb is in Krishna Devi Peta village in Visakhapatnam district. భారత తపాల శాఖ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మృతి మందిరం , కృష్ణ దేవిపేట పై ఒక ప్రత్యేక కవరును 23 ఆగస్టు 2021న విడుదల చేసింది. 23 ఆగస్టు 1922 లో కృష్ణదేవి పేట పోలీసు స్టేషన్ పై అల్లూరి దాడి  చేసి అక్కడ ఉన్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. కృష్ణ దేవిపేట లో అల్లూరి సమాధిని నిర్మించారు.   

రంప తిరుగుబాటు శాతాబ్ది ఉత్సవాలు

India Post released a set of  two special covers on Rampa Revolution led by Alluri Sitharamaraju on 16th March 2022 at Addatigala and Rampa Chodavaram in Andhra pradesh.  అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన  రంప తిరుగుబాటు శాతాబ్ది ఉత్సవాల సందర్భంగా 16 మార్చ్ 2022 న రెండు అందమైన ప్రత్యేక కవర్లు విడుదల చేసారు.  అల్లూరి ముఖ్య అనుచరులు గాం మల్లు దొర మరియు  బొనంగి పాండు పడాలు   పై వీటిని విడుదల చేసారు. బ్రిటిష్ వారికి ముందస్తు దాడి సమాచారాన్ని మిరపకాయ టపా (Chilli Post) ద్వారా తెలిపేవారు. కవరుపై వారి చిత్రాలతో పాటు దీన్ని ముద్రించారు. వీటిపై  రామరాజు దాడి చేసిన అడ్డతీగెల, రంప చోడవరం పోలీస్ స్టేషన్స్ ఉన్న తపాలా ముద్రతో క్యాన్సిల్ చేసారు.   

మన జాతీయ జండా పరిణామక్రమం

మన  జాతీయ జండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి జయంతి సందర్బంగా 2ఆగష్టు 2022 న మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో నేను మన స్వతంత్ర పోరాటం గురించిన తపాళా బిళ్లలను ప్రదర్శించాను. ఈ సందర్బంగా వెంకయ్య గారిపై ఒక ప్రత్యేక కవరు విడుదల చేసారు. అలాగే కేంద్ర తపాల శాఖ మన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా   జాతీయ జండా పరిణామక్రమం పై 75/-రూపాయల ఒక మినియేచరును విడుదల చేసింది. Journey of the National Flag

అమరావతి స్టాంప్ & కాయిన్ ఫెస్టివల్

GNPS - (Guntur Numismatic and Philatelic Society)  25 వ వార్షికోత్సవం సందర్బం గా 2019 డిసెంబర్ 14, 15 తేదిలలో గుంటూరులో 'అమరావతి స్టాంప్   మరియు  కాయిన్ ఫెస్టివల్ పేరుతో తపాల బిళ్ళలు ,నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ లోని బాలాజీ మంటపం లో 2 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలోఅరుదైన వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడ్డాయి.  మహాత్మా గాంధీ 150 వ జయంతి సంవత్సర సందర్భంగా పొందూరు ఖద్దర్ తో ఉన్న ఒక ప్రత్యేక తపాల కవర్ ను విడుదల చేసారు.  గుంటూరులో ప్రముఖ ప్రజా వైద్యులు, రైతు నాయకులు డా. కాసారనేని సదాశివరావు గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.  GNPS రజతోత్సవ ప్రత్యేక సంచిక ను విడుదల చేస్తున్నారు. పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు జరిపి బహుమతులు ఇచ్చారు.  పొందూరు ఖద్దర్ తో ఉన్న ఒక ప్రత్యేక తపాల కవర్  ప్రముఖ వైద్యులు, రైతు నాయకులు డా. కాసారనేని సదాశివరావు   ప్రత్యేక తపాల కవర్ 

పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు

మన తపాలా శాఖ 19-09-2018 న పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు(ANR) 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసారు.  తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన అక్కినేని 256 సినిమాలలో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను చేరుకున్న నట సామ్రాట్. దేశంలో రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు దాదా సాయబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న అందాల నటుడు.  Special cover on Akkineni Nageswararao 

GUNTUR PEX - 2019

                     మహాత్మా గాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శన ' GUNTUR PEX - 2019 , గుంటూరులో ఫిబ్రవరి 2019,  19,20,తేదీలలో తపాలా శాఖ వారి ఆధ్వర్యంలో జరిగింది.  ఈ సందర్భంగా మహాత్మాగాంధిజీ పై రెండు ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేశారు  ఈ ప్రదర్శనలో గాంధీజీ పై వచ్చిన తపాలా బిళ్లలతో గాంధీజీ జీవితాన్ని ,ఆయన ఆశయాలను చాలా అద్భుతంగా తెలియజెప్పే ప్రయత్నం అనేకమంది తపాలా సేకరణ కర్తలు విజయవంతంగా చేశారు.         ఈ ప్రదర్శన సందర్భంగా తపాలా శాఖ గాంధీజీ పై రెండు ప్రత్యేక కవర్లు విడుదల చేసింది. పాఠశాల విద్యార్థులకు క్విజ్, వకృత్వ, వ్యాసాల యందు పోటీలు జరిగాయి. ముగింపు లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ ప్రదర్శనలో ఎంతో శ్రమకోర్చి తపాలా బిళ్ళలు ప్రదర్శించిన సేకరణ కర్తలందరికి ఙ్ఘాపికలు ఇచ్చారు.  ఈ తపాలా బిళ్ళల ప్రదర్శనలో ఒక ఫిలాటలిస్ట్ గా నేను "స్ట్రుగుల్ ఫర్ ఫ్రీడమ్" పేరుతో మూడు ఫ్రేమ్ ల తపాలా బిళ్లలను ప్రదర్సించాను.  ...

తపాలా కవరు పై పద్మ విభూషణ్ డా. అక్కినేని

తెలుగు చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారి 95వ జన్మదినం సందర్భంగా మన తపాలా విభాగం ఒక ప్రత్యేక తపాలా కవరును 19-09-2018 న హైదరాబాద్ లో విడుదల చేసింది. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొప్పదని భావించిన తత్వజీవి అక్కినేని.  SPECIAL COVER ON Dr. A.N.R. 

శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక తపాలా కవర్లు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన తపాలా శాఖ 10,11 అక్టోబర్ 2018 న తొమ్మిది   ప్రత్యేక తపాలా కవర్లు (AP/17to 26/2018) విడుదల చేసింది. వీటిపై పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు, హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు, చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి వార్ల  భిన్న చిత్రాలతో ఈ 9 కవర్లు ఉన్నాయి.  వీటి అన్నింటిపై ఒకే  శంఖు ,చక్ర ,నామ లతో ప్రత్యేక తపాలా ముద్ర  ఉన్నాయి  పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి సింహ  వాహనం పై వెంటేశ్వర స్వామి ముత్యాల పందిరి  వాహనం పై మలయప్ప స్వామి సర్వభూపాల వాహనం పై శ్రీనివాసుడు  కల్ప వృక్ష వాహనం పై శ్రీ మలయప్ప స్వామి  గరుడ  వాహనం పై  శ్రీనివాసుడు  మోహిని అవతారంలో శ్రీ మహా విష్ణువు 

డా. సి.నారాయణ రెడ్డి గారిపై ప్రత్యేక తపాలా కవరు

పద్మభూషణ్ అవార్డు గ్రహీత ,జ్ఞానపీట్ పొందిన కవి డా. సి.నారాయణ రెడ్డి 87 వ జన్మదినం సందర్భంగా హెదరాబాద్ తపాలా శాఖ  26-7-2018 న ఒక ప్రతీక తపాలా కవరు విడుదల చేశారు. ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో సినీరంగం లోకి ప్రవేశించి అనేక మధుర గీతాలను రాసారు. తెలుగు గజల్స్ కు రూపకర్త. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

A special cover was released India Post (A.P.) at Uyyalawada on 22nd February 2017 to celebrate the 170th death anniversary of the first freedom fighter of Uyyalawada, Uyyalawada Narasimha Reddy. స్వతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 170 వ వర్థంతి  సందర్భంగా 22-02-2017 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక కవర్ విడుదల చేసింది. 

శ్రీ వెలగపూడి రామకృష్ణ - My Stamp

వెలగపూడి రామకృష్ణ గారు దక్షిణ భారతదేశములో పేరుగాంచిన ఉన్నతోద్యోగి (ఐ.సి.యస్ ), పారిశ్రామికవేత్త మరియు దాత. ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో తొలితరము పారిశ్రామికవేత్తలలో రామకృష్ణ ముఖ్యుడు. వీరి గౌరవార్ధం మన భారత తపాలా శాఖ 30-12- 2016న ఒక వ్యక్తిగత తపాలా బిళ్ళను (My Stamp) విడుదల చేసింది Sri Velagapudi Rama Krishna శ్రీ వెలగపూడి రామకృష్ణ గారు 1896లో గుంటూరు జిల్లా,రేపల్లె తాలూకా,నగరం మండలములోని బెల్లం వారిపాలెం అను గ్రామములో జన్మించాడు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామమునకు చెందినవారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయములో బీఎస్సీ మరియు ఎంఏ విద్య నభ్యసించాడు.బ్రిటిషు వారి పరిపాలనా కాలములో (1941) కృష్ణా కమర్షియల్ ప్రాడక్ట్స్ (కె.సి.పి) అను పరిశ్రమల సముదాయము ప్రారంభించాడు. వాటిలో చక్కెర, సిమెంటు తయారు చేయు పరిశ్రమలు ముఖ్యమైనవి. రామ కృష్ణ గారు 1941 లో స్థాపించిన KCP Limited 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మన తపాలా శాఖ వారి సౌజన్యం తో వ్యక్తిగత తపాలా బిళ్ళను 30-12-2016 న విడుదల చేసారు. వారిపై ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేయాలని ఆశిస్తున్నాం. My Stamp sheetlet  on 75 Years of KCP ...

విజయవాడలో రాష్ట్ర తపాలా కార్యాలయం

A special cover was released on the ocassion of the inauguration of Andhra Pradesh Postal circle at Vijayawada on 11th October 2016 నూతన ఆంద్ర ప్రదేశ్ కు విజయవాడలో రాష్ట్ర తపాలా కార్యాలయం ఏర్పాటు సందర్భంగా 11-10-2016 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.  దీనిపై ఆంధ్రప్రదేశ్ పటం తో పాటు ఆంధ్రకు సంబంధించిన ఏడు తపాలా బిళ్ళల బొమ్మలు చూడవచ్చు.   Inauguration of Andhra Pradesh Postal circle 

Andhra Pradesh Social Welfare Residential Educational Institutions

A special cover was released in Vijayawada on 27th October 2016 to celebrate 30 years of Andhra Pradesh Social Welfare Residential Educational Institutions Society.

షిర్డీ నాగ సాయిబాబా - మచిలీ పట్నం

Special Cover on World’s biggest Shirdi Sai Baba idol of Machilipatnam, Andhra Pradesh, on 13th August 2016. ప్రపంచంలో ఈ తరహా విగ్రహాలలో పెద్దది అయిన షిర్డీ నాగ సాయిబాబా , మచిలీ పట్నం పై 13-08-2016 న తపాలా శాఖ ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది. 

Golden Girls of India - Pride of Nation

Special Cover on Golden Girls of India - P.V. Sindhu, Sakshi and Dipa - Pride of Nation - on 22nd August 2016.   Golden Girls of India - Pride of Nation  రియో ఒలంపిక్ క్రీడలలో వెండి పతకం  సాధించిన మన తెలుగు బిడ్డ  P.V. సింధు , మరియు మహిళా క్రీడా రత్నాలు సాక్షి మాలిక్ , దీపా కర్మాకర్ ల పై 22-08-2016 న  జార్ఖండ్ పోస్టల్ సర్కిల్ ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. అలాగే కర్ణాటక పోస్టల్ సర్కిల్ భారత ప్రభుత్వం ఇచ్చే క్రీడా పురస్కారాలు సందర్భంగా ఖేల్ రత్న - 2016 పేరుతో మరొక ప్రత్యేక తపాలా కవర్ 31-08-2016 న విడుదల చేసింది.  Karnataka Postal Circle issued a Special Cover in honour of four Rajiv Gandhi Khel Ratna 2016 Awardees on 31st August 2016 at Bengaluru. (Special Cover approval no. KTK/14/2016).

కృష్ణ పుష్కరాలు - 2016

On the occasion of Krishna Pushkaralu 2016, A.P. postal circle released   a set of post cards and Special Covers  అంగరంగ వైభవంగా నవ్యఆంధ్రలో జరిగిన కృష్ణ పుష్కరాలు -2016 ( 12 నుండి 23 ఆగస్టు -16) సందర్భంగా  ఆంద్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ప్రత్యక తపాలా కవర్లు విడుదల చేసింది.  అమరావతి - ధ్యాన బుద్ధ  (10-08-2016) ఇంద్రకీలాద్రి - విజయవాడ  (10-08-2016) శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం -19-08-2016 శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం - శ్రీకాకుళం, కృష్ణ జిల్లా (16-08-2016) బాపు మ్యూజియం -విజయవాడ  (21-08-2016) గాంధీ హిల్ , విజయవాడ బుక్ ఫెస్టివల్ - 22-08-2016 ఇవేకాక కృష్ణ పుష్కరాలు జరిగే కృష్ణ నదీతీరాలలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ లలో ఉన్న 18 ముఖ్యమైన దేవాలయాల చిత్రాలు ఉన్న 18 ప్రత్యేక పోస్టల్ కార్డ్స్ ను కూడా ముద్రించారు. వీటిపై ఆయా ప్రాంతాల ప్రత్యేక తపాలా ముద్రలు ఉన్నాయి.  వీటిలో ఆంద్ర ప్రదేశ్ కు చెందిన సంఘమేశ్వరం, శ్రీశైలం , వేదాద్రి, అమరావతి, విజయవాడ, మోపిదేవి...