ఈ ఏడాది కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి 125 వ జయంతి సంవత్సరం. 1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన త్రిపురనేని తెలుగు నాట హేతువాద భావాలు వెదజల్లిన వైతాళికుడు. కవి రాజు గారి 125 వ జయంతి సంవత్సరంలో వారు చూపిన హేతువాద మార్గం లో సమాజం ముందుకు పోయేలా అభుదయ వాదులు, హేతువాదులు కృషి చేయాలి. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ తిరిగి ప్రతిస్టించేలా కృషి చేయాలి.
1987 లో వారి శత జయంతి సందర్బంగా మన తపాలా శాఖ ఒక ప్రతేక తపాల బిళ్ల (ఇండియా స్వతంత్ర పోరాటం - ఫిఫ్త్ సిరీస్ లో భాగంగా) 60 పైసల స్టాంప్విడుదల చేసింది.
T.RAMA SWAMY CHOWDARY |
Date of Issue :25 -04-1987
తెలుగు నాట హేతువాదభావాలను వెదజల్లిన హేతువాది, వైతాళికుడు,కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి (1887-1943) గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర యోధుడు. తెనాలి లో వారు స్థాపించిన ' సూతాశ్రమం' అనేక సంస్కరణ ఉద్యమాలకు కేంద్రంగా భాసిల్లింది. ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాదనంగా ఎంచుకున్నాడు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టిన గొప్ప అభ్యుదయ వాది.
ముఖ్య రచనలు :
సూతపురాణము, కొండవీటిపతనము, కుప్పుస్వామిశతకం, మాలదాసరి, గోపాలరాయ శతకం,పల్నాటి పౌరుషం,శంబూకవధ, సూతాశ్రమ గీతాలు, ధూర్తమానవ శతకము, ఖూనీ, భగవద్గీత ,రాణా ప్రతాప్.
కవిరాజు రాసిన ఒక దేశభక్తి గేయం
వీరగంధము తెచ్చినారము - వీరుడెవ్వరో తెల్పుడీ
పూసిపోదుము - మెడను వైతుము - పూలదండలు భక్తితో
తెలుగు బావుట కన్ను చెదరగ - కొండవీటను నెగిరినప్పుడు
తెలుగు వారల కత్తి దెబ్బలు - గండికోటను గాచినప్పుడు
తెలుగువారల వేడి నెత్తురు - తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందున్న సహ్యజ - కత్తినెత్తురు కడిగినప్పుడు
ఇట్టి సందియమెన్నడేనియు - బుట్టలేదు రవంతయున్
ఇట్టి ప్రశ్నలు నడుగువారలు - లేకపోయిరి సుంతయున్
నడుము గట్టిన తెలుగు బాలుడు - వెనుక తిరుగండెన్నడున్
బాస యిచ్చిన తెలుగు బాలుడు - పారిపోవం డెన్నడున్
ఇదిగో యున్నది వీరగంధము - మై నలందుము, మై నలందుము
శాంతిపర్వము చదువవచ్చును - శాంతి సమరంబైన పిమ్మట
తెలుగునాటను వీరమాతను - జేసి మాత్రము తిరిగి రమ్మిక
పలు తుపాకులు పలు ఫిరంగులు - దారికడ్డము రాక తప్పవు
వీరగంధము తెచ్చినాము - వీరుడెవ్వరో తెల్పుడీ !!
Comments
వెంకట సుబ్బారావు కావూరి
తెలుగిల్లు
సంస్కరనోద్యమాలకు
గర్బ
సాథనముగా
ధూర్త మావన శతకము
స్వతంత్ర పోరాటం
త్రిపురనేని రామస్వామి చౌదరి ??????
సూతాశ్రమం,
సంస్కరణోద్యమాలకు,
సాధనముగా.
ధూర్త మానవ శతకము,
స్వాతంత్ర్యపోరాటము
చౌదరి ని ఆయన వర్జించారు