Skip to main content

Posts

Showing posts with the label stamps -2013

భారత రత్న బి. ఆర్. అంబేద్కర్ తపాల బిళ్ళ

Commemorative Stamp on Dr. B. R. Ambedkar & Constitution of India - 30th September 2015. Dr.B.R. అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా మన తపాల శాఖ 30-9-2015 న మరొక  స్మారక తపాల బిళ్ళ విడుదల చేసింది.   Dr.B.R. అంబేద్కర్ మరియు భారత రాజ్యాంగం పేరుతో ఈ తపాలా బిళ్ళ విడుదలైంది .  భారత రాజ్యంగ నిర్మాతగా ,దళిత బడుగు వర్గాలకు సమాజంలో ఉన్నత స్థానం కల్పించటానికి రిజర్వేషన్స్ , ప్రతేక హక్కులు కల్పించిన నేతగా , మేధావిగా , బౌద్ద మతాభిమానిగా, అబినవ మనువుగా  కొనయాడబడే వ్యక్తి భారతరత్న బి. ఆర్ అంబేద్కర్ (1891-1956).  Dr.B.R. Ambedkar and Constitution of India  వీరి గౌరవార్దం మన తపాల శాఖ ఇప్పటివరకు వివిధ సందర్బాలలో ఇంతకు పూర్వం  ఆరు తపాల బిళ్ళలు విడుదల చేసింది. మహాత్మా గాంధీ, చాచా నెహ్రు ల తరువాత అత్యధిక తపాల బిళ్ళలు విడుదల చేసింది  అంబేద్కర్ పైనే  75వ జయంతి 14-4-1966 న విడుదల చేసిన తపాల బిళ్ళ  Dr. B.R. Ambedkar  - 75th Birth Anniversary Date of Issue - 14 -04-1966 83వ జయంతి 14-4-1973 న విడ...

మహా కవి గురజాడ

India Post Released one  Commemorative  postal stamp  on Great Telugu Poet and  writer  Gurajada Venkata Apparao  on his 151th Birth anniversary on   21 May 2013. మన భారత తపాలా శాఖ  మహా కవి  గురజాడ వెంకట అప్పారావు గారి 151 వ జయంతి సం దర్బంగా  21-09-2013  న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది.      Gurajada Venkata Apparao గురజాడ వెంకట అప్పారావు (జ. 21-09-1862 - మ. 30-11-1915) దేశమంటే మట్టి కాదోయ్ - దేశమంటే మనుషులోయ్   వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్  అని వేలుగేత్తి చాటిన  తెలుగు జాతి వైతాళికుడు మహాకవి  గాసట బీసట గాధలతో , గజిబిజి గా ఉన్న  గ్రాంధిక  తెలుగు సాహిత్యాన్నిసామాన్యులకు చేరువచేసి భాషను సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ ఒకడు. హేతువాది.  19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కు...

ఏకలవ్య కు తపాల బిళ్ళ

India Post released a 5 rupees postal stamp   on EKLAVYA , a character in' Mahaa Bharatha' on 27 December 2013  Eklavya మన తపాల శాఖ 27-12-2013 న మహాభారతం లో ద్రోణాచార్యలకు గురు దక్షణ గా తన కుడి చేతి బోటని వేలును సమర్పించిన విలు విద్య  వీరుడు   ఏకలవ్య కు తపాల బిళ్ళ ను విడుదల చేసింది. First day cover - Eklavya ఏకలవ్యుడు   మహాభారతంలో  గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర.   నిషాధ తెగకు  చెందినవాడు.  ద్రోణాచార్యుని వద్ద   విలువిద్యను అభ్యసించాలని కోరికను తక్కువకులానికిచెందిన వాడైనందువల్ల ద్రోణుడు  తిరస్కరించడంతో, ఏకలవ్యుడు  బంకమట్టితో  ద్రోణుని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు మరియు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా విలు విద్యా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఒక నాడు అడివిలో ఏకలవ్యుడు విలువిద్యా నైపుణ్యం చూసిన ద్రోణుడు ఎక్కడ తన ప్రియ శిష్యుడు ఆర్జునుడిని  మించిప...

ఇండియా -జపాన్ మైత్రి బంధం ... కుతుబ్ మినార్ - టోక్యో టవర్

India Post released a 20 rupees Miniature stamp   on the Visit of Emperor Akihitho  and Empress Michiko  of Japan on 5th December 2013. The miniature sheet shows Qutub Minar and Tokyo Tower  Qutub Minar and Tokyo Tower జపాన్ దేశ రాజు రాణి మన దేశానికి వచ్చిన సందర్బం గా మన తపాలా శాఖ  5-12-2013 న ఒక మినిఎచర్ షీట్ ని విడుదల చేసింది.  ఇలా ప్రముఖులు దేశ సందర్శన కు వచ్చినపుప్పుడు వారి గౌరవార్దం వారి చిత్రాలతో  తపాలా బిళ్ళలు విడుదల చేయటం చాలా దేశాలలో ఉంది. కాని మన దేశం లో వ్యక్తుల ప్రీతి కొరకు ఇప్పటి వరకు తపాలా బిళ్ళలు విడుదల చేయలేదు. ఇదే తొలిసారి. జపాన్ రాజు రాణి చిత్రాలు కాకుండా ఇండియా -జపాన్ మైత్రి బంధం గా  దీనిపై కుతుబ్ మినార్ ,టోక్యో టవర్ చిత్రాలు ముద్రించారు.   

కంచరపార మరియు జమలపూర్ రైల్వే వర్క్ షాప్స్

India Post released a New Set of  Two Stamps and one Miniature sheet for  Railway Workshops - Kanchrapara and Jamalpur " on 26th November 2013. తూర్పు రైల్వే పరిధి లో ఉన్న కంచరపార మరియు జమలపూర్ లో ఉన్న రైల్వే వర్క్ షాప్స్ కు 150 ఏళ్ళు నిండిన సందర్బంగా 26 - 11 -2013 న మన తపాల శాఖ రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ ను విడుదల చేసింది.                                          Railway Workshops - Kanchrapara ,Jamalpur 

Children's Day - 2013

India Post released a stamp   on 14th November 2013  to celebrate Children's Day Children's Day - 2013 ప్రతి సంవత్సరం నవంబర్ 14 న నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళ పై ముద్రిస్తారు.  అలాగే ఈ ఏడాది   తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో ప్రధమ బహుమతి పొందిన చిత్రాన్ని  బాలల దినోత్సవం   14-11-2013న ప్రత్యక తపాలా బిళ్ళ గా  విడుదల చేసారు.  

సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం - తపాలా శాఖ ( కేంద్ర ప్రభుత్వం) అతి ఉత్సాహం

India Post released two postal Stamps and one miniature sheet, one Sheet let  On 14th November 2013, to honor Sachin Tendulkar, on veiw of his 200th test match at Mumbai.  Sachin Tendulkar - miniature sheet మన తపాలా శాఖ వారు అభిమాన క్రికెట్ క్రీడాకారుడు   సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం తో సత్కరించారు . మన దేశం లో జీవించి ఉన్న ఎ క్రీడా కారునికి దక్కని గౌరవం ఒక్క సచిన్ కె దక్కింది.  200 వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ  క్రికెట్ నుండి రిటైర్ అవుతున్న సందర్బం గా 14-11-2013 న సచిన్ టెండూల్కర్ పై రెండు తపాలా బిళ్ళలు (Rs 20/-), ఒక మినిఎచర్, ఒక షీట్ లెట్ ను విడుదల చేసారు. మన తపాలా శాఖ సాదారణంగా జీవించి ఉన్న వ్యక్తులకు తపాల బిళ్ళ విడుదల చేయదు. ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి సచిన్ కు తపాలా బిళ్ళలు విడుదల చేసి తమకు క్రికెట్ పిచ్చి ఉందని ప్రపంచానికి చాటుకుంది.  Sachin Tendulkar -  sheet let

భారతీయ విద్య భవన్

India Post released a stamp on 7th November 2013 to commemorate 75 years of Bharatiya Vidya Bhavan, which was set up by Dr. K.M Munshi in 1938 Bharatiya Vidya Bhavan and Dr. K.M.Munshi భారతీయ విద్య భవన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన భారత తపాలా శాఖ 7- 11- 2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళను విడుదల చేసింది.దీనిని 1938 లో గాంధీజీ సహకారం తో స్వాతంత్ర సమర యోదుడు శ్రీ కే యం  మున్షీ  గారు స్థాపించారు . " Let noble thoughts come to us from every side"   అనే ఋగ్వేద సూక్తం తో ఇది మన దేశం లో విద్య సేవ చేస్తుంది.  Dr. K.M.Munshi - Stamp Issued in 1988 నేడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారతీయ విద్యాభవన్ పేరుతో 100 పైగా విద్యాలయాలు నడపబడుచున్నాయి. మన రాష్ట్రం లో కుడా 14 చోట్ల భారతీయ విద్య భవన్ వారి విద్యాలయాలు ఉన్నాయి . వాటి వివరాలు - Bharatiya Vidya Bhavan's International Residential Public School - Vidyashram - Bhimavaram Bhavan's Vidyashram - Guntur Bhavan's Atmakuri Rama Rao School - Hyderabad Bhavan's Vidy...

భాక్ర డ్యాం - దేశ సేవలో 50 వసంతాలు

India Post released a stamp depicting the Bhakra Dam on 22nd October 2013 to celebrate 50 years of its glorious service of the Nation Golden Jubilee of Bhakra Dam భాక్ర డ్యాం సట్లేజ్ నది పై హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ లో నిర్మించ బడినది.  ఆధునిక దేవాలయం గా నెహ్రు గారిచే కీర్తించబడిన భాక్ర డ్యాం  225.25 మీ ఎత్తు తో మన దేశం లోఎత్తేయిన ఆనకట్టలలో  రెండోవ స్థానం లో ఉంది. దీనికి దిగువన మరో ఆనకట్ట నంగల్ లో ఉంది. ఈ రెంటిని కలపి భాక్రా నంగల్ ఆనకట్ట గా ప్రసిద్ది చెందినవి . 1955 లో మొదలు పెట్టి 1963 లో నిర్మాణం పూర్తి చేసుకొన్న ఈ బహుళార్దక ఆనకట్ట 50 ఏళ్లుగా మన దేశానికి ఉపయోగ పడుతున్నది.  ఈ  స్వర్ణోత్సవ వేళ మన తపాలా శాఖ 22-10-2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళ ను విడుదల చేసింది.  ఇంతకు ముందు కుడా ఈ డ్యాం పై రెండు తపాల బిళ్ళలు విడుదల చేసారు.  A Definitive stamp on Bhakra dam - 15-3-1967 Silver Jubilee of Bhakra dam - 15-12-1988

అహింసా మూర్తికి ఘన నివాళి - One more Souvenir Sheet On Gandhiji

India Post released New Souvenir Sheet on the occasion of   "Philately day 2013" on 12th October 2013. The Souvenir Sheet Shows two stamps of Mahatma Gandhi Issued by India Post in 1948 (12A) and 1969 (75) Souvenir Sheet  – Philately Day – Mahatma Gandhi మన తపాలా బిళ్ళల లో  సింహ భాగం మహాత్మా గాంధీ పైనే విడుదల చేసారు. తపాలా బిళ్ళల సేకరణలో మహాత్మా గాంధీజీ తపాలా బిళ్ళ లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది . ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ అహింసా మూర్తిని తమ తపాలా బిళ్ళ ల పై ముద్రించి గౌరవించాయి. వీటిని సేకరించటానికి పలు దేశాలలో తపాల బిళ్ళ ల సేకరణ దారులు తహతహ లాడుతుంటారు. పాత తపాల బిళ్ళలు అందరికి అందుబాటులో ఉండటానికి ఇలా ప్రత్యేక స్మారక తపాలా చిత్రం ( Stamps on Stamp) విడుదల చేస్తారు.    తపాలా బిళ్ళల సేకరణ దినోత్సవం సందర్బం గా 12-10-2013 న మన తపాలా శాఖ ఒక సావనీర్ షీట్ (  స్మారక తపాలా చిత్రం ) విడుదల చేసింది. దిని పై మాహాత్మ గాంధీ చిత్రం తో పాటు 1948 లో విడుదలైన 12 అణాల గాంధీ తపాలా బిళ్ళ ,1969 లో విడుదలైన 75 పైసల...

ఎట్టకేలకు గురజాడకు తపాల బిళ్ళ

India Post Released one  Commemorative  postal stamp  on Great Telugu Poet Gurajada Venkata Apparao  on his 151th Birth anniversary on   21 May 2013. మహా కవి శ్రీ గురజాడ వెంకట అప్పారావు గారికి తపాల బిళ్ళ విడుదల చేయాలన్న అభిమానుల కోరిక నెరవేరింది.  అనేక విన్నపాల తరువాత ఎట్టకేలకు మన భారత తపాలా శాఖ గురజాడ వెంకట అప్పారావు గారి 151 వ జయంతి సందర్బంగా   21-09-2013 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది.  Gurajada Venkata Apparao మన ప్రభుత్వ అధ్వర్యంలో నిరుడు గురజాడ 150వ జయంతి ఉత్సవాలు చాలా ఖర్చు పెట్టి  హడావుడిగా చేసారు. అప్పుడు నిర్వహాకులకు ముందు చూపు, సరైన ప్రణాళిక లేక గురజాడ వారి 150 వ జయంతికి  తపాల బిళ్ళను  విడుదల చేయించలేక పోయారు. కేవలం ఒక ప్రత్యేక తపాలా కవరు మాత్రమే విడుదల చేసారు. ఆలస్యంగా నైనా "దేశమంటే మట్టి కాదోయ్ , దేశమంటే మనుషులోయ్ " అని చాటిన  మన గురజాడకు ఘనంగా తపాలా బిళ్ళ విడుదల  చేసి ఆ మహనీయునికి  దేశవ్యాప్త గుర్తింపు కలుగచేస్త...

Wild flowers of India

India Post released as set of 12 stamps and three miniature  sheets  in the occasion of Asian Pacific Postal Union Congress , held at New Delhi  on 3rd September 2013  All the 12 stamps are issued on theme of 'Wild flowers of India' Miniature sheets of  Wild flowers of India

శ్రీలంక తపాలా బిళ్ళ పై స్వామి వివేకానంద

స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్బంగా శ్రీలంక  తపాలా శాఖ వారికి ఘన నివాళి గా 7-6-2013 న ఒక  ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. Swami Vivekanda - Sri Lanka Swami Vivekanada-Sri Lanka- Fdc వివేకానందునికి నివాళిగా ఇంతకు ముందు కుడా శ్రీలంక ప్రభుత్వం15-01-1997 లో  ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.  Swami Vivekanada- Visit to Sri Lanka Swami Vivekanada- Visit to Sri Lanka- FDC మన తపాల శాఖ వారు ఇంతకు ముందు స్వామి వివేకానంద పై వివిద సందర్బాలలో విడుదల చేసిన  తపాలా బిళ్ళల ను చూడటానికి ---   స్వామి వివేకనంద -1 , swami vivekanda-2

అంతరించి పోతున్న అడవి గాడిదలు

గుజరాతు లో కుచ్చ్  ప్రాంతం లో ఉన్న ఘోర్ ఖర్, లడక్ లో సంచరించే కయాంగ్ జాతి గాడిదలు మన దేశం లోఅంతరించి పోతున్న అడవి గాడిదలు. వీటిని కాపాడటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.  భారత తపాలా శాఖ 10-5-2013 న వీటి పై రెండు తపాలా బిళ్ళలు(Rs5/- ,Rs20/-) మరియు ఒక మినిఎచర్ ను విడుదల చేసింది.  అడవి గాడిదల పాటు మన దేశ వాళీ గాడిదలు కుడా త్వరలో కనుమరుగై స్థితి లో ఉన్న పరిస్థితులలో వీటిని సంరక్షించు కోవలిసిన భాద్యత పర్యావరణ పరిరక్షకులందరి పైన ఉంది.   India Post released a set of 2 stamp and Miniature Sheet on the    endangered Indian Wild Ass of Kutch and Ladakh on 10th May 2013.  The Stamps depict the Kiang ( Ladakh) and Ghor Khar ( Kutch, Gujarat) Ass on the face value of Rs.5/- and Rs.20/- stamps. Wild Ass of Kutch and Ladakh -M.S  Wild Ass of Kutch and Ladakh- Fdc 

తపాల బిళ్ళల పై S. V. రంగారావు , భానుమతి, అల్లు రామలింగయ్య

వందేళ్ళ సినిమా కి వందనం  మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు .  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు  S. V. రంగారావు ,  భానుమతి,  అల్లు రామలింగయ్య   ఎస్వీ రంగారావు (1918-1974) సామర్ల వెంకట రంగారావు   - SVR గా తెలుగు చిత్ర సీమలో పేరొందిన   నటుడు.  మూడు దశాబ్దాలపాటు మూడొందల పైగా సాంఘిక పౌరాణిక సినిమాలలో  అద్భుతంగా నటించిన సహజ నటుడు.   ఘటోత్కచుడిగా ,  కీచకుడిగా ,  రావణాసురుడిగా  తనకు తానే సాటిగా ప్రేక్షకుల మన్నలను గడించాడు. ...

తపాల బిళ్ళల తో 50 మంది చలన చిత్ర ప్రముఖులకు ఘన నివాళి

India Post Released 6 Miniature Sheets for 50 Indian Icon personalities of Indian Cinema to Celebrate the 100 Years (Century) Of Indian Cinema on 3rd May 2013. మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 (2X9) సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది(4X8) వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు . వీటిని ఆరు మినిఎచర్స్ గా విడుదల చేసారు.  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు అల్లు రామలింగయ్య(3/6),    భానుమతి(3/6)  లను మూడో మినిఎచర్ లోను,  S. V. రంగారావు(5/6) ను  ఐదవ మినిఎచార్ లోను చూడవచ్చు.  తపాల బిళ్ళల పై ఉన్న  50 మంది చలన చిత్ర ప్రముఖులు 100 Years Of Indian Cinema...

శ్రీ కూర్మం కుర్మానాధ దేవాలయం - శ్రీకాకుళం

India post Issued a set of two postage stamps and one miniature sheet on  Srikurmam and   Arassavalli  Temples in Srikakulam Dist. Andra Pradesh on the occasion of Telugu new year "Ugadi" on 11-04-1213.  These set of stamps and Miniature have been released in the series of Architectural Heritage of India. ARCHITECTURAL HERITAGE OF INDIA - M.S ARASAVALLI - SRI KURMAM TEMPLES మన భారత తపాలా శాఖ 11-04-2013 న  భారతీయ శిల్ప కళా సంపద లో భాగం గా  "Architectural Heritage of India " పేరుతో తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున  మన రాష్ట్రం లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రెండు ప్రాచీన దేవాలయాల పై రెండు తపాలా బిళ్ళలు  మరియు ఒక మినియెచర్ ను విడుదల చేసింది. వీటిపై 20 రూపాయల విలువ గల తపాలా బిళ్ళపైన అరసవల్లి సూర్య దేవాలయం , 5 రూపాయల విలువ గల మరొక తపాలా బిళ్ళ పైన  శ్రీకూర్మం లోని కూర్మనాధ స్వామీ ఆలయం చోటు చేసుకున్నాయి. ఇవి రెండు జంట గా అందమైన మరో 25 రూపాయల మినియెచర్ కుడా విడుదల చేసార...