Skip to main content

Posts

Showing posts with the label Pictorial Cancellations

శ్రీశైలం - మల్లిఖార్జున స్వామి దేవాలయం

                                      శ్రీశైలం -  మల్లిఖార్జున స్వామి దేవాలయం ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రఖుమైనది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి  శ్రీశైలం లో ఉన్న భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం.  ఈ ఆలయం పై మన భారత తపాల శాఖ   15  - 5  - 2003  న  ఒక తపాల బిళ్ళవిడుదల చేసింది. మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా లో నలమల కొండల పై ఉన్న ఈ   దేవాలయము  అభేద్యమైన ప్రాకారము కలిగి  లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో చూడ ముచ్చటగా ఉంటుంది.  ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా  చాలా సాధారణ నిర్మాణం తో ఉంటుంది. Mallikarjuna   swami   temple   - SRISAILAM - FDC  శ్రీశైలం భ్రమరంభా మల్లిఖార్జునల దేవాలయం ఫై ఇంతకు ముందు మన తపాల శాఖ ఆ ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి  ప్రత్యేక పోస్టల్ ముద్ర ను కేటాయించి 7-3-1978 ...

భద్రాచలం - ప్రత్యేక తపాల ముద్ర

The Inaugural cover of Pictorial Cancellation  at Bhadrachalam  Issued date : 09 April 1976.  ఆంద్ర అయోధ్యగా పిలవబడే భద్రాచలం కు మన తపాల శాఖ వారు 09 -04 -1976 లో ఒక ప్రత్యేక పోస్టల్ ముద్రను(Pictorial cancellation) కేటాయించారు. భద్రాచలం  శ్రీ సీతా రామా స్వామి ఆలయం పేరు వింటే జ్ఞప్తికి వచ్చే వ్యక్తి, ఆలయ నిర్మాణం చేసి  భక్త రామదాసుగా కీర్తించబడే కంచర్ల గోపన్న. భద్రాచల ఆలయ విశిష్టతను, చరిత్రను చాటేలా భక్త రామదాసు బొమ్మతో ఈ పోస్టల్ ముద్రను రూపొందించారు.  ఆ సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవరు పై భద్రాచల సితారామాలయ శిఖరం పై ప్రతిష్టించి ఉన్నకలశం 'శ్రీ చక్రం' ను ముద్రించారు. 

కాకతీయులకు గుర్తింపు ఏది?

శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.  తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు.   కాకతీయ సామ్రాజ్యము( 1083-1326 )వెల్లివిరిసిన  కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి.   కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత రాణి రుద్రమ దేవి. కాకతీయ సామ్రాజ్యం 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో రెండవ ప్రతాప రుద్రుని మరణంతో పతనమయ్యింది. ఆ తరువాత కాకతీయుల సేనానులు  ముసునూరు నాయకులు 1326 లో తిరిగి తురుష్కులను పారదోలి 1370 వరకు ఓరుగల్లును పాలించారు. ముసునూరి కాపయ నాయకుని మరణంతో  వైభవాన్ని కోల్పోయి ఈ ప్రాంతం ముస్లిం పాలకుల చేతికి వచ్చింది. తరువాత  బహుమనీ సుల్తానులు ,  గోల్కొండ  సుల్తానులు, మొఘలు పరిపాలకులు,  నిజాం  సుల్తానులు ఏలుబడిలోకి వచ్చి పోలిస్ ...

తిరుమల - ప్రత్యేక పోస్టల్ ముద్ర

Special Cover : THIRUMALA - PICTORIAL POSTMARK   Date of Issue : 06-11-1976 తిరుమల  శ్రీ వేంకటేశ్వరాలయం చరిత్ర లో మనకు వెంటనే స్పురించే వారిలో మొదటి వాడు అన్నమయ్య అయితే రెండోవవాడు శ్రీ కృష్ణ దేవరాయలు.శ్రీ కృష్ణ దేవరారాలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల మాట ఎటు తెలకపోయిన వారి విగ్రహాలు మాత్రం గుడిలో బద్రంగా ఉన్నాయి. రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా తెలుగు వారు వారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం ముదావహం. తిరుమల  తపాల కార్యాలయానికి కేటాయించిన ప్రత్యేక పోస్టల్ ముద్ర లో పద కవితా పితామహుడు అన్నమయ్య చిత్రం,ఆసందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవరు పై శ్రీవారి ఆనందనిలయం లో ముఖిళిత హస్తాలతో దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవారాయల కాంస్య విగ్రహాలు చిత్రించారు.  రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా   వారిపై త్వరలో ఒక తపాలా బిళ్ళ కుడా విడుదల చేయబోతున్నారు.

అమరావతి - Pictorial Cancellation

A Special Cover to commemorate the inauguration of Pictorial Cancellation at Amaravathi on 28-02- 1976 అమరావతి ని చారిత్రిక ప్రసిద్ధిని గుర్తించిన తపాల శాఖవారు అమరావతికి ప్రత్యేక తపాల ముద్రను 28 - 02 - 1976 లో కేటాయించారు . ఈ ప్రతేక కవర్ పై బుద్దుని బొమ్మ , క్యాన్సిలేషన్ ముద్రపై అమరావతి లో ఒకప్పుడున్న బౌద్ద స్తూపం ఉంది . ఈ స్తూపం పై ఉన్న శిల్పాలలో ఒక దానిని చెన్నై మ్యుజియం కు 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా విడుదలైన తపాల బిళ్ళపై ముద్రించారు.ఈతపాలాబిళ్ల ల తో పాటు ఒక మినిఎచార్ కుడా విడుదల చేసారు.

శ్రీశైలం- Temple city - Srisailam Pictorial Cancellations

ప్రత్యేక పోస్టల్ ముద్ర - శ్రీశైలం భ్రమరంభా మల్లిఖార్జునల దేవాలయం Pictorial Cancellations – Inaugural Cover- Srisailam A Pictorial Cancellation was introduced at Srisailam on Lord Mallikarjuna Temple on 07 Mar 1978 . An Inaugural special cover was issued to commemorate the Event. The Cancellation shows Temple and cover Shows Lord Mallikarjuna and Bhramaramba. Srisailam is a Holy town situated in Nallamala Hills of Kurnool District of Andhra Pradesh on the banks of River Krishna.

ప్రత్యకమైన పోస్టల్ ముద్ర - Pictorial Cancellations

చారిత్రాత్మక ప్రదేశాలకు , కట్టడాలకు ప్రత్యకమైన పోస్టల్ ముద్రను ( Pictorial Cancellations) కేటాయించి వాటి విశిష్టతను తెలియజేస్తారు . ఈ పిటోరియాల్ ముద్రలు మన ఆంధ్ర ప్రదేశ్ సంభందించిన వాటిని మీకు తెలియజేస్తాను . జమ-ఐ- ఉస్మానియా : Pictorial Cancellation was introduced at Jama-i- Osmania on 11 Oct 1976. An Inaugural special cover was issued to commemorate the Event. చార్మినార్: Pictorial Cancellation was introduced at Charminar , Hyderabad on 21 Apr 1975. An Inaugural special cover was issued to commemorate the Event.