Skip to main content

Posts

Showing posts from 2026

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు - ప్రత్యేక తపాలా బిళ్ళ

Andhra University centenary ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల  సందర్భంగా మన తపాలా శాఖ 26-04-2026 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేశారు. తెలుగు వారి చిరకాల కోరిక మేరకు విజయవాడలో 1926 లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం 1929లో  విశాఖ పట్నం కు తరలించబడింది. నేడు ఈ విశ్వవిద్యాలయం దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత  లక్ష్మీదేవి  చదువుల దేవత  సరస్వతీదేవి  ల ఆసనానికి గుర్తు. స్వస్తిక్  ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు  64 కళలకు గుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి " నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు " అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి