చీకటిని పారదోలేది జ్యోతి. జ్ఞానాన్ని ప్రసాదించేది దీపం. దీపాల వరుస దీపావళి . చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి జ్ఞాన కాంతులు వెదజల్లాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు. ఆనందాల వెలుగులు ప్రసరించే దీపావళి పండుగకు గుర్తుగా అనేక తపాలా బిళ్ళలు విడుదల చేశారు. మన దేశం కెనడా దేశం రెండు కలసి సంయుక్తంగా దీపావళి పై 21-09-2017 న రెండు తపాలా బిళ్ళలు విడుదల చేసాయి. ఇంతకు ముందు దీపావళి పండుగ ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ అమెరికా తపాలా శాఖ 5-10-2016 న ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. అలాగే జ్యోతి హిందువులతో పాటు జురాస్టియన్ మతం వారికి పవిత్రమైనది. ఇజ్రాయిల్ మరియు భారత దేశాలు తమ మద్య మొదలైన ద్వైపాక్షిక సంభందాలకు 20 వసంతాలు పూర్తి అయిన సంధర్బం గా ఇరు దేశాలు Festivals of Lights పేరుతో రెండు తపాలా బిళ్ళలను 5-11-2012 న విడుదల చేసారు. మన రెండు దేశాలలో దీపాలు వెలిగించి జరుపుకొనే దీపాల పండుగల ను ఇతి వృత్తం గా తీసుకుని రూపొందించిన ఈ తపాల బిళ్ళల పై మన దీపావళి , ఇజ్రాయిల్ లో జరుపుకొనే ...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.