Skip to main content

Posts

Showing posts with the label వాగ్గేయకారులు

శ్రీ నారాయణ తీర్దులు

పూజ్యశ్రీ నారాయణ తీర్థ ల వారి ౩౩౦ వ జయంతి సందర్బంగా మన  తపాల శాఖా వారు 11-2-2006 న  ఒక ప్రత్యేక కవరు విడుదల చేశారు. Special cover on Swamy Narayanatirtha by Indian Post on 16-07-2005 ప్రముఖ వాగ్గేయ కారుడు కూచిపూడి నృత్యంలో శ్రీ కృష్ణ  లీలా తరంగిణి రూపకర్త పూజ్యశ్రీ నారాయణ తీర్దులు  ( 1675-1745) అసలు పేరు   గోవింద శాస్త్రి. వీరు  క్రీ.శ. 17వ శతాబ్దములో గుంటూరు జిల్లా కాజ గ్రామములో తల్లావజ్జుల నీలకంఠశాస్త్రి, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. అతి చిన్న వయసులోనే సంగీతము, సంస్కృతము, శాస్త్రాలు అభ్యసించాడు. చిన్నవయసులోనే వివాహము జరిగింది. నారాయణ తీర్థ చిన్నతనమునుండే పూజలు, భగవన్నామస్మరణం చేస్తుండేవాడు. స్వామి శివానందతీర్థ పరిచయ భాగ్యముతో సన్యాస దీక్షాముఖముగా పయనించాడు. నారాయణ తీర్థ సంగీత సంస్కృత భాషాపరిజ్ఞానానికి శివానందతీర్థ మెరుగులు దిద్దాడు. భూపతి రాజపురములో స్థిర నివాసమేర్పరచుకొని "శ్రీ కృష్ణలీలాతరంగిణి" కావ్యము వ్రాశాడు. ఒక కావ్యానికి కావలిసిన మూడు ప్రధానాంశాలు పద్యము, గద్యము, వచనము కావ్...

సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు

Dr . DWARAM VENKATASWAMY NAIDU India post Issued a   Commemorative   postage   stamp  on   8-11-1983. ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 - 1964 ) గొప్ప వయెలిన్ (వాయులీనం) విద్వాంసుడు. భారత ప్రభుత్వం వీరికి  1957 లో పద్మశ్రీ అవార్డ్ ప్రధానం చేసింది. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం 'మహారాజా సంగీత కళాశాల'లో వయొలిన్ ఆచార్యునిగా చేరి, 1936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు.వయోలిన్ వాయిద్యంతో ఒంటరిగా  కచేరీలు (solo concerts, అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇచ్చి వయోలిన్ కి విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చారు. కర్ణాటక సంగీతంలో ఉన్న కీర్తనలను వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి కూడా ఇతనే. సంగీతం అనేది " వివిపించే తపస్సు " అనీ, ఏరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ   తన శిష్యులకు చెప్పేవాడు. సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడి గారి శతజయంతి సందర్బంగా ( 8 - 11 - 1993 ) న మన తపాల శాఖ  ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు . First day cover

స్వాతి తిరునాళ్ రామవర్మ

A COMMEMORATIVE STAMP BY INDIA POST ON CARANATIC COMPOSER SWATHI THIRUNAL RAMA VARMA DATE OF ISSUE :2 -5 -1988 శ్రీ స్వాతి తిరునాళ్ రామవర్మ (ఏప్రిల్ 16, 1813 - డిసెంబరు 25, 1846) కేరళలోని తిరువంకూరు మహారాజు. స్వాతి తిరునాళ్ సంగీతాన్ని బాగా ప్రోత్సహించేవారు. ఇతడు కర్నాటక సంగీతంలో ఇంచుమించు 400 కృతులు రచించారు. ఇతనికి సంస్కృతం, హిందీ, మళయాలం, మరాఠీ, తెలుగు, తమిళం, ఒరియా, ఇంగ్లీషు మరియు కన్నడ భాషలలో ప్రావీణ్యం కలదు.  స్వాతి తిరునాళ్ తెలుగులోపదికి పైగా కీర్తనలు రచించాడు.వీరి తెలుగు లో రచించిన  కీర్తనలలో  'వలపు తాళ వశమా నా సామికి చలము సేయ న్యాయమా' , ' ఇటు సాహసముల ఏల నాపై చక్కని స్వామీ ' అనేవి  మిక్కిలి ప్రసిద్ధమైనవి. వీరి గౌరవార్దం 2 -5 -1988 న (175వ జయంతికి) మన తపాల శాఖ ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదలచేసింది. 

వెంకట రమణ భాగవతార్

A Commemorative postage stamp on 27 - 12 - 2009 VENKATARAMANA BHAGVATHAR త్యాగ రాజు గారి ప్రియ శిష్యుడు కర్నాటక సంగీత లో నిష్ట్నాతుడు , వాగ్గేయ కారుడు శ్రీ వేంకట రమణ భాగవతార్ . త్యాగ రాజ స్వామి తన మరణం కు ఒక నెల రోజుల ముం దు వేకట రమణ భాగావతర్ను పిలిచి తన ఆరాధ్య దైవం శ్రీ రామ చంద్ర మూర్తి పూజా విగ్రహాన్ని , దానితో పాటు తన తాళ పత్ర కృ తులు ఇచ్చి తన సంగీత వారసత్వాన్ని కొనసాగించమని కోరా డు . త్యాగ రాజ స్వామి శిష్య పరంపర కొనసాగటానికి వేంకటరమణ భాగవతర్ చేసి న కృషి మరువ లేనిది . తెలుగు , సంస్కృతాలలో మంచి ప్రావీణ్యం ఉన్న శ్రీ వేంకటరమణ భాగవతార్ గారు అనేక కృతులను రచించారు .వీరి గౌరవార్దం 27 - 12 - 2009 లో ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల అయింది.

శ్యామశాస్త్రి

A commemorative postage stamp of SHYAMA SHASTRI ON 21 - 12 - 1985 శ్రీ శ్యామ శాస్త్రి ( 176 2 - 1827 ) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ( త్యాగయ్య , ముత్తు స్వామి దీక్షితులు ) మూ డవ వాగ్గేయ కారుడు. తమిళనాడు లోని తిరువారూరు గ్రా మస్థుడు . శ్యామ శాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము , ముద్దు గా శ్యామకృష్ణా యని పిలిచేవారు . అదే ఈయన కృతుల లో ఈయన ముద్ర అయినది . ఈయన కామాక్షి దేవి ఉపాసకుడు . ఆ దేవత పై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు . ఈయన కలగడ , మాంజి , చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు . తెలుగు,సంస్కృత భాషా కోవిదుదైన ఈయన కృతులలో ముఖ్యమైనవి : ఓ జగదంబా , హిమాచలతనయ , మరి వేరే గతి యెవ్వరమ్మా , హిమాద్రిసుతే పాహిమాం , శంకరి శంకురు , సరోజదళనేత్రి , పాలించు కామాక్షి , కనకశైలవిహారిణి , దేవీ బ్రోవ సమయమిదే , దురుసుగా , నన్ను బ్రోవు లలిత , మొదలగునవి . ప్రఖ్యాత వాగ్గేయకారుడైన సుబ్బరాయ శాస్త్రి వీరి కుమారుడే . వీరి గౌరవార్దం 1985 , డిసెంబర్ 21 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు .

త్యాగయ్య

A commemorative postage stamp of TYGARAJA - ON 6 - 1 - 1961 త్యాగరాజు ( 1767 - 1847 ) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు . నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు . కాకర్ల త్యాగ భ్రహ్మం పూర్వీకులు ప్రకాశం జిల్లా , కాకర్ల గ్రామమునుండి తమిళదేశానికి వలస వెళ్లారు . త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు . వీటిలో చాలావరకు ఆయన మాతృభాష తెలుగులో రచించబడినవి . కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్న కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి . వారి 1 14 వ వర్ధంతి ( జనవరి 6 , 1961 ) న ప్రతేక తపాల బిళ్ళ విడుదల చేసారు . ఇది మన తెలుగువారిపై విడుదలైన రెండవ తపాల బిళ్ళ .

అన్నమయ్య

A commemorative postage stamp on ANNAMACHARYA - 18th march 2004 పద కవితా పితామహుడు - వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచర్య గౌరవార్ధం 2004 మార్చ్ 18 న విడుదలైన ఐదు రూపాయల తపాల బిళ్ళ , ప్రత్యేక కవరు . చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసిన మన అన్నమయ్య కు ఈ తపాల బిళ్ళ ఒక నివాళి .