Skip to main content

Posts

Showing posts with the label చరిత్ర

టెర్రాకోట తో కట్టిన దేవాలయాలు

A set of seven Commemorative Postage Stamps (CPS) on Terracotta Temples of India (1.Indralarh Temple, Ranipur Jharial, 2. Madan Mohan Temple, Bishnupur,3.Jor Bangla Temple, Bishnupur, 4. Nebiya Khera Temple, Bhadwara, 5. Lakshman Temple, Sirpur, 6. Lalji Temple, Kalna, 7. Shyam Rai Temple, Bishnupur) was released by India Post on 08.08.2020 మన దేశంలో టెర్రాకోట తో కట్టిన దేవాలయాలను ఇతివృత్తంగా చేసుకొని మన భారత తపాలా శాఖ 08-08-2020 న ఏడు తపాలా బిళ్ళలు తో కూడిన ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  శిలలపై శిల్పాలు చెక్కి దేవాలయాలు నిర్మించటం మనం సాధారణంగా చూస్తాం. రాతి శిలలు లభించని ప్రాంతాలలో ఇటుకలతో కట్టిన దేవాలయాలను నిర్మించి వాటి గోడలపై మట్టి పలకలపై (టెర్రకోట) అందంగా తాయారు చేసిన శిల్పాలను తాపడం చేసి ఆలయం  నిర్మించటం ఒక విశిష్ఠ వాస్తు శిల్పకళ.  పశ్చిమ బంగా లో బంకురా జిల్లా లో ఉన్న విష్ణుపూర్ లో మల్ల రాజులు   బంగా వాస్తు పద్దతిలో నిర్మించిన టెర్రకోట దేవాలయాలలో ముఖ్యమైన మూడు వైష్ణవ  ఆలయాలు   మదనమోహనాలయం (1694), జోర్ బంగ్లా దేవాలయం (1...

జానపద కళాకారుల వాయిద్య పరికరాలు - బుర్ర కథ కళాకారుడు - డిక్కీ

మన భారత తపాలా శాఖ 28-06-2020 న జానపద కళాకారుల వాయిద్య పరికరాలు (Musical Instruments of Wandering Minstrels) పేరుతో మన బుర్ర కథలో వంత పాడే కళాకారుడు వాడే వాద్యం  డిక్కీ  కు, దానిని వాయిస్తున్న కళాకారుడితో పాటు మరో ఐదు జతల (se-tenant) తపాలా బిళ్ళలు విడుదల చేసింది.  Kamaicha,Ravanahatha,Surando,Algoza,Burrakatha,Ektara Musical Instruments of Wandering Minstrels మన దేశీయ జానపద కళాకారుల వాయిద్య పరికరాల కేటగిరిలో మన తెలుగు వారి జానపద కళ అయినా బుర్ర కథలో ప్రధానంగా ఉపయోగించే వాయిద్యమైన డిక్కీ కు, దానిని వాయిస్తున్న  వంత పాడే కళాకారునికి  తపాలా బిళ్ళపై స్థానం కల్పించటం మన జానపద కళకు దక్కిన గౌరవంగా పరిగణించవచ్చు.   ఈ డిక్కీ ని బుడిగె , గుమ్మెట అని కూడా పిలుస్తారు . బుడిగెలు మామూలు గుమ్మెట్ల కంటే చిన్నవి. ఇవి ఇత్తడితోనో లేదా కంచు తోనో చేయబడి వుంటాయి.(membranophone category) బుర్ర కథలో వంత పాడే కళాకారుడు - డిక్కీ     తెలుగునాట జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళార...

UNESCO World Heritage Sites in India III - Cultural Sites

యు నెస్కో వారిచే వారసత్వ ప్రదేశాల గుర్తింపు పొందిన ప్రదేశాలు మన దేశంలో ఇప్పటివరకు 38 ఉన్నాయి. వీటిలో 30 ప్రదేశాలు సాంస్కృతిక ప్రదేశాలు ఏడు ప్రకృతి ప్రదేశాలు ఒకటి మిశ్రమ ప్రదేశం. ఈ జాబితాలో అత్యధిక ప్రదేశాలు ఉన్న దేశాలలో మన దేశం 6 వ స్థానంలో ఉన్నది. వాటిలో సాంస్కృతి కి చిహ్నంగా భాసిల్లే ఐదు ప్రదేశాలపై మన తపాలా శాఖ ఒక మినియేచర్ ను ఐదు తపాలా బిళ్లలతో ఆగష్టు 15, 2020న విడుదల చేసింది.  1. Sarkhej Roza - Historic City of Ahmedabad 2. Church of Bom Jesus - Churches & Convents of Goa 3. Group Monuments of Pattadakal 4. Javari Temple - Khajuraho Group of Monuments 5. Qutub Minar & Its Monuments, Delhi ఇంతకు ముందు ఇదే అంశంపై మన తపాలా శాఖ వారు UNESCO World Heritage Sites in India-1, పేరుతో యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై 29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను, రెండవ సారి ప్రముఖమైన నాలుగు ప్రకృతి ప్రదేశాలపై  UNESCO World Heritage Sites in India -2 పేరుతో   మరోక మినియేచర్ ను ఐదు తపాలా బిళ్లలతో మార్చి 16, 2020న విడుదల...

మొదటి ప్రపంచ యుద్ధం లో భారతీయులు

మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా 20 - 08- 2019 న మన తపాలా శాఖ నాలుగు మియేచర్స్ ను  15 తపాలా బిళ్లలను విడుదల చేసింది. ఈ భయంకర యుద్ధంలో మన దేశ సిపాయిలు ఎంతోమంది అసువులు బాసారు. వారికి నివాళిగా ఇవి విడుదల చేశారు.     వాయు సేన లో పోరాడిన యోధులు   వివిధ ప్రదేశాలలో ఉన్న మన వీరుల స్మారక కట్టడాలు    వివిధ ప్రదేశాలలో  జరిగిన యుద్ధ సన్నివేశాలు                                        

Indian Fashion through the Ages

భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ  మరొకసారి  సిరీస్ -2 పేరుతో 12-06-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  భారతీయ సంప్రదాయ  వస్త్ర ధారణ లో ఉన్న  వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి.  ఇంతకు ముందు భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ  31-12 -2018 న సిరీస్ -1 పేరుతో  4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. సింధు నాగరికతలో ఉన్న వస్త్ర ధారణ నుండి మధ్య యుగం వరకు వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. 
75th Anniversary of the  First Flag Hoisting at Port Blair నేతాజీ సుభాష్ చంద్ర బోస్ భారత స్వతంత్ర పోరాటంలో భాగంగా INA   ద్వారా మొదటిసారి మన జాతీయ పతాకం పోర్ట్ బ్లెయిర్ లో ఆవరిష్కరించిన సంఘటన జరిగి 75 ఏళ్ళు అయిన మన తపాలా శాఖ 30-12-2018 న మూడు తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  

UNESCO World Heritage Sites in India -1 రాజస్థాన్ లో కోటలు

యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై మన తపాలా శాఖ వారు  UNESCO World Heritage Sites in India- 1, పేరుతో   29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  దీనిపై  ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లో గల ఆరు చారిత్రాత్మక కోటలు - 1. కుంభాల్ ఘర్, 2. చిత్తోర్ ఘర్, 3. జైసల్మేర్ , 4. గగ్రోన్, 5.రతంబోర్, 6. అజ్మీర్ హిల్ ఫోర్ట్  లు చోటుచేసుకున్నాయి. 
మహాత్మా గాంధీజీ జీవితాన్ని మలుపుతిప్పిన  దక్షిణ ఆఫ్రికా లో పీటర్ మార్టిన్ బర్గ్ రైల్ సంఘటన జరిగి 125 సంవత్సరాలు  మరియు నల్ల సూరీడు నెల్సన్ మండేలా శత జయంతిని పురస్కరించుకొని భారత్ - దక్షిణ ఆఫ్రికా దేశాలు సంయుక్తంగా  26-7-2018 న  ఒక ప్రత్యేక మినియేచర్ను విడుదల చేశారు.

విసన కఱ్ఱల పై తపాలా బిళ్ళలు

A set of 16 stamps on Indian Hand Fans was released by India Post on 30th December  2017 మన దేశంలో ప్రాచీన కాలంలో వివిధ ప్రాంతాలలో వాడిన అందమైన విసన కఱ్ఱల పై  మన తపాలా శాఖ 30-12-2017 న 16 రకాల తపాలా బిళ్ళలు  (16x15 =240 ) విడుదల చేసింది. 

దిగుడు బావుల పై తపాలా బిళ్ళలు

A set of 16 stamps on Step wells was released by India Post on 30th December  2017 మన దేశంలో ప్రాచీన కాలంలో వివిధ ప్రాంతాలలో నిర్మించిన అత్యంత సుందరమైన దిగుడు బావుల పై మన తపాలా శాఖ 30-12-2017 న 16 రకాల తపాలా బిళ్ళలు  (8x 5 , 8x15 ) విడుదల చేసింది.  Stepwells - 1.Chand Baori, Abhaneri; 2. Raniji Ki Baori, Bundi; 3. Toor Ki Jhalra, Jodhpur; 4. Panna Mian Ki Baori, Jaipur; 5. Nagar Sagar Kund, Bundi; 6. Neemrana Stepwell, Alwar; 7. Pushkarini Stepwell, Hampi;8.  Muskin Bhanvi Stepwell, Lakkundi; 9. Adalaj Stepwell, Adalaj; 10. Surya

ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం పై తపాలా బిళ్ళలు

మన భారత తపాలా శాఖ 1-11-2017 న ఆదికవిగా కీర్తించబడిన నన్నయ్య మరియు   ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం   పైన తపాలా బిళ్ళలు విడుదల చేశారు. ఇదే సందర్భంగా కన్నడ కవి ముద్దన పై కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు . ఈ మూడు తపాలా బిళ్ళలు ఒకే తపాలా కవరు పై కర్ణాటక రాష్ట్ర ఆతరణ దినోత్సవం నవంబర్ ఒకటో తేదీన (మన పూర్వ ఆంద్ర ప్రదేశ్ అవతరణ  దినోత్సవం  కూడా అదే) బెంగళూరులో విడుదల చేశారు. కవి ముద్దన, ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం   ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం చారిత్రిక ప్రసిద్ధి చెందిఉంది. ఇక్కడ ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక...

మహాత్మా గాంధీజీ చంపారన్ సత్యాగ్రహమ్

India post released a set of three stamps and one miniature on Champaran sathyagraha centenary on 13th may 2017  మహాత్మా గాంధీజీ నీలి పంట రైతులకొరకు చేసిన చంపారన్ సత్యాగ్రహమ్ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన తపాలా వారు మూడు ప్రత్యేక తపాలా బిళ్ళలు , మినియేచర్ ను 13-05-2017 న విడుదల చేసారు. 

ప్రయాణ సాధనాలు

A set of 20 stamps  was released by India Post on 25th March 2017 on Means of Transport Through the Ages. మన తపాలా శాఖ వారు 25-93-2917 న కాల గతిన మనం వాడిన ప్రయాణ సాధనాల పై ఒకేసారి 20 ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేసారు. మీనా / పల్లకి ల పై నాలుగు , ఎడ్ల బండి , గుర్రపు బండ్ల పై నాలుగు, రిక్షాలపై నాలుగు, కార్లపై నాలుగు, రైలు ,బస్సులపై  నాలుగు  మొత్తం 20 తపాలా బిళ్ళలు, 6 రకాల మినియేచర్లు, 5రకాల షీట్ లెట్స్ ను విడుదల చేసారు. వీటి ధర 275 రూపాయలు Means of Transport Through the Ages.

సామ్రాట్ విక్రమాదిత్య

మన తపాలా శాఖ 22-12-2016 న సామ్రాట్ విక్రమాదిత్య పై ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఉజ్జయిని రాజధానిగా ప్రజలను జనరంజకంగా పాలించిన విక్రమాదిత్యుని కొలువులో భట్టి అనే మంత్రి ఉండేవాడని , వారు ఇద్దరు దేశ సంచారం చేసి రకరకాల సమస్యలను నివృత్తి చేశారనే కధలు "భట్టి విక్రమార్క కథలు" ( భేతాళ కథలు) పేరుతో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. అలాగే గుణాఢ్యని కథాసరిత్సాగరం  లోను, బృహత్కథామంజరి లోను విక్రమాదిత్యుని గురించి గొప్పగా చెప్పబడినది .  క్రీస్తు పుట్టకముందు 57 ఏళ్ళనుండి మన దేశంలో కొన్ని ప్రాంతాలలో వీరి పేరుతో 'విక్రమ శకం' పేరుతో కాలమానం ఉంది.  చరిత్రకు అందని ఈ సామ్రాట్ విక్రమాదిత్య పై తపాల బిళ్ళను విడుదల చేయటం ముదావహం.  Samrat Vikramadittya 

తపాల బిళ్ళ పై సామ్రాట్ అశోకుడు

India Post released a commemorative stamp on Samrat Ashok on 24 August 2015 మన తపాల శాఖ 24-08-2015 న  సామ్రాట్ అశోకుడు పై ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.  అశోకుడు క్రీ.పూ.273 నుండి క్రీ.పూ.232 వరకు మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది. మన జాతీయ చిహ్నం సారానాద్ లోని అశోక స్తంబం నుండి స్వీకరించబదినది. అలాగే మన జాతీయ జండాలో అశోకుని ధర్మచక్రం ఉంచబడినది.   

ఆంధ్రుల రాజధాని అమరావతి

ఎప్పుడో  2000 ఏళ్ల క్రితమే    ఆంధ్రుల రాజధాని గా    విలసిల్లిన  ధాన్యకటకం ( ధరణికోట) ఆ  తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది.  ఈ పట్టణం పేరు  తిరిగి స్పురించేలా  నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం. Amaravathi  Sculpture  India Post Issued a Commemorative postage stamp on  19 - 06 - 2003  on Amaravathi Sculpture preserved  at Govt. Museum -Chennai Govt. Museum -Chennai ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకురాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలతకలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధునిజీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడినచైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దము...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

Centenary Celebrations of First Andhra Conference

On the occation of the centenary celebrations of First Andhra Conference (`Pradhama Andhra Mahasabha’) India Post released a Special Postal cover  on 24-5-2013 at the historic Town Hall ,at Bapatla, Andhra Pradesh.  Union Minister of State for Petroleum and Natural Gas Panabaka Lakshmi inaugurated the event by hoisting a flag and released a Special Postal Cover   marking the historic event. ప్రధమాంధ్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు 1913 లో బాపట్ల లో 'ఆంద్ర  మహాసభ' తొలి సమావేశం జరిగింది. దానిని పురస్కరించుకొని ప్రధమాంద్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు బాపట్ల లోజరిగిన సందర్బం గా మే 24 , 2013 న మన తపాలా శాఖ(విజయవాడ) ఒక ప్రత్యక తపాలా కవర్ ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక కవర్ పై ప్రధమాంద్ర మహాసభ లోగోను దానిపై  క్యాన్సిలేషన్ కొరకు ఆంధ్ర మహాసభ జరిగిన బాపట్ల టౌన్ హాల్ చిత్రం తో ప్రత్యక తపాలా ముద్ర ను రూపొందించారు ప్రత్యేక తపాల కవర్ విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి  తదితరులు  బాపట్ల-టౌన్ హాల్  తెలుగు వారిక...

కాకతీయులకు గుర్తింపు ఏది?

శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.  తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు.   కాకతీయ సామ్రాజ్యము( 1083-1326 )వెల్లివిరిసిన  కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి.   కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత రాణి రుద్రమ దేవి. కాకతీయ సామ్రాజ్యం 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో రెండవ ప్రతాప రుద్రుని మరణంతో పతనమయ్యింది. ఆ తరువాత కాకతీయుల సేనానులు  ముసునూరు నాయకులు 1326 లో తిరిగి తురుష్కులను పారదోలి 1370 వరకు ఓరుగల్లును పాలించారు. ముసునూరి కాపయ నాయకుని మరణంతో  వైభవాన్ని కోల్పోయి ఈ ప్రాంతం ముస్లిం పాలకుల చేతికి వచ్చింది. తరువాత  బహుమనీ సుల్తానులు ,  గోల్కొండ  సుల్తానులు, మొఘలు పరిపాలకులు,  నిజాం  సుల్తానులు ఏలుబడిలోకి వచ్చి పోలిస్ ...

గుంటూరు జిల్లా చరిత్ర

India post Issued a Special Cover in  Centenary celebrations of  Guntur  District Formation on 1- 10 -2004. Guntur  district Formation Centenary  గుంటూరు జిల్లా అవతరణ జరిగి 100 వసంతాలు (1904 లో కృష్ణ జిల్లా నుండి విభజించబడినది) నిండిన సందర్బం గా  శతాబ్ది ఉత్సవాలు జరిపినప్పుడు మన తపాలా శాఖ 1-10-2004 న  ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు. దానిపై గుంటూరు జిల్లా కు ప్రాశస్తాన్ని కలిగించిన చారిత్రిక చిహ్నాలను ముద్రించారు.   ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధస్థూపంగల  అమరావతి , అనంతపద్మనాభస్వామి కి అంకితమివ్వబడిన గుహలు గల  ఉండవల్లి గుహలు, కొండవీటి కోట,నాగార్జున సాగర్ ఆనకట్ట ,ఎత్తిపోతల జలపాతం,ఉప్పలపాడు పక్షుల వలస కేంద్రం ,శాతవాహన చక్రవర్తి వాసిష్టి పుత్ర శ్రీ పులుమావి వినియోగించిన నాణేలు దీనిపై ఉన్నాయి. గుంటూరు పేరుతో ఖ్యతి చెందిన  గోంగూర, మిరపకాయ,పొగాకు పంటలను సూచిస్తూ  వాటి ఆకులు దీనిపై చూడవచ్చు. ఈ కవరు పై ఉపయోగించుటకు   ఈ జిల్లా స్వరూపాన్ని చూపే మ్యాపు తో ప్రత్యేక తపాలా ముద్ర ...