First Day Cover on Dr. Guduru Venkatachalam
వ్యసాయ శాస్త్రవేత్త ,స్వతంత్ర సమరయోదుడు,పద్మశ్రీ గూడూరు వెంకటాచలం(1909-1967) గారి గౌరవార్దం 08-05-2010 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.గూడూరు వెంకటాచలంగారు 1909 లో కృష్ణ జిల్లా గుడివాడలో జన్మిచారు.విద్యార్ది దశలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని 14 నెలలు వెల్లూరు జైల్లో నిర్భంధించ బడ్డారు. ఆ తరువాత వ్యవసాయ రంగంలో విశేషమైన పరిశోధనలు చేసి ఎన్నో క్రొత్త వరి వంగడాలను వృద్ది చేసారు. వరి సాగు పై అనేక పుస్తకాలు, పరిశోధనా వ్యాసాలు వ్రాసారు.బియ్యం మన ప్రధాన ఆహారం గా ఉన్నంత కాలం మన గూడూరు వెంకటాచలం గారు గుర్తుండిపోతారు.వీరి సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం 1967 లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.
పద్మశ్రీ డా.జి.వి. చలం గారిపై రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం, హైదరాబాదు వారు ఒక ప్రత్యేక కవరును 30-11-2009 న విడుదల చేసారు.
Comments