Skip to main content

Posts

Showing posts with the label కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

జాతీయ ఐక్యతా దినం - సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం

జాతీయ ఐక్యతాదినంగా సర్దార్ వల్లభాయ్ పటేల్  జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా  31-10-2016 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేసింది.  చీలికలు పీలికలు గా ఉన్న భారత దేశానికి ఒక సమగ్రతను సమకూర్చి  ఉక్కు మనిషిగా పేరొందిన పటేల్ గారి  జయంతిని (అక్టోబర్ 31) నేడు దేశ సమగ్రతా దినం గా జరుపుకుంటున్నాం.  సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ మొదటి ఉప ప్రధాని, గృహ మంత్రి గా 560 పైగా ఉన్న సంస్థానాలను భారత్ లో విలీనంలో కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం మన తపాలా శాఖ ఇప్పటివరకు విడుదల చేసిన తపాలా బిళ్ళలు.  Vallabhai Patel ( 31 October 1965 ) - 90th Birth Anniversary 31 October 1975-  Vallabhai Patel  - Birth Centenary 15 December 1997- Sardar Vallab Bhai Patel 27 November 2008 -Sardar Vallabhbhai Patel National Police Academy Hyderabad DEFINITIVE STAMP - ISSUED ON 23 JAN 2001 DEFINITIVE STAMP - ISSUED ON  19 -05- 2016

పట్టాభి సీతారామయ్య

India Post realesed a Commemorative postage stamp on  Dr. PATTABHI SITARAMAYYA 17 -12-1997 Dr. PATTABHI SITARAMAYYA డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880 - 1957)  ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ కు 1948 లో అధ్యక్షుని గా పనిచేసిన గాన్దేయ వాది. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు. భారత జాతీయోద్యమ సమయంలో ఉద్యమంలో చేరి మహాత్మాగాంధి అనుచరుడిగా కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు.  1939 లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అద్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ, 1948 లో తిరిగి కాంగ్రెస్ అద్యక్షులుగా గెలుపొందారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్య ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. తెలుగు భాషాబిమాని గా తాను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు.  తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను చేసారు.వీరి గౌరవార్దం 17-12-1997 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. Dr.Pattabhi Sitharamayyah- First day cover

మోతీలాల్ నెహ్రూ

India Post released a stamp of  Motilal Nehru  on 25th September 2012 to celebrate his 150th Birth Anniversary . మోతీలాల్ నెహ్రూ  జననం  మే 6 ,  1861  – మరణం  ఫిబ్రవరి 6 ,  1931 . భారతీయ స్వాతంత్ర సమర యోధుడు మరియు  భారత జాతీయ కాంగ్రెస్  నాయకుడు. మన తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు తండ్రి. రెండు సార్లు జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా పనిచేసిన యోధుడు. మన తపాలా శాఖా వారి 150 వ జయంతి సందర్బం గా ఒక తపాల బిళ్ళను 25-09-12 న విడుదల చేసింది.  ఇంతకు మునుపు వారి శత జయంతికి కుడా ఒక ప్రత్యేక తపాల బిళ్ళను మే 6, 1961 న విడుదల చేసింది. ఇప్పటి వరకు జాతి పిత గాంధిజీ తరువాత ఎక్కువ తపాలా బిళ్ళలు విడుదల చేసింది నెహ్రు కుటుంబ సభ్యులకు మాత్రమే. Pandit Motilal Nehru (1861-1931) - Birth Centenary Date of Issue : 6 May 1961

నేతాజీ సుభాష్ చంద్రబోస్

NETAJI ON DEFINITIVE STAMP iSSUED ON 23 JAN 2001 నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జననం జనవరి 23, 1897 , మరణం: తెలియదు) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన సుభాష్ చంద్ర బోసు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు.  మహాత్మా గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, తెల్లవాళ్ళ పై పోరాటం ద్వారానే మనకు స్వతంత్రం వస్తుందని తలంచి, రెండవ ప్రపంచ యుద్ధం లో జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం(I.N.A) ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అక్ష రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ, క్రొయేషియా,థాయ్‌లాండ్, బర్మా , ఫిలిప్ఫీన్స్లాంటి దేశాలు కూడా ఆమోదించాయి.  నేతాజీ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమ...

పండిట్ మదన మోహనమాలవ్య

India Post issued a commemorate stamp on the occasion of 150th Birth Anniversary of Pt . Madan Mohan Malaviya on 27 December 2011   Madan Mohan Malaviya (1861–1946) was an Indian educationist, and freedom fighter. He was the president of the Indian National Congress in 1909, 1918, 1930 and 1932. He later founded Banaras Hindu University, commonly known as BHU, a prominent institution of learning in India today. Malviya Ji popularised the slogan Satyameva Jayate (Truth alone will triumph) Malaviya - Birth Centenary  Date of Issue - 25 December 1961 Benaras Hindu University - 75th Anniversary Madan Mohan Malaviya and B.H. University  Date of Issue : 21 January 1991

కాసు బ్రహ్మానందరెడ్డి

First Day Cover -K. Bramhananda Reddy India Post released a commemorative postal stamp on KASU BRAHMANANDA REDDY on 28th July 2011. కాసు బ్రహ్మానందరెడ్డి 102 వ జయంతి సందర్బం గా మన తపాలా శాఖ 28- 7- 2011 న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.   KASU BRAHMANANDA REDDY శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పురపాలక శాఖ మంత్రిగా  వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు.  1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు...

సరోజిని నాయుడు

SAROJINI NAIDU Date of issue: 13-02-1964 సరోజినీ నాయుడు ( ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల ( నైటింగేల్ ఆఫ్ ఇండియా ) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి . భారత జాతీయ కాంగ్రేసు తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు గా ప్రసిద్ది చెందారు . దండి సత్యాగ్రాం లోను , రౌండ్ టేబుల్ సమావేశం లోను మహాత్మా గాంధీ గారి తోపాటు పాల్గొంది . సరోజినీ దేవి హైదరాబాదులో ఒక బెంగాలీ కుటుంబములో జన్మించినది . ఈమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ స్థాపకుడు , శాస్త్రవేత్త మరియు తత్వవేత్త . తల్లి బరదా సుందరి దేవి ఒక కవయిత్రి . ఈమె దక్షిణాదికి చెందిన డా. ముత్యాల గోవిందరాజులు నాయుడు ను ప్రేమించి , చదువు పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో వివాహము చేసుకున్నది. కులాంతర వివాహములకు సమాజము చాలా వ్యతిరేకముగా ఉన్న ఆ రోజుల్లో వీరి వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించాడు . సరోజినీ దేవి ఉర్దూ , తెలుగు , ఆంగ్లము , పర్షియన్ మరియు బెంగాలీ భాషలు మాట్లాడేది .ఆమె ...

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

India Post relased a set of four Commemorative postage stamps on CENTENARY OF THE INDIAN NATIONAL CONGRESS  on 28-12-1985, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వంద వసంతాలు నిండిన సందర్భంగా 1985 లో నాలుగు (se-tenant) స్టాంప్స్ విడుదల చేసారు.  నూరు సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఆ పార్టీ కి అద్యక్షత వహించిన మన తెలుగు ప్రముఖుల చిత్రాలు వీటిలో ఉన్నాయి. 1.పి .ఆనందాచార్యులు . (1843-1908) : 1891 లో అధ్యక్షులు (పైన ఎడమ ప్రక్క మొదటి స్టాంపులో -మూడో వరుస,మూడో బొమ్మ)  2. భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880-1959): 1948,49 లో అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో - మొదటి వరస ,మూడోది)  3.నీలం సంజీవరెడ్డి (1913-1996) 1960-63 లో అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో- రెండవ వరస,మూడోది ) 4. దామోదరం సంజీవయ్య (1921-9171);  1962-64,1971-72 లలో రెండు సార్లు అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో- రెండవ వరస,నాలుగోది)  5. కాసు బ్ర హ్మా నంద రెడ్డి (1914-1994): 1978-79 లో అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో - చివరి వరుసలో మూడోది) ...