Skip to main content

Posts

Showing posts with the label కళాకారులు

Puppets of India

తోలు బొమ్మలాట పై విడుదలైన మినియేచర్  మన భారత తపాలాశాఖ 13-02-2026 న మన దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన ఆట బొమ్మలు/కీలు బొమ్మలకు సంబంధించిన ఎనిమిది రకాల తపాలా బిళ్లలను, వాటికి సంబంధించిన నాలుగు మినియేచర్లతో పాటు ఒక షీట్ద లెట్ల ను విడుదల చేసింది. వీటిలో మన తెలుగు నాట ప్రసిద్ధి చెందిన ప్రాచీన కళ అయిన తోలు బొమ్మలాట కు స్థానం లభించింది.  Puppets of India - sheetlet

పద్మ విభూషణ అక్కినేని నాగేశ్వరరావు - MY Stamp IIFF

commemorative stamps honouring  Raj Kapoor, Mohammed Rafi, Akkineni Nageswara Rao, and  Tapan Sinha  for their significant contributions to Indian cinema at the 55th International Film Festival of India in Goa on November 20, 2024 గోవా లో జరిగిన ఇంటెర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IIFF) లో మన భారతీయ సినీ ప్రముఖుల శత జయంతులు జరుగుతున్న వేళ వారి  గౌరవార్థం ఒక ప్రత్యేక మై స్టాంప్ ను నవంబరు 20, 2024న విడుదల చేసారు. దీనిలో    ప్రముఖ  హిందీ చలన చిత్ర నటులు రాజ్ కపూర్. గాయకుడు మహ్మద్ రఫీ, తెలుగు వెండి తెర వెలుగు  అక్కినేని నాగేశ్వరరావు, కథా రచయిత తపన్ సిన్హా లకు చోటు కల్పించారు.  

పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు

పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు- ANR  తపాలా బిళ్ళపై  అక్కినేని  మన భారత తపాలా శాఖ వారు 19-09-2024న పద్మ విభూషణ్ మరియు దాదాసాయెబ్ అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ళపై ముద్రించిన అక్కినేని ఛాయా చిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు, సినిమా దర్శకుడు బాపు గారు రూపొందించారు. ఇది అక్కినేని ఇష్టమైన చిత్రం. First Day Cover - Dr. Akkineni Nageswararao తెలుగు ప్రఖ్యాత తెలుగు  చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారు. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొ...

పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు

మన తపాలా శాఖ 19-09-2018 న పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు(ANR) 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసారు.  తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన అక్కినేని 256 సినిమాలలో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను చేరుకున్న నట సామ్రాట్. దేశంలో రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు దాదా సాయబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న అందాల నటుడు.  Special cover on Akkineni Nageswararao 

తపాలా కవరు పై పద్మ విభూషణ్ డా. అక్కినేని

తెలుగు చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారి 95వ జన్మదినం సందర్భంగా మన తపాలా విభాగం ఒక ప్రత్యేక తపాలా కవరును 19-09-2018 న హైదరాబాద్ లో విడుదల చేసింది. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొప్పదని భావించిన తత్వజీవి అక్కినేని.  SPECIAL COVER ON Dr. A.N.R. 

కూచిపూడి నృత్యం

The Sangeet Natak Akademi currently confers classical status on six Indian classical dance styles: namely Bharatanatyam(TamilNadu), Kathak (North India), Kathakali (Kerala), Kuchipudi (Andhra Pradesh), Manipuri (Manipur), Odissi(Odisha), India Post Issued a set of six stamps on these Indian classical Dances on  20-10-1975   KUCHIPUDI - DANCE మన భారతీయ సాంప్రదాయ నృత్య రీతులను సుప్రసిద్ధం చేయటానికి తపాల శాఖవారు 20-10-1975 న ఆరు తపాల బిళ్ళలనువిడుదల చేసారు. వాటిలో మన తెలుగు వారి సాంప్రదాయపు కూచిపూడి నాట్యానికి  కుడాచోటు  లభించింది.    ప్రమంచవ్యాప్తంగా తెలుగు వారికి కాళాజగత్తు లో ఒక గుర్తింపు తెచ్చిన నృత్యం కూచిపూడి నృత్యం.  భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది.ఇది నవ్య ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. భరతనాట్యం తో కొంత సారూప్యం కలిగిన కూచిపూడి నృత్యం తనదైన ప్రత్యేక శైలి కలిగి ఉంటుంది. దీని రూపకర్త 15 వ శాతబ్దికి చెందిన సిద్దేంద్ర యోగి.  మన కూచిపూడి నాట్...

అక్కినేని కి అమెరికా లో వ్యక్తి గత తపాల బిళ్ళ

అక్కినేని నాగేశ్వరరావు  అమెరికా లో  అక్కినేని నాగేశ్వరరావు గారి  అబిమానులు(AFA) వారికి నివాళిగా20-9-2014 న  ఒక వ్యక్తి గత తపాల బిళ్ళను usps చే విడుదల చేపించారు . దీనికి ఎటువంటి అధికారిక గుర్తింపు ఉండదు . ఇలాంటి వాటిని USPS కు డబ్బు చెల్లించి ఎవరిదైన వ్యక్తిగత చిత్రాన్ని తపాల బిళ్ళ పై  ముద్రించు కోవచ్చు.  ఇప్పటివరకు అమెరికా తపాల శాఖ వారు మన దేశానికి సంబందించి మహాత్మా గాంధీ గారికి , మదర్ తెరెసా కు మాత్రమే అధికారక తపాల బిళ్ళలు విడుదల చేసి వారిని గౌరవించారు.   మన దేశం లో కుడా Rs 300 /- తో మై స్టాంప్  పధకం లో ఇలాంటి  వ్యక్తి గత  తపాల బిళ్ళలు   పొందవచ్చు .  AFA వారు దీనికి ఇంత ఎత్తున ప్రచారం చేయాలా? దీనికంటే హైదరాబాద్ GPO లో అక్కినేని జయంతి న ఒక స్మారక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసిన బాగుండేది.  మన తెలుగు సినిమా నటులలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ,సావిత్రి SVరంగారావు,భానుమతి, అల్లు రామలింగయ్య   గార్లకు, చలనచిత్ర  దర్శకులలో  దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొ...

షేక్ నాజర్ కు, గుఱ్ఱం జాషువా గార్లకు ఒక ప్రత్యేక తపాలా కవరు

India Post a Special Postal Cover issued On SHAIK NAZAR (BURRA KATHA) AND GURRAM JASHUVA (WRITER)  on 5 -9- 2014  Special cover on SHAIK NAZAR , GURRAM JASHUVA  GNPS - (Guntur Numismatic and Philatelic Society) ద్విదశాబ్ది వార్షికోత్సవం సందర్బం గా 5-09-2014 న గుంటూరులో ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ కు, ప్రఖ్యాత కవి గుఱ్ఱం జాషువా గార్లకు కలిపి ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు, దీనిపై తపాల ముద్రగా నాజర్ బుర్ర కథ లో వాడే 'తంబూర' , జాషువా రచన 'గబ్బిలం ' పుస్తకం ఉన్నాయి. షేక్ నాజర్ (1920-1997) బుర్రకథా పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకుల ముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు, 1997 ఫిబ్రవరి 22న అంగలూరులో మరణించారు. గుంటూరుకు ఎన్‌టిఆర్ వచ్చినప్పుడు నేను మీ అభిమానిని అని నాజర్ చెపితే ‘నేను మీ ఫాన్‌ను’ అని ఎన్‌టిఆర్ చెప్పి అందరినీ ఆనందపరిచారు.ప్రజా కళాకారుడుగా,అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మ...

తపాల బిళ్ళల పై S. V. రంగారావు , భానుమతి, అల్లు రామలింగయ్య

వందేళ్ళ సినిమా కి వందనం  మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు .  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు  S. V. రంగారావు ,  భానుమతి,  అల్లు రామలింగయ్య   ఎస్వీ రంగారావు (1918-1974) సామర్ల వెంకట రంగారావు   - SVR గా తెలుగు చిత్ర సీమలో పేరొందిన   నటుడు.  మూడు దశాబ్దాలపాటు మూడొందల పైగా సాంఘిక పౌరాణిక సినిమాలలో  అద్భుతంగా నటించిన సహజ నటుడు.   ఘటోత్కచుడిగా ,  కీచకుడిగా ,  రావణాసురుడిగా  తనకు తానే సాటిగా ప్రేక్షకుల మన్నలను గడించాడు. ...

M.F.Husain Paintings

Maqbool Fida Husain (17 Sept.1915 – 9 June 2011) commonly known as MF, was an eminent Indian painter. According to  Forbes  magazine, he has been regarded as the "Picasso of India"  He has been awarded the Padma Bhushanin 1973 and was nominated to the Rajya Sabha in 1986. He was awarded the Padma Vibhushan in 1991.S ome of Husain's works became controversial because of their portrayal of Hindu deities in the nude.  After legal cases and death threats, he was on a self imposed exile from 2006. In January 2010, he was offered the citizenship of  Qatar , which he accepted. He died in London in June 2011. India Post Used Some of M.F.Husain Paintings on postal Stamp s Bal Gangadhar Tilak's proclamation " Swaraj is my Birthright" Issued in 1988 on Freedom Forty Swaraj                                         ...

విశ్వకవి రవీంద్ర నాద టాగూర్

  Uruguay post released a stamp to mark 150 years of the birth of Indian poet Rabindranath Tagore . The stamp, issued also to commemorate the INDIPEX 2011 in New Delhi, illustrates the portrait of Rabindranath Tagore, the flags of Uruguay and India and the logo of INDIPEX 2011.

kuchipudi dancers set world record

Over 2800 Kuchipudi dancers created a Guinness Book of World record on 26-12-2010 by performing Hindolam Thillana at Hyderabad. The 11- minute programme was staged as part of the three day 2nd International Kuchipudi Dance convention. Rapturous applause  filled the venue as programme  came to end and a representative of Guinness Book of World Records annouced that she was speechless with the magnitude of the programme.  A commemorative postal stamp on Kuchipudi Dance  Issued by India post on 20-10-1975 Dance spectacle

రవీంద్ర నాద టాగూర్ పై వెండి నాణెం

RABINDRANATH TAGORE   150 BIRTH ANNIVERSARY Commemorative coins     గురు దేవ్ శ్రీ రవీంద్ర నాద టాగూర్ 150 వ జయంతి సందర్బంగా మన ప్రభుత్వం వారు మొదటి సారిగా 150 రూపాయల వెండి నాణెం మరియు  ఐదు రూపాయల నాణెం విడుదల చేస్తున్నారు.ఇంతకు ముందు మన తపాల శాఖ వారు రాబింద్రనాథ్టాగూర్  గారిపై నాలుగు తపాల బిళ్ళలు విడుదల చేసారు.  Date of Issue: 1 October 1952 Date of Issue: 7-05-1961 VISVA BHARATI GOLDEN JUBILEE Date of Issue:24-12-1971  Date of Issue:7-5-1987 Modern Indian Paintings- "Head" -By Rabindranath Tagore Date of Issue: 23  March 1978 Rabindranath tagore's playlet 'Dakgahr'(post office) Date of Issue: 13-10-2008 World Tributes to Tagore U.S.S.R COMORIEN BANGLADESH - 1991 Issue Date:  07-08-1991 , Denomination:   4 Taka

ఎల్.వి.ప్రసాద్

A Commemorative postage stamp on 5- 9 - 2006 L.V.PRASAD ఎల్.వి.ప్రసాద్ (1908 -1994) గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత . ఈయన జనవరి 17 , 1908 న ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. హిందీ , తమిళ , తెలుగు , కన్నడ పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా , కాళిదాస్ భక్త ప్రహ్లాద మూడింటిలోనూ నటించిన ఘనత శ్రీ ఎల్ . వి గారిదే . ఎల్వీ ప్రసాదు స్మారకార్థం భారత తపాల శాఖ 2006 సెప్టెంబర్ 5 న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

బళ్ళారి రాఘవ

A Commemorative postage stamp on 31-10-1981 BELLARY RAGHAVA బళ్ళారి రాఘవాచార్లు ( 1880 -1946 ) లో అంతపురం జిల్లా తాడిపత్రి లో జన్మించాడు. వారు న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో, ప్రసిద్ధి చెందాడు. వారి ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. " రావు బహద్దూర్ " అన్న బిరుదు కూడా ఇచ్చింది.కానీ ఆయనకు నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభ ఉన్నాయి. బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకొనేవారు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం ధారాళంగా వెచ్చించాడు. హావభావ ప్రకటనలోను, డైలాగులు చెప్పడంలోను రాఘవ అసమానుడనిపించుకొన్నాడు. విదూషక పాత్ర అయినా, మహారాజు పాత్రయినా రాఘవ అవలీలగా పోషించేవాడు. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలన్నింటిలోనూ రాఘవ ప్రదర్శనలిచ్చాడు.హరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, బృహన్నల, రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు - ఇవి ఆయనకు బాగా పేరు తెచ్చిన నాటకాలు. బళ్ళారి రాఘవ శ్రీలంక , ఇంగ్లాండ్ , ఫ్రాన్సు , జర్మని వంటి దేశాలు పర...