ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాలా బిళ్ళల ప్రదర్శన విజయవాడలో మూడు రోజుల పాటు 2014 జూలై 24,25,26 తేదిలలో జరిగిన తపాలా బిళ్ళల ప్రద్రర్శన (APPEX -2014) లో మన తెలుగు వారి విశిష్టతను చాటేలా 'తెలుగు వెలుగులు ' పేరుతో తెనాలి కి చెందిన శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ సేకరించి ప్రదర్శించిన తపాలా బిళ్ళలు అత్య అద్బుతమైన ప్రదర్శన గా పలువురి మన్ననలు అందుకుంది. తెలుగు లిపి తో ఉన్నఏకైక ప్రదర్శన కుడా ఇదే. ఈ ప్ర దర్శన కు సాయి కృష్ణ కు వెండి -రజిత (SILVER- BRONGE ) పతకం బహుమతిగా వచ్చింది. కేసినేని నాని నుండి తెలుగు వెలుగులు కి బహుమతి ని స్వీకరిస్తున్న వి. సాయి కృష్ణ తెలుగు వారు గర్వపడేలా ఉన్న ఈ తపాలా బిళ్ళ పై తెలుగు వెలుగులు ప్రదర్శన లో కొంత భాగాన్ని మీరు ఇక్కడ చూడగలరు.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.