గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక ప్రముఖ నివాస ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.
శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992) గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు.
కల్లూరి చంద్రమౌళి గారు 1898 నవంబరు 15న గుంటూరు జిల్లా అమృతలూరు మండలములోని మోపర్రు గ్రామములో జన్మించారు. తల్లిదండ్రులు వెంకమాంబ, సుదర్శనం. 1920లో ఇంగ్లాండు వెళ్ళి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. స్కాట్లాండు విశ్వవిద్యాలయము నుండి విద్యనభ్యసించిన చంద్రమౌళి భారతదేశానికి తిరిగివచ్చి వ్యవసాయభివృద్ధికై కృషిచేశాడు. కాంగ్రేస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడైనాడు. బాల్యము నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఇష్టం. 1926లో ఉద్యోగాన్ని నిరాకరించి మహాత్మా గాంధీ నాయకత్వంలో అన్ని జాతీయోద్యమాలల్లో పాల్గొని అనేకసార్లు జైలు కెళ్ళారు.
1937, 1946, 1955 , 1962లలో శాసనసభకు ఎన్నికై నారు. మద్రాసు ప్రావిన్సులో రామస్వామి రెడ్డియార్, కుమారస్వామి రాజ మంత్రి వర్గంలోనూ ,మద్రాసు నుండి విడిపోయిన తరువాత ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం లో బెజవాడ గోపాలా రెడ్డి మంత్రి వర్గం లోను, ఆతరువాత ఆంధ్ర ప్రదేశ్ లో సంజీవయ్య గారి మంత్రి వర్గం లో మంత్రిగా పనిచేశారు. భారతరాజ్యాంగ సభ సభ్యులు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. శ్రీశైలం, భద్రాచలం దేవాలయాల జీర్ణోద్ధరణ గావించారు. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి చంద్రమౌళి గారు అపర రామదాసుగా కీర్తిగాంచారు.
తిరుపతిలో విశ్వ సంస్కృతసదస్సు నిర్వహించారు. మంచి గ్రంధ రచియిత. ఆర్ష విద్యాలంకార అనే బిరుదాంకితుడు.రామాయణసుధాలహరి, రామకధానిధి, సీతామహాసాధ్వి, వివేకానందస్వామి, యుగసమీక్ష, ఆండాళ్ వైభవం, వేదసుధాకరం, ఆర్షసంస్కృతి, భాగవతసుధ మున్నగు పుస్తకాలు రచించారు
1992 జనవరి 21న చంద్రమౌళి తన స్వ గ్రామం మోపర్రులో పరమపదించారు.
Comments