Skip to main content

తపాలా బిళ్లల పై మహాభారతం- విశ్వరూప దర్శనం

పంచమ వేదం గా ప్రసిద్ధి చెందిన భారతీయ ఇతిహాస కావ్యం "మహాభారతం " పై మన తపాలా శాఖ 18 తపాలా బిళ్లలను రెండు మినియేచర్ షీట్స్ ను 27-11-2017 న విడుదల చేసింది. వీటిలో  12 తపాలా బిళ్ళలు 15 రూపాయలు , 4 తపాలా బిళ్ళలు 25 రూపాయలు, ఒకటి 50 రూపాయలు, మరొకటి 100 రూపాయలు విలువ కలవి.  వీటిలో 50,100 రూపాయల బిళ్లలతో మినియేచర్స్ గా కూడా ముద్రించారు. 
ఈ తపాలా బిల్లలపై మహా భారత గ్రంధ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో వివిధ కాలాల్లో రూపుదిద్దుకున్న చిత్రాలకు స్థానమిచ్చారు. వాటిలో మన ఆంధ్ర ప్రాంతంలో కలంకారీ చిత్రకళ ఒకటి. దీన్ని ప్రతిపాదికగా చేసుకొని 50 రూపాయల తపాలా బిళ్ళ మరియు మినియేచర్ ను రూపొందించారు. అలాగే ఆంద్ర- కర్ణాటక ప్రాంతాలలో మహాభారతాన్నిజానపద కళా పక్రియ అయినా తోలు బొమ్మలాట గా ప్రదర్శిస్తారు. తోలు బొమ్మలాటలో "ద్రౌపది" బొమ్మతో మరొక 15 రూపాయల తపాలా బిళ్ళ ను కూడా విడుదల చేశారు. 
కలంకారీ వస్త్రంపై  మహాభారతం- కురుక్షేత్రం

తోలుబొమ్మలాటలో - ద్రౌపది 

మహాభారతం- విశ్వరూప దర్శనం 


మహాభారతం- 18 పర్వాలు ముఖ్య ఘట్టాలు 

Comments