ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా మన తపాలా శాఖ ద్వారా కమ్మని నోరూరించే మన భారతీయ వంటకాలపై 24 తపాలా బిళ్ళలు 3-11-2017 న విడుదలైనాయి. ఈ వంటకాలను పండుగ వేళ వండుకునే పబ్బాలు - పిండివంటలు , దేవుడి కి గుళ్లో ప్రసాదాలుగా చేసేవి, దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధమైన వంటకాలుగా, దేశ విదేశాలలో అంతటా ప్రాముఖ్యతను సంతరించుకున్నదేశీయ వంటకాలాగా నాలుగు తరగతులుగా విభజించి నాలుగు మినియేచర్లు కూడా విడుదల చేసారు. వీటిలో తిరుపతి లడ్డు, హైదరాబాద్ బిరియానీ. గుత్తి వంకాయ కూర, కజ్జి కాయ, దోశ- ఇడ్లి వంటి మన తెలుగు వంటకాలు కూడా ఉన్నాయి.
భారతీయ వంటకాలు
పండుగ పబ్బాలు - పిండి వంటలు
దేవుని ప్రసాదాలు
ప్రాంతీయ వంటలు
అందరు మెచ్చే వంటకాలు
Comments