దసరా పండుగ సందర్భంగా మన తపాలా శాఖ హిందూ మత ప్రామాణిక గ్రంధాలలో ప్రముఖమైన రామాయణ గ్రంధం లోని ముఖ్య ఘట్టాలతో 11 తపాలా బిళ్ళల ను 22-09- 2017 న విశ్వవ్యాప్తంగా విడుదల చేసింది.
దీనిపై సీతా రామ స్వయంవరం, శ్రీ రాముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించటం , భరతునికి పాదుకలు ఇవ్వటం, గృహుడు చే నదిని దాటటం, జటాయువు చే సీతాపహరణ గురించి తెలుకోవటం , శబరి చే ఫలహారం స్వీకరించటం, హనుమంతుడు అశోకవనంలో సీత జాడ కనుగొనటం, లంకకు వారధి కట్టే సమయంలో ఉడుత సహాయం, లక్ష్మణుడి కొరకు హనుమ సంజీవని తెచ్చుట, రామ బాణంతో రావణ సంహారం (ఇవి అన్ని 5 రూపాయల విలువతో ఉన్నవి) మధ్యలో 15 రూ విలువతో శ్రీ సీతారామ పట్టాభిక్షేకం తో వీటిని రూపొందించారు.
|
తపాలా బిళ్ళలపై రామాయణం |
ఇంతకు ముందు 14-10- 1970 లో రామాయణ గ్రంధకర్త మహర్షి వాల్మీకి పై ఒక తపాలా బిళ్ళను విడుదల చేశారు. దీనిపై సీతా రామ లక్ష్మణ ల వనవాసం, బంగారు లేడి చిత్రాలు చూడవచ్చు.
|
Maharsi Valmiki |
|
Miniature sheet - Ramayana |
|
Sheet let - Ramayana |
Comments