![]() |
| Andhra University centenary |
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మన తపాలా శాఖ 26-04-2026 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేశారు. తెలుగు వారి చిరకాల కోరిక మేరకు విజయవాడలో 1926 లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం 1929లో విశాఖ పట్నం కు తరలించబడింది. నేడు ఈ విశ్వవిద్యాలయం దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత లక్ష్మీదేవి చదువుల దేవత సరస్వతీదేవి ల ఆసనానికి గుర్తు. స్వస్తిక్ ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు 64 కళలకుగుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి "నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు" అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి

Comments