A set of seven Commemorative Postage Stamps (CPS) on Terracotta Temples of India (1.Indralarh Temple, Ranipur Jharial, 2. Madan Mohan Temple, Bishnupur,3.Jor Bangla Temple, Bishnupur, 4. Nebiya Khera Temple, Bhadwara, 5. Lakshman Temple, Sirpur, 6. Lalji Temple, Kalna, 7. Shyam Rai Temple, Bishnupur) was released by India Post on 08.08.2020
మన దేశంలో టెర్రాకోట తో కట్టిన దేవాలయాలను ఇతివృత్తంగా చేసుకొని మన భారత తపాలా శాఖ 08-08-2020 న ఏడు తపాలా బిళ్ళలు తో కూడిన ఒక మినియేచర్ ను విడుదల చేసింది.
శిలలపై శిల్పాలు చెక్కి దేవాలయాలు నిర్మించటం మనం సాధారణంగా చూస్తాం. రాతి శిలలు లభించని ప్రాంతాలలో ఇటుకలతో కట్టిన దేవాలయాలను నిర్మించి వాటి గోడలపై మట్టి పలకలపై (టెర్రకోట) అందంగా తాయారు చేసిన శిల్పాలను తాపడం చేసి ఆలయం నిర్మించటం ఒక విశిష్ఠ వాస్తు శిల్పకళ.
పశ్చిమ బంగా లో బంకురా జిల్లా లో ఉన్న విష్ణుపూర్ లో మల్ల రాజులు బంగా వాస్తు పద్దతిలో నిర్మించిన టెర్రకోట దేవాలయాలలో ముఖ్యమైన మూడు వైష్ణవ ఆలయాలు మదనమోహనాలయం (1694), జోర్ బంగ్లా దేవాలయం (1655) , శ్యామ్ రాయ్ (కృష్ణ) ఆలయం (1643) వీటిపై ఉన్నాయి . ఇంకా పశ్చిమ బంగా లోనే ఉన్న లాల్జీ ఆలయం,కలనా (1739), ఒరియా రాష్ట్రం, రాణిపూర్ లో ఉన్న ఇంద్రాల్త్ ఆలయం(8వ శతాబ్దం), ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ జిల్లా, నిబియా ఖేరా గ్రామం లో ఉన్న ఆలయం (9-10 శతాబ్దం) ఛతీస్ ఘడ్ లోని సిర్పూర్ లోని లక్ష్మణ్ దేవాలయం (7వ శతాబ్దం) కూడా వీటిపై చోటు చేసుకున్నాయి.
Terracotta Temples of India |
Comments