మన భారత తపాలా శాఖ 28-06-2020 న జానపద కళాకారుల వాయిద్య పరికరాలు (Musical Instruments of Wandering Minstrels) పేరుతో మన బుర్ర కథలో వంత పాడే కళాకారుడు వాడే వాద్యం డిక్కీ కు, దానిని వాయిస్తున్న కళాకారుడితో పాటు మరో ఐదు జతల (se-tenant) తపాలా బిళ్ళలు విడుదల చేసింది.
Kamaicha,Ravanahatha,Surando,Algoza,Burrakatha,Ektara
Musical Instruments of Wandering Minstrels
మన దేశీయ జానపద కళాకారుల వాయిద్య పరికరాల కేటగిరిలో మన తెలుగు వారి జానపద కళ అయినా బుర్ర కథలో ప్రధానంగా ఉపయోగించే వాయిద్యమైన డిక్కీకు, దానిని వాయిస్తున్న వంత పాడే కళాకారునికి తపాలా బిళ్ళపై స్థానం కల్పించటం మన జానపద కళకు దక్కిన గౌరవంగా పరిగణించవచ్చు.
ఈ డిక్కీ ని బుడిగె , గుమ్మెట అని కూడా పిలుస్తారు . బుడిగెలు మామూలు గుమ్మెట్ల కంటే చిన్నవి. ఇవి ఇత్తడితోనో లేదా కంచు తోనో చేయబడి వుంటాయి.(membranophone category)
బుర్ర కథలో వంత పాడే కళాకారుడు - డిక్కీ
తెలుగునాట జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ.
ఆంధ్ర దేశంలో 12వ శతాబ్దము నుండి బహుళ ప్రచారం పొందిన బుర్ర కథలు తొలి రోజులలో జంగం కథలుగా పిలువబడినాయి. జంగం కథను తెలుగు జాతి యొక్క సంగీత జానపద కళారూపంగా చెప్పవచ్చు. జంగాలందరూ శైవభక్తులు. వీరు చెప్పే కథలకు జంగం కథలని పేరు. వీరికే బుడిగె జంగాలు అనే పేరు కూడా వాడుకలో ఉంది. అందుకు కారణం వారు కథలో ఉపయోగించే వాయిద్యానికి బుడిగె అనేపేరును బట్టి బుడిగె జంగాలనే పేరు సార్థక నామమైంది.
Musical Instruments of Wandering Minstrels |
Comments