మన తపాలా శాఖ 22-12-2016 న సామ్రాట్ విక్రమాదిత్య పై ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఉజ్జయిని రాజధానిగా ప్రజలను జనరంజకంగా పాలించిన విక్రమాదిత్యుని కొలువులో భట్టి అనే మంత్రి ఉండేవాడని , వారు ఇద్దరు దేశ సంచారం చేసి రకరకాల సమస్యలను నివృత్తి చేశారనే కధలు "భట్టి విక్రమార్క కథలు" ( భేతాళ కథలు) పేరుతో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. అలాగే గుణాఢ్యని కథాసరిత్సాగరం లోను, బృహత్కథామంజరి లోను విక్రమాదిత్యుని గురించి గొప్పగా చెప్పబడినది .
క్రీస్తు పుట్టకముందు 57 ఏళ్ళనుండి మన దేశంలో కొన్ని ప్రాంతాలలో వీరి పేరుతో 'విక్రమ శకం' పేరుతో కాలమానం ఉంది. చరిత్రకు అందని ఈ సామ్రాట్ విక్రమాదిత్య పై తపాల బిళ్ళను విడుదల చేయటం ముదావహం.
Samrat Vikramadittya |
Comments