ఎప్పుడో 2000 ఏళ్ల క్రితమే ఆంధ్రుల రాజధానిగా విలసిల్లిన ధాన్యకటకం (ధరణికోట) ఆ తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది. ఈ పట్టణం పేరు తిరిగి స్పురించేలా నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం.
Amaravathi Sculpture |
India Post Issued a Commemorative postage stamp on 19 - 06 - 2003 on Amaravathi Sculpture preserved at Govt. Museum -Chennai
Govt. Museum -Chennai |
ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకురాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలతకలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధునిజీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడినచైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్విలో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతాకూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగాజరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఇక్కడదొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్లలో భద్రపరిచారు. అమరావతి లో ఉన్న అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవితచరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి చెన్నై లోని ప్రభుత్వప్రదర్శనశాలలో భద్రపరచారు. అలా బద్రపరిచిన శిలా పలకాలలో ఒక దానిని 19-06 -2003 లో చెన్నై లో ఉన్న ప్రభుత్వ పురా వస్తు ప్రదర్శన శాల కు 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా విడుదలైన తపాల బిళ్ళపై ముద్రించారు.ఈతపాలాబిళ్ల ల తో పాటు ఒక మినిఎచార్ కుడా విడుదల చేసారు.
Pictorial Cancellation on Amaravathi
A Special Cover on Pictorial Cancellation at Amaravathi on 28-02- 1976 |
12 -04 -1975 న(ఉగాది పర్వదినాన) ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగినప్పుడు మన భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారు. తొలి రోజు విడుదల చేసిన ప్రత్యేక కవరు పైన తెలుగు జాతి ఘన చరిత్రకు చిహ్నంగా అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం ను ముద్రించారు.
అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం |
Special cover on GUNTUR PEX-2004, Amaravathi Stupa, A.P.
Date of Issue : 06-08-2004
|
కాల చక్ర -2006
Special cover on Kalachara -2006, Amaravathi, A.P.
Date of Issue : 09-01-2006
|
Comments