India Post released New Souvenir Sheet on the occasion of "Philately day 2013" on 12th October 2013. The Souvenir Sheet Shows two stamps of Mahatma Gandhi Issued by India Post in 1948 (12A) and 1969 (75)
Souvenir Sheet – Philately Day – Mahatma Gandhi |
మన తపాలా బిళ్ళల లో సింహ భాగం మహాత్మా గాంధీ పైనే విడుదల చేసారు. తపాలా బిళ్ళల సేకరణలో మహాత్మా గాంధీజీ తపాలా బిళ్ళ లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది . ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ అహింసా మూర్తిని తమ తపాలా బిళ్ళ ల పై ముద్రించి గౌరవించాయి. వీటిని సేకరించటానికి పలు దేశాలలో తపాల బిళ్ళ ల సేకరణ దారులు తహతహ లాడుతుంటారు. పాత తపాల బిళ్ళలు అందరికి అందుబాటులో ఉండటానికి ఇలా ప్రత్యేక స్మారక తపాలా చిత్రం ( Stamps on Stamp) విడుదల చేస్తారు.
తపాలా బిళ్ళల సేకరణ దినోత్సవం సందర్బం గా 12-10-2013 న మన తపాలా శాఖ ఒక సావనీర్ షీట్ ( స్మారక తపాలా చిత్రం) విడుదల చేసింది. దిని పై మాహాత్మ గాంధీ చిత్రం తో పాటు 1948 లో విడుదలైన 12 అణాల గాంధీ తపాలా బిళ్ళ ,1969 లో విడుదలైన 75 పైసల గాంధీ తపాలా బిళ్ళలు ఉండేలా 20 రూపాయల తపాలా బిళ్ళ ను రూపొందించారు. దిని వెనుక 1969 లోనే విడుదల అయిన ఒక రూపాయి తపాలా బిళ్ళ రేఖా మాత్రం గా కనిపిస్తుంది. అహింసా మూర్తికి ఘన నివాళి
Comments