వందేళ్ళ సినిమా కి వందనం
మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు.
ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు .
మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.
ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు S. V. రంగారావు , భానుమతి, అల్లు రామలింగయ్య

ఎస్వీ రంగారావు (1918-1974)
సామర్ల వెంకట రంగారావు - SVR గా తెలుగు చిత్ర సీమలో పేరొందిన నటుడు. మూడు దశాబ్దాలపాటు మూడొందల పైగా సాంఘిక పౌరాణిక సినిమాలలో అద్భుతంగా నటించిన సహజ నటుడు. ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ప్రేక్షకుల మన్నలను గడించాడు. నర్తనశాల చిత్రంలో తన నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు.
S.V.RANGA RAO |
పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ (1925 - 2005)
శ్రీమతి భానుమతి తెలుగు చలన చిత్ర సీమలో వెన్నదగిన నటిమణి. ఈమెకు అనేక రంగాలలో ప్రవేశం ఉంది. నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు గా కుడా లబ్ద ప్రతిష్టులు. మల్లీశ్వరి,బాటసారి,చండీరాణి, మగమ్మగారి మనుమరాలు వంటి ఉత్తమ చిత్రాలలో నటించిన నటి. NTR జాతీయ పురస్కారం , రఘుపతి వెంకయ్య రాష్ట్ర పురస్కారం పొందిన విలక్షణ నటి .
BHANUMATHI |
పద్మశ్రీ అల్లు రామలింగయ్య ( 1922-2004)
తెలుగు చిత్ర సీమ లో 1030 చిత్రాలలో హాస్య నటునిగా తెలుగు వారికి వినోదం పంచిన నటుడు. భారత ప్రభుత్వం 1990 లో ' పద్మశ్రీ ' అవార్డు తో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు. రఘుపతి వెంకయ్య రాష్ట్ర పురస్కారం పొందిన హాస్య నటుడు .
ALLU RAMALINGIAH |
100- YEARS OF INDIAN CINIMA -FIRST DAY COVER |
Comments