తెలుగు సినిమా చరిత్రలో శాశ్విత కీర్తిని పొందిన మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు (జ. 4-12-1922 మ. 11-02-1974) కృష్ణ జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించిన గాన కోకిల ఘంటసాల గారు ఈ నాడు భౌతికంగా మన మధ్య లేక పోయినా పాట రూపంలో తెలుగు నాట జీవించే ఉన్నారు. 'మల్లియ లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా ' , 'మనసున మనసై బ్రతుకున బ్రతుకై ' , 'నిలువవే వాలు కనుల దాన ' , 'ఏమండీ ..ఇటు చూడండీ ' 'దేవ దేవ ధవళాచల ' వంటి భక్తి గీతాలు 'గుండమ్మ కథ' లో 'కోలు కోలో యన్న కోలో నా సామి ',' లేచింది నిద్రలేచినింది ' వంటి పాటలు వారి గాన మాధుర్యానికి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ' , 'ప్రతి రాత్రి వసంత రాత్రి ', 'దేవుడు చేసిన మనుషుల్లారా ', 'భలే మజాలే భలే ఖుషీలే ' 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' , 'త్యాగ శీల వమ్మా మహిళా ', 'ఊరు మారినా ఉనికి మారునా ', 'చీకటిలో కారు చీకటిలో '- 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ...
Comments