India post Issued a set of two postage stamps and one miniature sheet on Srikurmam and Arassavalli Temples in Srikakulam Dist. Andra Pradesh on the occasion of Telugu new year "Ugadi" on 11-04-1213.
These set of stamps and Miniature have been released in the series of Architectural Heritage of India.
మన భారత తపాలా శాఖ 11-04-2013 న భారతీయ శిల్ప కళా సంపద లో భాగం గా
"Architectural Heritage of India "పేరుతో తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున మన రాష్ట్రం లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రెండు ప్రాచీన దేవాలయాల పై రెండు తపాలా బిళ్ళలు మరియు ఒక మినియెచర్ ను విడుదల చేసింది. వీటిపై 20 రూపాయల విలువ గల తపాలా బిళ్ళపైన అరసవల్లి సూర్య దేవాలయం , 5 రూపాయల విలువ గల మరొక తపాలా బిళ్ళ పైన శ్రీకూర్మం లోని కూర్మనాధ స్వామీ ఆలయం చోటు చేసుకున్నాయి. ఇవి రెండు జంట గా అందమైన మరో 25 రూపాయల మినియెచర్ కుడా విడుదల చేసారు.
ఇంతకు ముందు మన తెలునాట ఉన్న సుప్రసిద్ద దేవాలయాలు అయిన తిరుమల-తిరుపతి, శ్రీశైలం లో ఉన్న దేవాలయాల పై తపాల బిళ్ళలు విడుదల అయ్యాయి .
శ్రీ కూర్మం కుర్మానాధ దేవాలయం
శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో విష్ణు మూర్తి దశ అవతారాలలో ఒకటి అయిన కూర్మావతారం లో దర్శనమిచ్చే మందిరం ఇదొక్కటే.
ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. పడమటి అభి ముఖంగా నిర్మింపబడిన ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.
అరసవల్లి సూర్య దేవాలయం
శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం.
ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత.
These set of stamps and Miniature have been released in the series of Architectural Heritage of India.
ARCHITECTURAL HERITAGE OF INDIA - M.S ARASAVALLI - SRI KURMAM TEMPLES |
"Architectural Heritage of India "పేరుతో తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున మన రాష్ట్రం లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రెండు ప్రాచీన దేవాలయాల పై రెండు తపాలా బిళ్ళలు మరియు ఒక మినియెచర్ ను విడుదల చేసింది. వీటిపై 20 రూపాయల విలువ గల తపాలా బిళ్ళపైన అరసవల్లి సూర్య దేవాలయం , 5 రూపాయల విలువ గల మరొక తపాలా బిళ్ళ పైన శ్రీకూర్మం లోని కూర్మనాధ స్వామీ ఆలయం చోటు చేసుకున్నాయి. ఇవి రెండు జంట గా అందమైన మరో 25 రూపాయల మినియెచర్ కుడా విడుదల చేసారు.
ARCHITECTURAL HERITAGE OF INDIA - FDC |

Comments