Skip to main content

Posts

Showing posts from May, 2010

సరోజిని నాయుడు

SAROJINI NAIDU Date of issue: 13-02-1964 సరోజినీ నాయుడు ( ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల ( నైటింగేల్ ఆఫ్ ఇండియా ) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి . భారత జాతీయ కాంగ్రేసు తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు గా ప్రసిద్ది చెందారు . దండి సత్యాగ్రాం లోను , రౌండ్ టేబుల్ సమావేశం లోను మహాత్మా గాంధీ గారి తోపాటు పాల్గొంది . సరోజినీ దేవి హైదరాబాదులో ఒక బెంగాలీ కుటుంబములో జన్మించినది . ఈమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ స్థాపకుడు , శాస్త్రవేత్త మరియు తత్వవేత్త . తల్లి బరదా సుందరి దేవి ఒక కవయిత్రి . ఈమె దక్షిణాదికి చెందిన డా. ముత్యాల గోవిందరాజులు నాయుడు ను ప్రేమించి , చదువు పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో వివాహము చేసుకున్నది. కులాంతర వివాహములకు సమాజము చాలా వ్యతిరేకముగా ఉన్న ఆ రోజుల్లో వీరి వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించాడు . సరోజినీ దేవి ఉర్దూ , తెలుగు , ఆంగ్లము , పర్షియన్ మరియు బెంగాలీ భాషలు మాట్లాడేది .ఆమె ...

C.K.నాయుడు

C.K.NAYUDU Date of issue: 13-04-1996 కొట్టారి కనకయ్య నాయుడు ( 1895- 1967) నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు.తొలి భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. ఆరు దశాబ్దాలపాటు "ఫస్ట్ క్లాస్ క్రికెట్" ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి.కె.నాయుడు ఒకరు.వీరి గౌరవార్దం 13-04-1996 లో ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది. వీరితో పాటు క్రికెట్టు క్రీడా దిగ్గజాలు దేఒదర్, వినూ మన్కడ్ ,విజయ్ మర్చంట్ లకు కుడా తపాల బిళ్ళలు విడుదల చేసారు. సి.కే.నాయుడు క్రికెట్ లో సాధించిన పరుగులు,ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. Test Career Batting and Fielding (1932-1936) M I NO Runs HS Ave 100 50 Ct India 7 14 0 350 81 25.00 0 2 4 Test Career Bowling (1932-1936) Balls Mdns Runs Wkts BB Ave 5wI 10wM SRate Econ India 858 24 386 9 3-40 42.88 0 0 95.33 2.69 First-Class Career Batting and Fielding (1916/17-1963/64) M I NO Runs HS Ave 100 50 Ct St Overall 207 344 15 11825 200...

వినియోగాదారుడా మేలుకో !!!

వినియోగదారులను జాగృతం చేసే ప్రకటనలతో తెలుగులో విడుదల చేసిన మేఘదూత్ కార్డ్స్ సాయాని రాణి చెబుతుంది ఇలా ... సాయాని రాణి చెబుతుంది ఇలా ... మిటాయి లు కొనేటప్పుడు మిటాయికు మాత్రమె డబ్బు చెల్లించండి . ప్యాకింగ్ కు వద్దు . సాయాని రాణి చెబుతుంది ఇలా ... M . R .P. ధర కన్నా ఎక్కువ ధర చెల్లించకండి . సాయాని రాణి చెబుతుంది ఇలా ... ISI హెల్మెట్ నే ధరించి వాహానాలను నడపండి . సాయాని రాణి చెబుతుంది ఇలా ... BIS హాల్ మార్క్ గల బంగారు నగలనే కొనండి .

ఎయిడ్స్ - మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ -2

ఎయిడ్స్ వ్యాది నిర్మూలనకై ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలతో విడుదలైన మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ .

మలేరియా - మేఘదూత్ పోస్ట్ కార్డ్స్

మలేరియా జ్వరం దోమ కాటు నుండి వస్తుందని , దానికి తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పే మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ .

ఎయిడ్స్ - మేఘ దూత్ పోస్ట్ కార్డ్స్

ఎయిడ్స్ ని అరికట్టాలనే ప్రచారం తెలుగు లో విడుదలైన మేఘ ధూత్ పోస్ట్ కార్డ్స్ ఎయిడ్స్ వ్యాది ని అరికట్టాలనే ప్రచారంతో విడుదలైన మేఘ ధూత్ పోస్ట్ కార్డ్స్ ఎయిడ్స్ వ్యాది ని అరికట్టాలనే ప్రచారంతో విడుదలైన మేఘ ధూత్ పోస్ట్ కార్డ్స్ ఎయిడ్స్ వ్యాది ని అరికట్టాలనే ప్రచారంతో విడుదలైన మేఘ ధూత్ పోస్ట్ కార్డ్స్ ఎయిడ్స్ వ్యాది ని అరికట్టాలనే ప్రచారంతో విడుదలైన మేఘ ధూత్ పోస్ట్ కార్డ్స్

వి.వి.గిరి

PRESIDENT OF INDIA (1969-1974) V.V.GIRI Date of issue : 24-08-1974 మన దేశానికి నాల్గోవ రాష్ట్రపతిగా,కార్మిక ఉద్యమానికి విశేషమైన సేవలు చేసిన శ్రీ వి.వి.గిరిగా ప్రసిద్ధుడైన వరాహగిరి వేంకటగిరి (ఆగష్టు 10, 1894 - జూన్ 23, 1980) గారు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణములోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధిచెందిన న్యాయవాది. 1913లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ ఐర్లండ్ లో సీన్‌ఫెన్ ఉద్యమములో పాల్గొని దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా , మైఖెల్ కోలిన్స్ , పాట్రిక్ పియర్సె , డెస్మండ్ ఫిట్జెరాల్డ్ , ఈయోన్ మెక్‌నీల్ , జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది. భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. 1969 లో రాష్ట్రపతి ఎన్నిక లో...

Postal Heritage Buildings

Postal Heritage Buildings 13 -05- 2010 వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుండి 18 వరకు మన దేశ రాజధానిలో జరిగే ప్రపంచ తపాల బిల్లల ప్రదర్శనకు (INDPEX-2011) ముందస్తు సన్నాహం గా మన దేశం లో చారిత్రిక ప్రసిద్ది పొందిన తపాలకార్యాలయాల భవనాలను ప్రదర్స్తిస్తూ ఆరు తపాల బిళ్ళలు, అవి అన్ని ఉండే మినిఏచర్ 13 - 05 - 2010 న విడుదల చేసారు. వీటిపై ఢిల్లీ, లక్నో, సిమ్ల, నాగపూర్, కోచ్ బేహార్, ఊటి లలో గల జి.పి.ఓ (G.P.O.) భవనాలకు స్తానం దొరికింది.

విశాఖపట్నం - జల ఉష

National Maritime day - Jala Usha & Visakhapatnam Date of issue : 05-04-1965 ఏప్రిల్ 5 ,1919 న ముంబాయి నుండి లండన్ కు s.s.loyalty అనే నౌక మొదటి సారి ప్రయాణం చేసింది. దీనికి గుర్తుగా1964 నుండి ప్రతి ఏ డాది అదే రోజు నేషనల్ మేరి టైం డే గా జరుపుతున్నారు. వాల్చంద్ హిరాచంద్,నరోత్తం మొ రార్జీ లు సంయుక్తంగా స్థాపించిన సింధియ షిప్ యార్డ్ ( హిందుస్తాన్ షిప్ యార్డ్ ) వారిచే నిర్మించ బడిన s.s.జల సూర్య1948,మార్చ్ 14 న జల ప్రవేశం చేసింది. 05-04-1965 న తపాల శాఖా వారు నేషనల్ మేరి టైం డే న విశాఖ పట్నంరేవు, జల సూర్య ఓడ బొమ్మతో ఒక ప్రత్యేకమైన తపాల బిళ్ళను విడుదల చేసారు. వాల్చంద్ హిరా చంద్- WALCHAND HIRACHAND DATE OF ISSUE : 23-11-2004 నరోత్తం మొ రార్జీ( Narottam Morarjee and Liner Loyalty) Date of issue -02-04-1977

విశాఖపట్నంలో నౌకా బల విన్యాసం

President's Review of the Fleet , Visakhapatnam. Date of issue - 12-02-2006 మన నౌకా బలాన్ని ప్రపంచానికి చాటే నౌకా బాల విన్యాసాన్ని తొలి సారిగా తూర్పు తీరంలో మన విశాఖపట్నంలో 12-02-2006 లో జరిగినది . దీన్ని ఆనాటి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తిలకించారు . ప్రతి రాష్ట్రపతి తన పదవీకాలంలో ఒక సారి ఈ ప్రదర్శనను చూసి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు . ఈ సందర్బంగా తపాల శాఖ వారు నాలుగు సంయుక్త తపాల బిళ్ళల ను విడుదల చేసారు . ( Se-tenant -Clockwise from top left) 1. Aircraft Carrier INS Viraat and Sea Harrier aircraft. 2. Talwar & Bhahmaputra class frigates and Sea King anti-submarine helicopter. 3. Sindhughosh & Shishumar class submarines. 4. Sandhayak class Survey vessel and Off-shore Patrol Vessel Vigraha

విశాఖపట్నం పోర్ట్ -ప్లాటినం జూబ్లి

Meghdoot card released for the completion of 75 eventful years (1933-2008)in the service of Nation by Visakhapatnam Port trust, known as the Gateway to the East Coast of India. The MOTIF on Meghdoot Cards is Homi Bhabha . తూర్పు తీరానికి ముఖ ద్వారం గా భాసిల్లుచున్న మన విశాఖ పట్నం ఓడ రేవు కి 75 వసంతాలు నిండిన సందర్బంగా మేఘ దూత్ కార్డ్ ను విడుదల చేసారు . హోమీ బాబా ముఖ చిత్రం తో ఉన్న దీని వెల 25 పైసలు మాత్రమే .

కోటమరాజు రామారావు

KOTAMARAJU RAMA RAO Date of issue :- 09-11-1997 పాత్రికేయులు, స్వతంత్ర సమర యోధులు శ్రీ కోటమరాజు రామారావు గారు (1897-1961) ప్రకాశం జిల్లాచీరాల లో జన్మించారు.మద్రాసు విశ్వవిద్యాలయం లో ఇంగ్లీష్ లో పట్టా పొంది పచ్చయప్ప కళాసాలలోఅధ్యాపకునిగా చేస్తూ కరాచి నుండి వెలువడే 'Sind Observer' లో విలేఖరిగా చేరారు.1938 లో నెహ్రు గారువీరిని లక్నో నుండి వెలువడే నేషనల్ హెరాల్డ్ కు ప్రధాన సంపాదుకునిగా నియమించారు. 1942 లో వీరు రాసినసంపాదికియాలను చూసి జడిసిన ఇంగ్లీష్ వారు ఆ పత్రికను మూసివేసి రామారావు గార్ని జైల్లోపెట్టారు.గాంధీజీ వీరిని 'Fighting Editor' గా అబివర్ణిచారు.1952 లో అవిభక్త మద్రాసు నుండి రాజ్య సభకుఎన్నికైనారు.వీరి కలం నుండి అనేక రచనలు వెలువడ్డాయి. తపాల శాఖ వారు రామారావు గారి గౌరవార్దం 9-11-97 న ఒక తపాల బిళ్ళ విడుదల చేసింది.

భాషా శాస్త్రవేత్త -రాబర్ట్ క్లాడ్వేల్

ROBERT CALDWELL Date Of Issue:- 07.05.2010. రాబర్ట్ క్లాడ్వేల్ ఉత్తర ఐర్లాండ్ లో 1814 లో జన్మిచారు.తన 24 వ ఏట మత ప్రచారకునిగా మద్రాస్ వచ్చారు.స్వతహాగా భాషా శాస్త్రాభిమాని అగుటచే ద్రావిడ భాషలపై అద్యయనం చేసారు. తమిళం,తెలుగు, కన్నడం, మలయాళం,తులు వంటి దక్షణ భారత భాషలు అన్ని ఒక తెగకు చెందినవని వాటిని ద్రావిడ భాషాతరగతిగా వర్గీకరించాడు.ద్రావిడ భాషలు సంస్కృత భాష నుండి ఉద్భ వించ లేదని సూత్రీకరించాడు.వీరి పరిశోదనలు ద్రావిడ ఉద్యమానికి ఉతం ఇచ్చింది. వీరికి 18 భాషలలోప్రవేశముంది. 07-05-2010 న భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. ఈతపాల బిల్లపై రాబర్ట్ క్లాద్వేల్ చిత్రం తో పాటు తెలుగు,కన్నడం,తమిళం,మలయాళం అని ఆయా భాషలలో ముద్రించబడినాయి.

తపాల బిళ్ళ పై Dr.G.V.చలం

First Day Cover on Dr. Guduru Venkatachalam A Commemorative postage stamp on 08 -05-2010 Dr .GUDURU VENKATA CHALAM వ్యసాయ శాస్త్రవేత్త , స్వతంత్ర సమరయోదుడు , పద్మశ్రీ గూడూరు వెంకటాచలం (1909-1967) గారి గౌరవార్దం 08-05-2010 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు . గూడూరు వెంకటాచలం గారు 1909 లో కృష్ణ జిల్లా గుడివాడలో జన్మిచారు . విద్యార్ది దశలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని 14 నెలలు వెల్లూరు జైల్లో నిర్భంధించ బడ్డారు . ఆ తరువాత వ్యవసాయ రంగంలో విశేషమైన పరిశోధనలు చేసి ఎన్నో క్రొత్త వరి వంగడాలను వృద్ది చేసారు . వరి సాగు పై అనేక పుస్తకాలు , పరిశోధనా వ్యాసాలు వ్రాసారు .బియ్యం మన ప్రధాన ఆహారం గా ఉన్నంత కాలం మన గూడూరు వెంకటాచలం గారు గుర్తుండి పోతారు . వీరి సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం 1967 లో పద్మ శ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది . పద్మశ్రీ డా.జి.వి. చలం గారిపై రాజేంద్రనగర్  వ్యవసాయ  పరిశోధన కేంద్రం, హైదరాబాదు వారు ఒక ప్రత్యేక కవరును 30-11-2009 న విడుదల చేసారు.  Special cover on Padmasri Dr. G.V.Chalam...

మన కోటలు - చంద్రగిరి,గోల్కొండ

A Commemo rative postage stamp on 31 - 12 - 2002 Forts of andhra pradesh PALACE-CHANDRAGIRI FORT, GOLCONDA FORT మన రాష్ట్రం లో ఉన్న చారిత్రిక ప్రసిద్ది పొందిన చంద్రగిరి కోట, గోల్కొండ కోట ల పై తపాల శాఖ వారు రెండుప్రత్యేక తపాల బిళ్ళ లు 31-12-2002 లో విడుదల చేసారు. చంద్ర గిరి దుర్గం విజయ నగర రాజు ల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయలు తిరుమల దర్శించినప్పుడు ఇక్క డే విడిదిచేసేవారు. అచ్యుతదేవరాయలను ఇక్కడే గృహ నిర్బందములో ఉంచినారు. శ్రీ కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. 1640 లో అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో ప్రస్తుతం ఉన్న ఈకోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచే వారు. ఇలా నిర్మించుట వలన కోట రక్షణ కొండ ప్రాంతమువైపుగా తగ్గగలదనీ కొండపైనుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమనించుట సులభం కనుక కొండ ప్రక్కగా నిర్మిచారు . కోట చుట్టూ దాదాపు కిలో మీటరు దృడమైన గోడకలదు. ఈ గోడననుసరిస్తూ బయటి వైపుగా పెద్ద కందకము కలదు. చంద్రగిరి నుంది పాలించిన చిట్టచివరి విజయనగర రాజు పెద వేంకట రాయలు, తన సామంతుడు దామెర్ల చెన్నప్ప నాయకు...

అమరావతి - Pictorial Cancellation

A Special Cover to commemorate the inauguration of Pictorial Cancellation at Amaravathi on 28-02- 1976 అమరావతి ని చారిత్రిక ప్రసిద్ధిని గుర్తించిన తపాల శాఖవారు అమరావతికి ప్రత్యేక తపాల ముద్రను 28 - 02 - 1976 లో కేటాయించారు . ఈ ప్రతేక కవర్ పై బుద్దుని బొమ్మ , క్యాన్సిలేషన్ ముద్రపై అమరావతి లో ఒకప్పుడున్న బౌద్ద స్తూపం ఉంది . ఈ స్తూపం పై ఉన్న శిల్పాలలో ఒక దానిని చెన్నై మ్యుజియం కు 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా విడుదలైన తపాల బిళ్ళపై ముద్రించారు.ఈతపాలాబిళ్ల ల తో పాటు ఒక మినిఎచార్ కుడా విడుదల చేసారు.

సాలార్ ‌జంగ్ మ్యూజియం

A Commemorative postage stamp on 27-07-1978 Dagger and Knife of Jehangir (Salarjung Museum) హైదరాబాద్ నగరానికి మణి హారం సాలార్ జంగ్ మ్యూజియం . దీనిలో ఉన్న సేకరణలన్నీ మీర్ యూసుఫ్ ఆలీ ఖాన్ చే సేకరించినవే , ఇతను సాలార్ జంగ్ III గా ప్రసిధ్ధి . ఈ మ్యూజియం లోఉన్న 78 గదులలో 40,000 వస్తువులు గలవు . ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న " రెబెక్కా ", జహంగీర్ చురకత్తి , నూర్జహాన్ పండ్లుకోసే కత్తి , 12 వ శతాబ్దానికి చెందిన " యాఖూతి ఉల్ - మస్తామీ " యొక్క ఖురాన్ ప్రతి , గడియారం మరియు " స్త్రీ - పురుష శిల్పం " ప్రధానమైనవి . వీటితో పాటు ఇంకా సేకరణల్లో గ్రంధాలు , పోర్సిలీన్ , తుపాకులు , ఖడ్గాలు , శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండీ తెప్పించి భద్రపరచబడినవి . 27 - 07 - 1978 లో మన ప్రాచీన కళా సంపద బద్రపరిచిన పురా వస్తు ప్రదర్సన శాల ల పై ముద్రించిన నాలుగు తపాల బిళ్ళ లలో ఒకటి మన సాలార్ జంగ్ మ్యూజియం లో ఉన్న జహంగీర్ చురకత్తి , నూర్జహాన్ పండ్లుకోసే కత్తి బొమ్మలతో ముద్రించారు.