Skip to main content

Posts

అక్కినేని కి అమెరికా లో వ్యక్తి గత తపాల బిళ్ళ

అక్కినేని నాగేశ్వరరావు  అమెరికా లో  అక్కినేని నాగేశ్వరరావు గారి  అబిమానులు(AFA) వారికి నివాళిగా20-9-2014 న  ఒక వ్యక్తి గత తపాల బిళ్ళను usps చే విడుదల చేపించారు . దీనికి ఎటువంటి అధికారిక గుర్తింపు ఉండదు . ఇలాంటి వాటిని USPS కు డబ్బు చెల్లించి ఎవరిదైన వ్యక్తిగత చిత్రాన్ని తపాల బిళ్ళ పై  ముద్రించు కోవచ్చు.  ఇప్పటివరకు అమెరికా తపాల శాఖ వారు మన దేశానికి సంబందించి మహాత్మా గాంధీ గారికి , మదర్ తెరెసా కు మాత్రమే అధికారక తపాల బిళ్ళలు విడుదల చేసి వారిని గౌరవించారు.   మన దేశం లో కుడా Rs 300 /- తో మై స్టాంప్  పధకం లో ఇలాంటి  వ్యక్తి గత  తపాల బిళ్ళలు   పొందవచ్చు .  AFA వారు దీనికి ఇంత ఎత్తున ప్రచారం చేయాలా? దీనికంటే హైదరాబాద్ GPO లో అక్కినేని జయంతి న ఒక స్మారక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసిన బాగుండేది.  మన తెలుగు సినిమా నటులలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ,సావిత్రి SVరంగారావు,భానుమతి, అల్లు రామలింగయ్య   గార్లకు, చలనచిత్ర  దర్శకులలో  దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొ...

సంగీత దర్శకుడు చక్రవర్తి గారికి స్మారక తపాలా కవరు

India Post  a Special Postal Cover issued On famous South Indian music  Director, Singer and actor CHAKRAVARTHI (Kommineni Appa rao) on 6-09-2014 గుంటూరు తపాల బిళ్ళలు, నాణేలు సేకరణ దారుల సంఘం ( GNPS - Guntur Numismatic and Philatelic Society) ద్వి దశాబ్ది  వార్షికోత్సవం సందర్బం గా రెండవ రోజు  6-09-2014 న గుంటూరులో  ప్రముఖ తెలుగు సిని సంగీత దర్శకుడు ,గాయకుడు,నటుడు అయిన చక్రవర్తి గారికి  ఒక స్మారక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు Spcial cover on CHAKRAVARTHI  చక్రవర్తి పేరుతో ప్రత్యేక తపాల ముద్ర  చక్రవర్తి (1936-2002 ) తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త,గాయకుడు, నటుడు కె చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు .  ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించారు.  సంగీత చక్రవర్తి గారు 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర సంగీత రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. పలు  సినిమాలలో 200లకు పైగా పాటల...

షేక్ నాజర్ కు, గుఱ్ఱం జాషువా గార్లకు ఒక ప్రత్యేక తపాలా కవరు

India Post a Special Postal Cover issued On SHAIK NAZAR (BURRA KATHA) AND GURRAM JASHUVA (WRITER)  on 5 -9- 2014  Special cover on SHAIK NAZAR , GURRAM JASHUVA  GNPS - (Guntur Numismatic and Philatelic Society) ద్విదశాబ్ది వార్షికోత్సవం సందర్బం గా 5-09-2014 న గుంటూరులో ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ కు, ప్రఖ్యాత కవి గుఱ్ఱం జాషువా గార్లకు కలిపి ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు, దీనిపై తపాల ముద్రగా నాజర్ బుర్ర కథ లో వాడే 'తంబూర' , జాషువా రచన 'గబ్బిలం ' పుస్తకం ఉన్నాయి. షేక్ నాజర్ (1920-1997) బుర్రకథా పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకుల ముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు, 1997 ఫిబ్రవరి 22న అంగలూరులో మరణించారు. గుంటూరుకు ఎన్‌టిఆర్ వచ్చినప్పుడు నేను మీ అభిమానిని అని నాజర్ చెపితే ‘నేను మీ ఫాన్‌ను’ అని ఎన్‌టిఆర్ చెప్పి అందరినీ ఆనందపరిచారు.ప్రజా కళాకారుడుగా,అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మ...

stamps on Indian Musicians

India Post released a Set of 8 stamp on Indian Musicians on 3rd September 2014 to pay tribute to legendary maestros of Indian Classical Music. Indian Classical Music is of two types, Hindustani and Carnatic Music. Hindustani music is mainly found in North India and Carnatic in South India. The stamps released on legendary maestros Ravi Shankar, Bhimsen Joshi, D.K.Pattammal, Gangubai Hanagal, Kumar Gandharva, Vilayat Khan, Mallikarjun Mansur, and Ali Akbar Khan.

గుంటూరు లో తపాల బిళ్ళలు ,నాణేలు ప్రదర్శన

GUTUR STAMPS & COINS FEST-2014 GNPS -   ( Guntur Numismatic and Philatelic Society)  20 వ వార్షికోత్సవం సందర్బం గా    2014 సెప్టెంబర్ 5,6,7తేదిలలో గుంటూరు లో తపాల బిళ్ళలు ,నాణేలు ప్రదర్శన జరుపుతున్నారు. గుంటూరు  బృందావన్  గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ లోని బాలాజీ మంటపం లో   మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలోఅరుదైన  వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడతాయి.   ప్రవేశం ఉచితం. ఈ సందర్బంగా తెలుగు సంస్కృతి ని ప్రతిబింబించే లా ప్రత్యేక తపాల కవర్లు , ప్రత్యేక సంచిక విడుదల చేస్తున్నారు. పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు కుడా నిర్వహిస్తున్నారు. తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు  స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్  స్టాల్ లు ఏర్పాటు చేస్తునట్లు GNPS  కార్యదర్శి శ్రీ MVS ప్రసాద్ తెలియ జేస్తున్నారు.  GNPS -15 వ వార్షిక ప్రదర్శన సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవర్ 

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం

TANGUTURI PRAKASAM టంగుటూరి ప్రకాశం పంతులు ( 1872 - 1957 ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు. 1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పదకొండు నెలలు పనిచేసారు . ఆ తరువాత 1953 లో ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్య మంత్రి గా దాదాపు 14 నెలలు పనిచేసారు . నిస్వార్ధ ప్రజా సేవకుడు . ప్రకాశం పంతులు తో పాటు వేమన ,వీర్ సింగ్ , బెట్రెండ్ రసూల్ ల ప్రధమ దిన కవర్    ప్రకాశం పంతులు గారి గౌరవార్ధం అక్టోబర్ 16 , 1972 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు .ఈతపాల బిళ్ళ పై తెలుగులో ( టం.ప్రకాశం) అని ప్రకాశంగారి సంతకం ఉంది.తపాల బిళ్ళ పై తొలితెలుగు అక్షరాలు ఇవే. అదే సమయం లో...

ప్రొఫెసర్ జయ శంకర్ కు ప్రత్యేక తపాలా కవర్ విడుదల

Andhra Pradesh Postal Circle released a Special Cover to mark 81st birth anniversary of Professor Kothapalli Jayashankar on 6th August 2014 at Hyderabad.  6-08-2014 న మన తపాలా శాఖ తెలంగాణా ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయ శంకర్ కు ప్రత్యేక తపాలా కవర్ విడుదల  చేసింది. ఆచార్య N. G రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును మార్చి జయశంకర్ గారి పేరు పెట్టి ఆ సందర్బంలో ఈ తపాల కవరు విడుదల చేసారు. బతికి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడిన వీరు మరణించినా తెలుగు జాతి మధ్య విద్వేషాన్ని రగాల్చటానికి ఉపయోగ పడటం శోచనీయం. ప్రపంచ కర్షకులారా ఏకం కండి అని నినదించి రైతు కూలి శ్రేయోరాజ్యం కొరకు జీవితాంతం పోరాడిన రైతు నాయకుడు ,గాన్దేయవాది శ్రీ NG  రంగా పేరును తీసి జయశంకర్ పేరు పెట్టేకన్నా ఒక కొత్త విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టటం సరైన నివాళి.