గుంటూరు తపాల బిళ్ళలు, నాణేలు సేకరణ దారుల సంఘం (GNPS - Guntur Numismatic and Philatelic Society)ద్వి దశాబ్ది వార్షికోత్సవం సందర్బం గారెండవ రోజు 6-09-2014 న గుంటూరులో ప్రముఖ తెలుగు సిని సంగీత దర్శకుడు ,గాయకుడు,నటుడు అయిన చక్రవర్తి గారికి ఒక స్మారక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు
Spcial cover on CHAKRAVARTHI |
చక్రవర్తి పేరుతో ప్రత్యేక తపాల ముద్ర |
చక్రవర్తి (1936-2002 )
తెలుగు చలన
చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త,గాయకుడు, నటుడు కె చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు .
ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించారు.
సంగీత చక్రవర్తి గారు 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర సంగీత రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. పలు సినిమాలలో 200లకు పైగా పాటలు పాడాడు. దాదాపు 600 చిత్రాలకు డబ్బింగ్ కుడా చెప్పారు.
1977 లో వచ్చిన యమ గోల తో మంచి పేరు పొందారు. 1989 లో తెలుగులో 95 సినిమా లు విడుదల అయితే వాటిలో 66 చిత్రాలకు చక్రవర్తి గారే సంగీతాన్ని కూర్చటం ప్రపంచ చిత్ర పరిశ్రమలోఒక రికార్డ్. నేటి భారతం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది బహుమతిని అందుకున్నారు.

Comments