అక్కినేని నాగేశ్వరరావు |
ఇప్పటివరకు అమెరికా తపాల శాఖ వారు మన దేశానికి సంబందించి మహాత్మా గాంధీ గారికి , మదర్ తెరెసా కు మాత్రమే అధికారక తపాల బిళ్ళలు విడుదల చేసి వారిని గౌరవించారు.
మన దేశం లో కుడా Rs 300 /- తో మై స్టాంప్ పధకం లో ఇలాంటి వ్యక్తి గత తపాల బిళ్ళలు పొందవచ్చు .
AFA వారు దీనికి ఇంత ఎత్తున ప్రచారం చేయాలా?
దీనికంటే హైదరాబాద్ GPO లో అక్కినేని జయంతి న ఒక స్మారక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసిన బాగుండేది.
మన తెలుగు సినిమా నటులలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ,సావిత్రి SVరంగారావు,భానుమతి,అల్లు రామలింగయ్య గార్లకు, చలనచిత్ర దర్శకులలో దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొందిన LV ప్రసాద్,BN రెడ్డి గార్లకు, దర్శక రచయత త్రిపురనేని గోపీచంద్ కు గాయకులలో ఘంటసాల గారికి మాత్రమే తపాల బిళ్ళలు విడుదల చెసారు. ఇప్పటికైనా అక్కినేని అభిమానులు,ఆయన వారసులు మన తపాల శాఖను కలిసి,రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వ సహకారం తో ANR గారికి తపాల బిళ్ళను విడులచేయాలని వినతి పత్రం ఇవ్వాలి.
ఇప్పటివరకు దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొందిన వారందరికి, వారి మరణాంతరం తపాల బిళ్ళలు విడుదల చేస్తారు . దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొందిన అక్కినేనికి కుడా తపాల బిళ్ళ విడుదల చేసే ఆస్కారం మెండుగా ఉంది.
తెలుగు వారందరు గర్వపడేలా వచ్చే ఏడాది ANR గారి జయంతికి ఆంధ్రుల అందాల రాముడు అభిమాన నట సామ్రాట్ పద్మభూషణ్ అక్కినేని తపాల బిళ్ళ విడుదల చేసేలా కృషి జరగాలి
Comments
బాగా చెప్పారు. USPS వారు తమకి అటువంటి ప్లాన్స్ ఏమీ లేవన్నారని ఆన్ లైన్ లో చదివాను. ఈ క్రింది లింక్ లో వివరాలున్నాయి.
========================================
http://linns.com/news/us-stamps/794/Rumor-of-US-stamp-excites-Indian-movie-fans
ఈ క్రింది లింక్ కూడా డిటైల్డ్ గా చెప్తోంది.
teluguonline.net/?p=19152
=======================================
ఇదంతా అమెరికాలోని AFA వారు చేసిన హడావుడి లాగా ఉంది. అమెరికాలో స్వంత డబ్బుతో తమ వారి పేరిట పోస్టల్ స్టాంప్ వేయించుకోవచ్చని, అయితే అటువంటి స్టాంపులు చెల్లుతాయి కాని పోస్టాఫీసులో అమ్మరని పైన ఇచ్చిన teluguonline.net వెబ్ సైట్ చెప్తోంది.
మీరన్నట్లు అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతోను, భారత ప్రభుత్వంతోనూ ప్రయత్నం చేసి భారతదేశ స్టాంప్ విడుదల చేయించుకుంటే హుందాగా ఉంటుంది.