Andhra Pradesh Postal Circle released a Special Cover to mark 81st birth anniversary of Professor Kothapalli Jayashankar on 6th August 2014 at Hyderabad.
6-08-2014 న మన తపాలా శాఖ తెలంగాణా ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయ శంకర్ కు ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసింది. ఆచార్య N. G రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును మార్చి జయశంకర్ గారి పేరు పెట్టి ఆ సందర్బంలో ఈ తపాల కవరు విడుదల చేసారు. బతికి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడిన వీరు మరణించినా తెలుగు జాతి మధ్య విద్వేషాన్ని రగాల్చటానికి ఉపయోగ పడటం శోచనీయం. ప్రపంచ కర్షకులారా ఏకం కండి అని నినదించి రైతు కూలి శ్రేయోరాజ్యం కొరకు జీవితాంతం పోరాడిన రైతు నాయకుడు ,గాన్దేయవాది శ్రీ NG రంగా పేరును తీసి జయశంకర్ పేరు పెట్టేకన్నా ఒక కొత్త విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టటం సరైన నివాళి.
On the view of APPEX-88, A Special cover issued by Indian Post on Rani Rudrama Devi of Kakatiya Dynasty on 8-06- 1988. తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ 8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు. దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు. Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు. రాణి రుద్రమ దేవి అసమాన ధైర్య సాహసాలతో ఆనాటి ఆంధ్రదేశమంతటినీ సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో ఒక మహిళగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

Comments