టంగుటూరి ప్రకాశం పంతులు (1872 - 1957) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.
1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పదకొండు నెలలు పనిచేసారు.ఆ తరువాత 1953 లో ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్య మంత్రి గా దాదాపు 14 నెలలు పనిచేసారు. నిస్వార్ధ ప్రజా సేవకుడు.
ప్రకాశం పంతులు గారి గౌరవార్ధం అక్టోబర్ 16,1972 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.ఈతపాల బిళ్ళ పై తెలుగులో ( టం.ప్రకాశం) అని ప్రకాశంగారి సంతకం ఉంది.తపాల బిళ్ళ పై తొలితెలుగు అక్షరాలు ఇవే.
అదే సమయం లో ప్రకాశం గారి తపాల బిళ్ళతో పాటు మన ప్రజా కవి వేమన, భాయి వీర్ సింగ్ , బెట్రెండ్ రసూల్ కుడా తపాల బిళ్ళలు విడుదల చేసారు
1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పదకొండు నెలలు పనిచేసారు.ఆ తరువాత 1953 లో ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్య మంత్రి గా దాదాపు 14 నెలలు పనిచేసారు. నిస్వార్ధ ప్రజా సేవకుడు.
ప్రకాశం పంతులు తో పాటు వేమన ,వీర్ సింగ్ , బెట్రెండ్ రసూల్ ల ప్రధమ దిన కవర్ |
అదే సమయం లో ప్రకాశం గారి తపాల బిళ్ళతో పాటు మన ప్రజా కవి వేమన, భాయి వీర్ సింగ్ , బెట్రెండ్ రసూల్ కుడా తపాల బిళ్ళలు విడుదల చేసారు
Comments