India Post a Special Postal Cover issued On SHAIK NAZAR (BURRA KATHA) AND GURRAM JASHUVA (WRITER)
on 5 -9- 2014
Special cover on SHAIK NAZAR , GURRAM JASHUVA
GNPS - (Guntur Numismatic and Philatelic Society) ద్విదశాబ్ది వార్షికోత్సవం సందర్బం గా 5-09-2014 న గుంటూరులో ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ కు, ప్రఖ్యాత కవి గుఱ్ఱం జాషువా గార్లకు కలిపి ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు, దీనిపై తపాల ముద్రగా నాజర్ బుర్ర కథ లో వాడే 'తంబూర' , జాషువా రచన 'గబ్బిలం ' పుస్తకం ఉన్నాయి.
షేక్ నాజర్ (1920-1997)
బుర్రకథా పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకుల ముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు, 1997 ఫిబ్రవరి 22న అంగలూరులో మరణించారు. గుంటూరుకు ఎన్‌టిఆర్ వచ్చినప్పుడు నేను మీ అభిమానిని అని నాజర్ చెపితే ‘నేను మీ ఫాన్‌ను’ అని ఎన్‌టిఆర్ చెప్పి అందరినీ ఆనందపరిచారు.ప్రజా కళాకారుడుగా,అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్ నాజర్.
పుట్టిల్లు, అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్ బుర్రకథలు కన్పిస్తాయి 1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది.
గుర్రం జాషువా (1895 - 1971)
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. భారతప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.
Comments